DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాగ్యనగర్ ఓటర్లు పార్టీలకు బాగా గుణపాఠం చెప్పారా?

*భాగ్యనగర్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలేన్నో*  

*పార్టీలు, నేతలపై ప్రవర్తనపై నమ్మకం లేకనేనా?*

*ఢిల్లీ నేతల ప్రచారం పట్టుమని పది ఓట్లు రాబట్టలేకపోయిందా?*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*భాగ్యనగర్ / విశాఖపట్నం, డిసెంబర్ 02, 2020  (డి ఎన్ ఎస్):* భారత దేశ

చరిత్రలో మంగళవారం జరిగిన భాగ్యనగర్ స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం 40 కి మించకపోవడం పై ఎన్నో వ్యాఖ్యానాలు వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ పార్టీలు, నేతల ప్రవర్తనలతో విసిగిపోయిన ప్రజలు, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టే తెలుస్తోంది. 

కనీసం పావు వంతు కూడా ఓట్లు కూడా పొందని వారు కోటి

మందికి ప్రాధాన్యత వహించనున్నారు. 

పార్టీలకు చిత్తశుద్ధి లేదనేనా?. . . 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీలు నెరవేర్చడంలో ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనే విశ్వాసం ప్రజల్లో బలంగా నాటుకోవడంకూడా ఒక కారణం కావచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ ఒకటి, గెలిచాక మారె పార్టీ మరొకటి కావడం కూడా మరొక కారణం కావచ్చు.

తీరా గెలిచినా ప్రజా ప్రతినిధి, తన వ్యాపారాలు, లావాదేవీలు, పంచాయితీలు చేసుకుని, కోట్లు కొల్లగొట్టడానికి పూర్తి సమయం వెచ్చిస్తారు అనే నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుంది. పైగా తాము ఏమి చేస్తామో చెప్పడం కంటే ఎదుటివాడిని తిట్టడం లోనూ, దౌర్జన్యాలు చెయ్యడంలో నేతలు, పార్టీలు ఎక్కువ శ్రద్ధ చూపడం మరో కారణం

కావచ్చు. 

గతంలో గెలిచినా ప్రజా ప్రతినిధులు వెలగబెట్టిన నిర్వాకాలకు పూర్తిగా విసిగి పోయి, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి అని ప్రజలు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. 
పైగా ఓటర్లు అంటే పెద్ద గౌరవం లేని పార్టీలు, వీళ్ళకి రూ. 500 ఇస్తే గొర్రెల్లాగా తలూపుకుంటూ వచ్చి ఓటు వేసి పోతారు అని భావన నిలువు

నింపడం పేరుకుపోయిన రాజకీయ పార్టీలు, నేతలకు ప్రజా విలువ తెలియచేసారు. 

మొత్తం భాగ్యనగరం జనాభా సుమారు కోటి ఉంటుంది. అయితే మంగళవారం జరిగిన ఎన్నిక ఓటింగ్ లో కనీసం 40 శాతం కూడా ఓటింగ్ లో పాల్గొకుండా, కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు.  నగర పరిధిలో ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తులకు 25 శాతం ఓట్లు కూడా రాకుండానే

ఎన్నికవుతున్నారు. అయితే అత్యంత అవమాన కరంగా గెలిచి, చట్ట సభలో అడుగుపెట్టబోతున్నారు. పావు వంతు జనాభాకు కూడా నచ్చని వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఇక పై చలామణి కాబోతున్నారు. 

ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి నాయకులూ వరకు ఎందరో భాగ్యనగర

వీధుల్లో విస్తృత ప్రచారం చేసారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఇలా ఎందరో ప్రచారం చేసినా, పట్టుమని పది శాతం ఓట్లు కూడా పోలింగ్ చేయించలేకపోయారన్నది వాస్తవం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam