DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా క్షేత్ర విజయం వెనుక కర్త కర్మ క్రియ బండి సంజయ్ 

*4 నుంచి 49 సీట్లు గెలిచే స్థాయికి చేరడం అంత సులభం కాదు* 

*గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకూ ప్రతిఒక్కరి కష్టఫలితం*  

*దక్షిణాది లో కాషాయం జెండా ఎగరడానికి నాంది ఇది: టి. బీజేపీ*  

*ప్రతి పోటీదారునికి ధైర్యం చెప్తూ. .అండగా నిలిచి. . .*

*ఇలాంటి నాయకత్వం ఉంటె ఏపీ లోనూ బీజేపీ కు విజయం

ఖాయం*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 04, 2020  (డి ఎన్ ఎస్):* ఈ నెల 1 న జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలను ధీటుగా ఎదుర్కొని ప్రజా క్షేత్ర పోరాటంలో విజయం సాధించడం అంత ఆషామాషీ విషయం కాదు. తెలంగాణ లో కేవలం 2

ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ప్రజా బలాన్ని పొందడంలో పడిన కష్టం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కి ఒక మార్గదర్శకం గా నిలుస్తుంది. కనీసం అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, స్థానిక క్షేత్ర స్థాయిలో ప్రజాబలం కూడగట్టడం వెనుక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కృషి కి తెలంగాణ టైగర్

రాజాసింగ్, ఎంపీ అరవింద్ ల సహకారం సంపూర్ణంగా తోడయ్యింది. 

సమష్టి కృషికి ఫలితం ఈ విజయం: . .

ఇది పూర్తిగా కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకూ ప్రతి ఒక్కరూ చేసిన కృషికి ఫలితం. గతం లో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ వాటిని ఓట్లు గా మార్చుకోవడంలో విఫలం అయ్యారు. అయితే రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చి,

యువతకు ప్రధానంగా పట్టుదల ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్లకి అప్పగించడంతో పటిష్టమైన ఫాలోయింగ్ ఉన్న కేసీఆర్ లాంటి వాళ్లకి నిద్ర పట్టలేదంటే అతిశయోక్తి కాదు. దీనికి నిదర్శనమే దుబ్బాక ఉప ఎన్నికలో పూర్తిస్థాయి ప్రచారం చేయడమే కాక, మొత్తం మంత్రులు, ఎంపీలు, స్వయంగా కెసిఆర్ సైతం ప్రచార రంగంలోకి దిగాడు అంటే యువ నాయకత్వంతో

తెలంగాణ బీజేపీ ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలుస్తోంది. 

తరుచుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా కేంద్రమంత్రులు సంజయ్ తో చర్చలు జరుపుతూ సూచనలు చేసారు. సాధారణ ఎన్నికలను సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని ద్విగుణం, బహుణం చేసారు. మంచి ఫలితాలను

రాబట్టగలిగారు. ఈ విజయంలో అందరికంటే అధికంగా శ్రమపడింది, ఒత్తిళ్లను ఎదుర్కొన్నది కూడా బండి సంజయ్ మాత్రమే. అయినప్పటికీ విజయాన్ని మొత్తం పార్టీ క్యాడర్, నాయకులకు అప్పగించి పూర్తి నాయకత్వ లక్షణాలను ప్రకటించాడు. 

బరిలో నిలిచినా ప్రతి సభ్యునికి ప్రతి రోజు ధైర్యం చెప్తూ, ప్రచారం లో ఎదురైన సమస్యలకు పరిష్కారం

చూపుతూ, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపిన పూర్తి స్తాయి నాయకుడు బండి సంజయ్. 

అధికార పార్టీ చేస్తున్న కుట్రేట్లను బహిరంగంగానే ఎండగడుతూ, ప్రజలకు మీడియా ద్వారా ఎప్పడికప్పుడు తెలియచేయడం ఈ విజయం లో కీలక పాత్ర పోషించింది. 

టి బీజేపీ కి ఘన విజయాన్ని అందించిన భాగ్యనగర్ ప్రజలకు తెలంగాణ బీజేపీ

అధ్యక్షుడు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కి 50 సీట్లు అందించి, అభివృద్ధి కి నగరవాసులు స్వాగతం పలికారన్నారు.  గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్లు మాత్రమే సాధించగలిగింది, అయితే గల్లీ లోని సామాన్య కార్యకర్తల నుంచి ఢిల్లీ నేతల వరకూ ప్రజలతో మమేకమై వారికి ధైర్యాన్ని

కల్గించారన్నారు. కేవలం ప్రజా ఆశీర్వాదం వల్లనే నేడు  50 సీట్లు గెలిచే స్థాయికి చేరగలిగామన్నారు. ఈ విజయం అంత సులభం కాదన్నారు.  

అధికార పార్టీ కుట్రలను ప్రజలు తునాతునకలు చేశారన్నారు. ఎన్నికలు తేదీల ప్రకటన విడుదల రోజు నుంచి కౌంటింగ్ జరిగిన ఈ రోజు వరకూ అధికార పార్టీ చెయ్యని కుట్రలు లేవన్నారు. వీటిని ప్రజలు

గమనించి, అధికార పార్టీకి గట్టిగా బుద్ది చెప్పారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam