DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*అజెండా కాంగ్రెస్‌ది.. అవిశ్వాస తీర్మానం తెలుగుదేశానిది*

న్యూ ఢిల్లీ, జులై 19 , 2018 (DNS Online):  à°•à°¾à°‚గ్రెస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ, వారి అజెండాను అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ à°ˆ అవిశ్వాసాన్ని పెట్టడం పూర్తిగా అనైతికమని

- à°¢à°¿à°²à±à°²à±€ లోని ఆంధ్ర ప్రదేశ్  à°¬à±€à°œà±‡à°ªà±€ కోఆర్డినేటర్ - రఘురాం పురిఘళ్ల ఎద్దేవా చేశారు. గురువారం పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పై అయన

మండిపడ్డారు. 
ఎన్డీయే కూటమి, అందులోని ప్రధాన పార్టీ బీజేపీకి సభలో స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడం కేవలం

ప్రజలను మోసం చేయడమేనని, à°µà°¿à°ªà°•à±à°· పార్టీలన్నిటికీ కలిపి 145 మంది సభ్యుల బలం ఉందని, అన్నాడీఎంకే, టీఆరెస్, బీజేడీ వంటి తటస్థ పార్టీలకు సుమారు 90 మంది సభ్యులున్నారు.

అదేసమయంలో ఎన్డీయే కూటమి బలం 311కి పైచిలుకు ఉంది. ఎన్డీయే పార్టీలన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. శివసేన లాంటివి అప్పుడప్పుడు కస్సుబుస్సులాడినా ప్రభుత్వంపై

అవిశ్వాసం విషయానికొచ్చేసరికి కచ్చితంగా విశ్వాసం ప్రకటిస్తారన్నారు. .
కాంగ్రెస్ పార్టీ ఒక అజెండా పెట్టుకుని తెలుగుదేశాన్ని ముందు పెట్టి ఈ అవిశ్వాసం

డ్రామా నడిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అజెండాను అమలు చేసే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఇక్కడ టీడీపీ పనిచేస్తోందన్నారు.


*మేం లేకపోతే టీడీపీ

ప్రభుత్వమే ఏర్పడేది కాదు* :

 

గత ఎన్నికల్లో మావల్లే తెలుగుదేశం పార్టీకి ప్రజలు అనుకూల తీర్పు ఇచ్చారు. పవన్ కల్యాణ్, బీజేపీ కలిస్తేనే తెలుగుదేశం. ఈ

రెండు పార్టీల వల్ల తెలుగుదేశం గెలిచిందని, గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 1 శాతం ఓట్ల తేడాతోనే వెనుకబడింది. మా మూడు పార్టీలు కలిసినప్పుడే జగన్ ఒంటరిగా అంతవరకు

వచ్చారంటే బీజేపీ, పవన్ కల్యాణ్ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదా? అని ప్రశ్నించారు. à°† వాస్తవాన్ని అంగీకరించే గుండె ధైర్యం తెలుగుదేశానికి ఉందా

?

అసెంబ్లీ సీట్లు పెంచలేదని వెళ్లిపోయారు

అసలు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వెళ్లిపోవడానికి కారణమేంటి ?  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రయోజనాల కోసమా? కానే కాదు..

అసెంబ్లీ సీట్లు పెంచడం కుదరదు అని కేంద్రం చెప్పడంతో ఎన్డీయే నుంచి వెళ్లిపోయంది. అంతేకానీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రం కాదని, ఇప్పుడు అవిశ్వాసం

పెట్టే హక్కు కూడా తెలుగుదేశానికి లేదు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎంపీలను, 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రులను చేసిన పార్టీ అది. అలాంటి

తెలుగుదేశం పార్టీకి నైతికత, అవిశ్వాసం పెట్టే హక్కు ఎక్కడుందన్నారు?

గత ఎన్నికల్లో తెలుగుదేశానికి అండగా ఉన్న పవన్ కల్యాణ్ ఇవ్వాళ టీడీపీ ప్రభుత్వం

అవినీతి కంపును భరించలేక బయటకు వెళ్లిపోయారని,  à°…సెంబ్లీ సీట్లు పెంచలేదన్న కారణంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయింది. ఇలా... ఒకవైపు ప్రజలను, మరోవైపు

మిత్ర పక్షాలను మోసం చేసిన పార్టీ టీడీపీ. బీజేపీతో కలిసి అయిదేళ్లు రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు అవకాశమిస్తే అటు ప్రజలను, ఇటు మిత్రపక్షాలను కూడా మోసం

చేసింది తెలుగుదేశం.

చంద్రబాబు పతనానికి ఈ అవిశ్వాసమే నాంది

రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిప్పుడు మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమేం చేసిందో

అంతా చెప్తాం, ఏపీ అభివృద్ధిలో మా పాత్రేమిటో ప్రధానమంత్రి, మా మంత్రులు కచ్చితంగా చెప్తారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని ప్రకటించారు.
ఏపీలో బీజేపీ

అభివృద్ధికి ఈ అవిశ్వాసం కచ్చితంగా సువర్ణావకాశం. చంద్రబాబు నాయుడిని ఇప్పటికే ఎండగట్టాం.. ఎండగడుతున్నాం.. ఎండగడతాం కూడా. చంద్రబాబు పతనానికి ఈ అవిశ్వాసమే

నాంది. 

*టీడీపీ ఎంపీలకే నమ్మకం లేదు* :

చంద్రబాబు నాయుడి పార్టీకే చెందిన ఎంపీ జేసీ దివాకరరెడ్డి తాను అవిశ్వాస తీర్మానంపై ఓటింగులో పాల్గొనబోనని

చెప్పారు. ఈ అవిశ్వాసం వల్ల ఏమీ కాదని... విప్ జారీ చేసినా తాను వెళ్లకపోతే ఏమీ కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంటున్నారు. ఆ పార్టీ ఎంపీల్లోనే విశ్వాసం లేదు

ఇంకా మాపై వారు పెట్టే అవిశ్వాసానికి అర్థం ఏముంది?

చంద్రబాబు నాయకత్వంపై ఆ పార్టీ ఎంపీకి విశ్వాసం లేనప్పుడు అలాంటి పార్టీ మా నాయకత్వాన్ని ఇంకేం

ప్రశ్నిస్తుందని ఎద్దేవా చేశారు ?

గట్టిగా 150 మంది మద్దతు కూడా లేని విపక్షాలు అవిశ్వాసంతో ఏదో సాధిద్ధామనుకోవడం ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం తప్ప ఇంకేమీ

కాదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam