DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో నిధుల దుర్వినియోగం పై కేంద్రానికి ఏపీ సిసిఐ డైరక్టర్ ఫిర్యాదు

*సురేష్ ప్రభు ఆర్ధిక మంత్రి కి రాసిన లేఖపై ఏపీ లో గరంగరం

*దీనిపై కేంద్రం జోక్యం అవసరం: జనసేన నేత మూర్తి యాదవ్* 

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 02, 2020  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం

అవుతున్నాయంటూ కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖ పై ప్రస్తుతం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే సురేష్ ప్రభు రాసిన లేఖలో తనకు ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య మండలి ( ఏపీ సిసిఐ) డైరక్టర్ నరేష్ కుమార్ నుంచి ఒక సూచన పరమైన ఫిర్యాదు లేఖ రూపంలో అందిందని, దానిలో రాష్ట్ర ప్రభుత్వం

ప్రజలను మభ్య పెట్టేందుకు కొన్ని సామజిక కార్పొరేషన్ లను ఏర్పాటు చేసారని, వీటి కోసం, ఇతర సంక్షేమ పధకాల నిర్వహణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను తరలిస్తున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. ఇదే తరహాలో వైఖరి కొనసాగితే పూర్తిగా నిధులు ప్రక్కదారి పడతాయన్నారు. ఎఫ్

ఆర్ బి ఎం పరిధి పై కఠినతరమైన ఆంక్షలు విధించాలని కోరారు. అయితే నరేష్ కుమార్ రాసిన లేఖను అయన బహిర్గతం చెయ్యలేదు. దానిలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని మాత్రం లేఖలో రాసారు. అయితే ఆ లేఖను కూడా జత పరుస్తూ, ఆర్ధిక మంత్రి తన లేఖను పంపారు. 

ప్రభు లేఖపై ఏపీ లో గరంగరం: . . 

ఎంపీ సురేష్ ప్రభు రాసిన లేఖ పై ఆంధ్ర

ప్రదేశ్ లో నేతలు గరం గరం అవుతున్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ నేత ఒకరు మండిపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ సంస్థల నిర్వహణకు నిధులు ఏ విధంగా కేటాయించారు అనే విషయానికి మాత్రం సమాధానం దాటవేశారు. 
 
కేంద్రం జోక్యం అవసరం: జనసేన నేత మూర్తి యాదవ్

మాజీ

కేంద్ర మంత్రి, ఎంపీ  సురేష్ ప్రభు ఆర్థిక మంత్రికి రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుని, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని బహిర్గతం చెయ్యాలని, జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పరిస్థితి చేతులు దాటాక ముందే కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ సిఐఐ డైరక్టర్ రాష్ట్ర

పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే కేంద్రానికి ఫిర్యాదు చేసి ఉంటారన్నారు. 
వందల కోట్లు నిధులు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తీసుకువస్తున్న మాట వాస్తవం అన్నారు. దీనికి తిరిగి ఏ విధంగా చెల్లిస్తారో మాత్రం అధికార పార్టీ బహిర్గతం చెయ్యడం లేదని మూర్తి మండిపడ్డారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam