DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి తిరుక్కర్తె, ద్రావిడ ప్రబంధం అధ్యయనం నిషేధం

*విశిష్టాద్వైతంలో ఆళ్వార్లకు అత్యధిక ప్రాధాన్యత. . తిరుక్కార్తె*

*30 నుంచి గృహాల్లో నిలిపివేత, తిరిగి ఫిబ్రవరి 2 నే ప్రారంభం*

*ఆలయాల్లో పగలు పత్తు, రాపత్తు సేవల్లో మాత్రమే పారాయణకు అనుమతి*.

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, నవంబర్ 28, 2020  (డి ఎన్

ఎస్):* భగవద్రామానుజులు ఈ ప్రపంచానికి అందించిన అత్యంత దివ్య ఔషధం విశిష్టాద్వైత సంప్రదాయం. తిరుమల, సింహాచలం, భద్రాచలం సహా. . . అన్ని శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలు, ఆలయాల్లోనూ అన్ని వేళలా అర్చనాది, ఆరాధనలు, ఉత్సవాలు, జరిగేది ఈ విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారమే. దీనిలో శ్రీమహావిష్ణువును మనసా వాచా కర్మేనా ఆరాధించి, జన్మ

సార్ధకం చేసుకున్న భక్తులు ( అన్ని సామజిక వర్గాల వారూ ఉన్నారు ) ఆళ్వార్లు గా ఆలయాల్లో విగ్రహ రూపాల్లో కొనియాడుతుంటారు. ఇలా 12 మంది ఆళ్వార్ లు నెలకొని ఉన్న ఆలయాలను దివ్య క్షేత్రాలు అని ఖ్యాతి గాంచాయి. వీళ్ళు శ్రీమన్నారాయణుని వివిధ క్షేత్రాల్లో కొలువైన మూలమూర్తులను కీర్తిస్తూ చేసిన రచనలే పాశురాలు అని ప్రసిద్ధి

కెక్కాయి. ఇవి మొత్తం 4000 పాశురాలు కలిపి నాలాయిర దివ్య ప్రబంధం అని ఖ్యాతిగాంచాయి. వీటిని ఎక్కడ, ఎలా, అనుసంధించాలి ( చదవాలి ) అనే విషయాలను కూడా ఆచార్యులు విశదీకరించారు. వీటి ని అనుసరించే తిరుమల లాంటి ప్రముఖ ఆలయాల్లోనూ ఆచరించబడుతున్నాయి. వీటి అనుసంధానానికి కొంత పరిమితి కూడా చెప్పడం జరిగింది. తిరుమంగై ఆళ్వార్ లు అనే

ఆళ్వార్లు పుట్టిన నక్షతం నుంచి కూరత్తాళ్వాన్ అనే ఆచార్యులు పుట్టిన నక్షతం వరకూ దివ్య ప్రబంధం చదువ రాదు, అనే నిబంధన ఆచరణలో ఉంది. అయితే దీనిపై విభిన్న కధనాలు ఉన్నాయి. ఆలయాల్లో దివ్య ప్రబంధం విస్తృతం గా ఆచరణలో ఉన్నందున, సంస్కృత గ్రంధాలకు కొంత ఆదరణ తగ్గుతోంది అనే సంశయంతో ఆళ్వార్లు శ్రీ మహావిష్ణువును ప్రార్ధించి, ఈ

సడలింపు చేయించినట్టు కూడా తెలుస్తోంది. ద్రావిడ భాష ( తమిళం) లో ఖ్యాతి గాంచిన పాశురాలు నాలుగు వేదాలకు మరో రూపం గా భావించబడుతున్నప్పడికీ, ప్రత్యక్షంగా వాటికి ప్రాధాన్యత తగ్గుతోందా అనే అనుమానం కూడా వచ్చినందున ఆళ్వార్లకు శ్రీ రంగనాధుడు ఈ వరం అనుగ్రహించినట్టు కధనం ప్రచారం లో ఉంది. ఈ సమయంలోనే విద్యార్థులు, గృహస్తులు,

ఇతర ఆధ్యాత్మిక వేత్తలు ఈ నిషేధ కాలం లో ద్రావిడ ప్రబంధం మినహా ఇతర గ్రంధాలను పారాయణ చేయడం జరుగుతుంది. 
అయితే ఆలయాల్లో స్వామికి ఎటువంటి లోటు జరుగకుండా పగలు పత్తు, రాపత్తు పేరిట సుమారు 21 రోజుల పాటు ప్రబంధ పఠనం జరుగుతుంది. ఇది కేవలం ఆలయాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇళ్లల్లో, పాఠశాలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ

ప్రబంధం పఠించకూడదు అని నియమం అమలులో ఉంది. 

ఈ ఏడాది తిరుక్కర్తె కాలం నవంబర్ 29 , 2020 (తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం) నుంచి ఫిబ్రవరి 2 , 2021 (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం) వరకూ పరిగణించబడుతోంది. ఈ కాలంలో కేవలం సంస్కృత గ్రంధాలూ, వేదపారాయణం, దివ్య ప్రబంధంలోకి రాని పాశురాలను ఆలయాలు, గ్రహాల్లో అనుసంధానం చెయ్యడం

జరుగుతుంది.
  
అయితే ఇదే కాలంలో అత్యంత ప్రసిద్ధ ధనుర్మాసం కూడా వస్తుండడంతో ఆ నెల 30 రోజుల పాటు మాత్రం తొండరడిప్పొడి ఆళ్వార్ (విప్రనారాయణ) రచించిన తిరుపళ్లి యెజూచి, ఆండాళ్ వ్రాసిన తిరుప్పావై లకు వెసులు బాటు కల్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam