DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రవ్యాప్తంగా 9 వేల బడ్జెట్ స్కూళ్ళని బ్రతికించండి మహాప్రభో

*ఏపీ ప్రైవేట్ స్కూళ్ల సమావేశంలో మంత్రి కన్నబాబుకు వేడుకోలు* 

*సూరంపాలెంలో 800 స్కూళ్ల నిర్వాహకులతో భారీ సమావేశం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 05, 2020  (డి ఎన్ ఎస్):* రాష్ట్ర వ్యాప్తంగా చిన్న స్థాయి బడ్జెట్ స్కూళ్లకు సంపూర్ణ సహకారం

అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో సూరంపాలెం లో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్సు మేనేజ్మెంట్ సంఘం ( APPUSMA ) రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి

కురసాల కన్నబాబు ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్ని ప్రయివేట్ స్కూళ్లకూ ఒకే తరహా ఆదాయం ఉండదని, అయితే చిన్న స్థాయి బడ్జెట్ స్కూళ్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. ప్రయివేట్ స్కూళ్ల ను నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందడమే కాక, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ప్రయివేట్

స్కూళ్ల నిర్వాహకులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్సు మేనేజ్మెంట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి రామచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. తులసి విష్ణు ప్రసాద్ లు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వేల బడ్జెట్ స్కూళ్ళని బ్రతికించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా చిన్న స్థాయి పాఠశాలలు సుమారు 9 వేలు ఉన్నాయని, వీటికి అతి తక్కువ ఆదాయం ఉంటుంది, నిర్వహణ సైతం పూర్తి భారంగా మారిపోయిందన్నారు. కరోనా కాస్త కాలంలో కనీసం పాఠశాలకు అద్దెలు కూడా చెల్లించలేని స్థితి కి చేరాయన్నారు. కార్పొరేట్ స్కూళ్ళు స్థితి కొంతవరకూ బాగానే ఉంటుందని, ప్రస్తుతం రాష్ట్ర విద్య శాఖా అన్ని

ప్రయివేట్ స్కూళ్లకూ ఒకే స్థాయిలో పన్నులు వసూలు చేస్తోందని తెలిపారు. దీని ద్వారా తక్కువ ఆదాయం ఉన్న బడ్జెట్ స్కూళ్ళు మూసుకునే స్థితి వచ్చేసిందన్నారు. దీనిపై మంత్రి అందరికి అనుకూలంగా ఉండే విధంగా ప్రణాలికను సిద్ధం చెయ్యాలని సూచించారు. ప్రయివేట్ స్కూళ్లను మూడు కేటగిరీల్లో విభజించాలని, అతి తక్కువ ఆదాయం, సాధారణ

ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ళు ఇలా వారి ఆదాయం బట్టి స్కూళ్లకు పన్నులు విధించాలని సూచించారు. 
ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 800 స్కూళ్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం లో సంఘం సలహాదారు ఎం. శేషారెడ్డి, తూగో జిల్లా అధ్యక్షుడు టి వి వెంకటేశ్వర రావు, కార్యదర్శి కళ్యాణ్ రెడ్డి,

తూగో జిల్లా బిక్కవోలు మండల స్కూళ్ల ప్రతినిధి ఎం సి హెచ్ భాను ప్రసాద్ (రంగాపురం), తదితరులు పాల్గొన్నారు.  

స్కూళ్లను ఆదుకోండి తూగో జిల్లా సంఘాల వినతి:

రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎదురుకుంటున్న సమస్యలను తూర్పుగోదావరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మతుకుమిల్లి శ్రీవిజయ్

మంత్రి కన్నబాబుకు వివరించారు. ఒక ప్రక్క కరోనా మరో ప్రక్క ప్రభుత్వ సంస్కరణలు కారణంగా ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ 29 మంది చనిపోయారని ఇందులో కొందరు ఆత్మ హత్యలు కొందరు భయాందోళనలతో చనిపోతున్నారని తెలియజేసారు. ఈ రంగం మీద ప్రత్యక్షము గా, పరోక్షం గా గాని మొత్తం 5 లక్షల వరకు ఆధారపడి జీవిస్తున్నారని వారందరిని

ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మంత్రిని కల్సిన వారిలో జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి సురేష్, రూరల్ అధ్యక్షడు  పాలిక నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam