DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత: జనసేనాని పవన్

*జనసేన డాక్టర్ల పరిశీలనలో వెల్లడైన అంశాలు*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 09, 2020  (డి ఎన్ ఎస్):* అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య ఏలూరులో ఇంకా కొనసాగుతూనే ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు 600  మందికిపైగా

ఆస్పత్రి పాలవగా సుమారు 470 మంది డిశ్చార్జు అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు, అధికారులు చెబుతున్న వివరాల ద్వారా వెల్లడవుతోంది. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు. ఏలూరులోని కొన్ని ప్రాంతాలవాసులు వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారంటే అక్కడి పరిస్థితిని మనం అర్ధం చేసుకోవచ్చు. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి

నేతృత్వంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారు, డాక్టర్ ఎమ్.వెంకటరమణ గారు నేను చెప్పిన వెంటనే మంగళవారం నాడు ఏలూరు వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో పర్యటించి నాకు నివేదికను అందజేశారు. వారు పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే చిన్న చిన్న వసతులను సైతం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో అర్ధంకావడం లేదు. ముఖ్యంగా

చిన్న పిల్లలకు ఐ.సి.యు లేకపోవడం, ఈ అంతుచిక్కని వ్యాధి రోగులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు అందించడం, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం వంటి విషయాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. బాధితులు ఫిట్స్ కు గురవుతున్నారంటే చికిత్స

అందించవలసింది న్యూరోఫిజీషియన్ అయినప్పుడు కనీసం పక్కనున్న విజయవాడ నుంచి అయినా న్యూరోఫిజిషియన్లను ఏర్పాటు చేయవచ్చు కదా? ఈ వ్యాధికి కలుషిత నీరు కూడా ఒక కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీరును ఎందుకు సరఫరా చేయడం లేదు? ఇటువంటి ప్రశ్నలకు జగన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

పరిస్థితులను చక్కదిద్దాలి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఇక్కడ ఎటువంటి అదనపు సదుపాయాలు ఏర్పాటు కాకపోవడం గమనించ తగ్గ విషయం. ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసారు. 

డాక్టర్ల బృందం

నివేదికలో ముఖ్యాంశాలు:
వ్యాధి లక్షణాలు :
• వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఒక్కసారి మాత్రమే మూర్ఛ వస్తుంది. రిపీట్ కావడం లేదు. కొంతమందిలో మతిమరపు, వాంతులు, విరోచనాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కూడా 80 శాతం మందిలో నీరసం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి  లక్షణాలు ఉన్నాయి.
• ప్రత్యేకించి ఫలానా

వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు. అన్ని వయసుల వారు అస్వస్థతకు గురవుతున్నారు.
• వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది. వ్యాధి బారిన పడినవారు ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపించడం లేదు.
• ఏలూరు మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాలైన

దెందులూరు, నారాయణపురం, కొవ్వలి, కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరులో కూడా ఫిట్స్ కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.
• వ్యాధిబారిన పడ్డ వారిలో సీటీ స్కాన్, రక్త నమూనాలు పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా అందులో పరిమితికి మించి లెడ్, నికెల్ వంటి లోహాలు లేవని అధికారులు

ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్‌ పరీక్షల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడలేదు.
అనుమానాలు :
• వాయు కాలుష్యం వల్ల వ్యాధి విస్తరించలేదు. నీటి కాలుష్యం లేదా ఆహార కాలుష్యం వల్ల వ్యాధి ప్రబలి ఉండాలి. గాలి కాలుష్యం వల్ల వ్యాధి ప్రబలితే ఇప్పటికే చాలా ఎక్కువ

మందిలో వ్యాధి లక్షణాలు కనిపించి ఉండాలి.    
• ఏలూరులో ఆక్వాకల్చర్ ఎక్కువ. వాటి వ్యర్ధాలు ఏమైనా తాగునీటిలో కలవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటారు. ఫిష్ పాండ్స్ లో వాడిన కెమికల్స్ వల్ల కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
• కూరగాయలపై చల్లిన

రసాయనాల వల్ల కూడా వ్యాధి రావొచ్చు కనుక వెంటనే కూరగాయల నమూనాలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు పంపించి పరీక్షించాలి. అలాగే రసాయన విశ్లేషణ కోసం ఐఐసీటీకి నమూనాలు పంపించాలి.  
• ఏలూరులో నీటి కాలుష్యం చాలా ఏళ్లుగా ఉంది. మంచినీటి పైపులైన్లల్లో డ్రైనేజీ వాటర్ కలిసిపోతుంటాయి. అలా జరగడం వల్ల కూడా ఈ వ్యాధి

వచ్చే అవకాశం ఉంది. అలాగే   మున్సిపల్ వాటర్ ను సరిగా క్లోరినేషన్ చేయకపోవడం, క్వాలిటీ బ్లీచింగ్ పౌడర్ వాడకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam