DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చేపట్టిన ప్రాజెక్టు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి

*ఎల్ ఆర్ ఎస్ పై ప్రజలకు అవగాహనా కల్పించాలి !!*

*వీఎంఆర్డీఏ కమిషనర్ శ్రీ పి కోటేశ్వరరావు వెల్లడి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 01, 2020  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( విఎంఆర్ డి ఎ) చేపట్టిన ప్రాజెక్టులను త్వరితగతిన

పూర్తి చెయ్యాలని కమిషనర్  పి కోటేశ్వరరావు అధికారులను సూచించారు. మంగళవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులతో ఇంటిగ్రేటెడ్ సీ హారియర్ ప్రాజెక్ట్, ప్లానిటోరియం ప్రాజెక్టు, రహదారి నిర్మాణ పనులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు, నేషనల్ హిస్టరీ అండ్ మ్యూజియం పార్క్ పనులు , ఎన్ఏడి పై వంతెన

నిర్మాణ పనుల పురోగతిపై మరియు కైలాసగిరి హిల్ పార్క్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం LRS పై ప్లానింగ్ విభాగ అధికారులతో సమీక్షించారు.
    ఇంటిగ్రేటెడ్ సీ హారియర్ డిజైన్స్ విషయమై ఆర్కిటెక్ట్  శ్రీ శ్రీనివాస్ మూర్తి గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలసి సమీక్షించారు.
  

 సిరిపురం జంక్షన్ నందు చేపట్టబోయే మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు విషయమై ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధులతో చర్చించి ఈ ప్రాజెక్టు శతశాతం  పూర్తి వాస్తుకు లోబడి భవిష్యత్ అవసరాలకు తగ్గటుగా డిజైన్లను తీర్చిదిద్దాలని కోరారు.నిర్మాణానికై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని కోరారు.
  

 భవిష్యత్తులో కైలాసగిరి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని, అందులో ప్లానెటోరియం అత్యంత ఆధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దబడతుందని, కనుక బృహత్తర ప్రణాళిక  తయారికై తగు చర్యలు తక్షణమే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  దానికనుగుణంగా మౌలిక వసతుల

కల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.
    ఈ-బోనంగి రహదారి నిర్మాణ పనులు, వియంఆర్డిఏ పార్క్ లోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రాం-నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు జనవరి నెలాఖరు లోపు పూర్తి చేసి ఆక్షన్ ప్రక్రియకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. విశాఖ వ్యాలీ దగ్గర 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు

నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయని, డివైడర్ పనులు మరియు లైటింగ్ కొరకు టెండర్లు పిలవడం జరిగిందని తెలియజేశారు.    
    ప్లానింగ్ విభాగ అధికారులతో ఎల్.ఆర్.ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ -2020) పై అవగాహన సదస్సులు ఏర్పాటు విధివిధానాలపై చీఫ్ అర్బన్ ప్లానర్ ని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నెలాఖరు

లోపు ఈ పథకం గడువు పూర్తి కావస్తున్న తరుణంలో ప్రజలకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఎఫ్. ఎమ్ తదితర మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని, తరచూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
    ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ ఇంజనీర్ కే రామ్ మోహన్, చీఫ్ అర్బన్ ప్లానర్ సురేష్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు

 బాలరామ్ రాజు ,  సోమశేఖర్ ,  భవాని శంకర్,  ఉమా శంకర్, మరియు ప్లానింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam