DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం ఉన్నా - లేకున్నా ప్రజల వెంటే మేము

*రాజమహేంద్రవరం నగర టిడిపి సమావేశం ప్రకటన* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 02, 2020  (డి ఎన్ ఎస్):*   అధికారంలో ఉన్నా... లేకున్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. అందరం కలిసి పార్టీని మరింత బలోపేతం

చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక మెయిన్‌ రోడ్డులోని  ఓ హోటల్ లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా తెలుగుదేశం పార్టీ

వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు  అధికారంలో ఉండగా ప్రజల సంక్షేమం కోసం చాలా కృషి చేశారని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కూడా ప్రజల శ్రేయస్సు కోసం

కష్టపడుతున్నారన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి నేతను అసెంబ్లీలో హేళన చేసే విధంగా మాట్లాడడం హేయమైన చర్యన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కాకుండా కేవలం బిల్లులు ఆమోదం చేయించుకునేందుకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు

మాట్లాడుతూ అధికారంలో లేమన్న భావన వద్దని, కార్యకర్తల ప్రతి కష్టంలో తోడుంటామని భరోసా ఇచ్చారు. ఏ సమయంలోనైనా కార్యకర్తలకు నాయకులమంతా అందుబాటులో ఉంటామన్నారు. ఇసుక, ఆవ భూముల్లో జరిగిన అవినీతిని బయటకు తీశామని వివరించారు. రాజమండ్రిలో  మంచి నాయకత్వం ఉందని, అందరినీ కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి

చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేయకుండా ప్రజలకు ప్రభుత్వం నవరత్న ఆయిల్‌ వాసన చూపిస్తోందని ఎద్దేవా చేశారు. కావాలనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నారని, ఆ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా రాజమండ్రి నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయకేతనం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం

చేశారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటామన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థను మళ్లీ కైవసం చేసుకుంటామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయాలని

ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా టిడ్కో ఇళ్లకు సంబంధించిన  తమ అధినాయకులు చంద్రబాబు ఆదేశాల మేరకు లబ్ధిదారులను త్వరలోనే కలిసి మహిళలకు ఒక జాకెట్‌, పసుపు - కుంకుమ అందచేస్తామన్నారు. క్రమ శిక్షణమే తమ పార్టీకి బలమన్నారు. టీడీపీ మరో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యర్రా వేణు

గోపాల రాయుడు రాజకీయ అంటే స్వారీ లాంటిదన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలనేవి రాజకీయ పార్టీలకు పరీక్ష లాంటిదని, దానిలో విజయం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి

చేస్తామన్నారు.  మాజీ కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలోని నాయకులను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చినందుకు చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ నాయకులు షేక్‌ సుభాన్‌ మాట్లాడుతూ మైనారిటీల కోసం ఇచ్చిన జీవోలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కండేయస్వామి ఆలయం ఛైర్మన్‌

మజ్జి రాంబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాల తీరు బాగోలేదని, ముఖ్యమంత్రి, స్పీకర్ల తీరును ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.
సత్కారం :
     సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ

కార్యవర్గంలో పదవులు పొందిన వారిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), యర్రా వేణు గోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే

విజయలక్ష్మిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కురుమిల్లి విజయశేఖర్‌, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, ద్వారా పార్వతి సుందరి, బెజవాడ రాజ్‌కుమార్‌, తంగెళ్ళ బాబి, సింహా నాగమణి, మర్రి దుర్గాశ్రీనివాస్‌, పాలవలస వీరభద్రం, కప్పల

వెలుగుకుమారి, నాయకులు మరుకుర్తి రవి యాదవ్‌, నల్లం శ్రీను, రెడ్డి రాజు, కరగాని వేణు, జమ్మి సత్యనారాయణ, బుడ్డిగ రవి, ఛాన్‌ భాషా, కంటిపూడి శ్రీనివాస్‌, కడితి జోగారావు, అట్టాడ రవి, కంటిపూడి రాజేంద్రప్రసాద్‌, కొడమల శ్రీను, మిస్కా జోగినాయుడు, బొచ్చా శ్రీను, గుణవర్తి శివ, కురగంటి త్రినాధ్‌, ఈతలపాటి కృష్ణ, జక్కంపూడి

అర్జున్‌, పితాని కుటుంబరావు, బండారు శ్రీనివాస్‌, శనపతి సత్తిబాబు, దాస్యం ప్రసాద్‌, చొక్కాకుల సూర్య ప్రకాష్‌, సంసాని ప్రసాద్‌, కవులూరి వెంకటరావు, బేసరి చిన్ని, కర్రి సూర్యనాయుడు, మేడికొండ అప్పారావు, యర్రంశెట్టి రాజ్‌కుమార్‌, బంగారు నాగేశ్వరరావు, బర్ల గిరిజ, మీసాల నాగమణి, వీరా రాము, విశ్వనాధ రాజు, నేమాలి శ్రీను,

దుత్తరపు గంగాధర్‌, కానేటి ప్రభు, కానేటి కృపామణి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam