DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ఏఏఐ సిద్ధం : కేంద్ర మంత్రి జయంత్ సిన్హా

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ఏఏఐ సిద్ధం : కేంద్ర మంత్రి జయంత్ సిన్హా 

న్యూఢిల్లీ, జూలై 18 , 2018 (DNS Online ) : విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ

విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆసక్తి చూపుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్‌ సిన్హా

బుధవారం రాజ్య సభలో ప్రకటించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి పై విధంగా స్పందించారు. ఇప్పడికే

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు భూములను స్వాధీన పరుచుకున్నారని, అయితే పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన

ప్రయత్నంలో అవకతవకలు జరిగినందున అప్పడికే పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందా రాదా అనే

అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నందున ఈ విషయాన్నే పార్లమెంట్ ముఖంగా ప్రభుత్వాన్ని విజయ సాయి రెడ్డి అడిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలియచేసింది.

విజయ సాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ ఏరోట్రోపాలిస్‌, యావియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌

(ఎంఆర్‌వో) సౌకర్యాలతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ పరిధిని విస్తరించే ఉద్దేశంతో టెండర్‌ను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట జారీ చేసిన టెండర్‌ను రద్దు

చేసింది. తాజాగా జారీ చేసిన టెండర్‌ బిడ్లను తెరిచిన పిమ్మట ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆసక్తి

చూపినట్లు వివరించారు. తాజాగా జారీ చేసిన టెండర్‌ నియమ నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన సంస్థ విధిగా యావియేషన్‌ అకాడమీ, ఎంఆర్‌వోను

అభివృద్ధి చేయవలసిన అవసరం లేదని మంత్రి వివరించారు. కేంద్రమంత్రి చెప్పిన ప్రకారం ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్మాణాన్ని చేపడితే త్వరితగతిన

భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని à°ˆ తరం ప్రజలు చూసే అవకాశం ఉంది. 

 

pix : courtesy to whom so ever it may own.

@ copy rights reserved

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam