DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిషాన్ ఇంపాజిబుల్ చిత్ర పోస్టర్ పై ధార్మిక సంఘాలు మండిపాటు 

*తుపాకీలతో కృష్ణుడు, శివుడు, హనుమాన్ పోస్టర్ విడుదల*   

*పౌరాణిక పాత్రలు హేళన చేసిన వాళ్లపై చర్యలకై డిమాండ్*
 
*ఇలాగే క్రైస్తవ, ఇస్లాం మత పాత్రలను చిత్రీకరించగలరా?*

విహెచ్పి ప్రాంతీయ ప్రముఖ్ డా. సత్యనారాయణ డిమాండ్  

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, డిసెంబర్ 12, 2020  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మాన్ని 
బ్రష్టు పట్టించే విధంగా, హిందూ పౌరాణిక పాత్రలను నీచంగా, తీవ్రవాదులుగానూ, హిందూ పౌరాణిక పాత్రలను అవహేళన చేస్తూ తీస్తున్న మిషన్ ఇంపాజిబుల్ చిత్రాన్ని తక్షణం బ్యాన్ చెయ్యాలని, విశ్వహిందూ పరిషత్ విశాఖ ప్రాంతీయ ప్రముఖ్ డాక్టర్

కెవివివి సత్యనారాయణ డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు. 

శివుడు, కృష్ణుడు, హనుమాన్ పాత్రధారుల (పిల్లలు) చేతుల్లో తుపాకీలు ఉన్న పోస్టర్ విడుదల చేసిన మిషన్ ఇంపాజిబుల్ చిత్ర యూనిట్ శనివారం ఒక పోస్టర్ విడుదల చేసింది. దీనిపై వి హెచ్ పి ప్రముఖ్ మండిపడుతున్నారు. కోట్లాది మంది ఆరాధించే హిందూ పౌరాణిక పాత్రలను

ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం ఈ చిత్ర యూనిట్ చేసిందని మండిపడుతున్నాయి. సినిమాలో ముగ్గురు పిల్లలు ఒక హాస్య స్కిట్ చేసే ప్రయత్నం ఈ మూడు పాత్రలూ తుపాకీ లు పట్టుకున్నట్టు చిత్రీకరణ జరిగినట్టు తెలుస్తోందన్నారు. 

ఇదే విధంగా క్రైస్తవ, ఇస్లాం మత సంబంధ పాత్రలను అవహేళన చేస్తూ సినిమాలు తియ్యగలరా అని

ప్రశ్నించారు. ఇది పూర్తిగా హిందూ ధర్మాన్ని కించరచడమేనన్నారు. 

ప్రధానంగా ఈ పోస్టర్ ఉన్న చిత్రం లో రెండు ప్రధాన నేరాలు ఉన్నాయి. హిందూ పౌరాణిక పాత్రలను ఉగ్రవాదులుగా చూపించి వారిని కించపరచడం, రెండవది చిన్న పిల్లలకు తుపాకీలు ఇచ్చి, వారిలో ఉగ్రవాద లక్షలను ప్రేరేపించేలా చెయ్యడం రెండూ తప్పేనని ధార్మిక

సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం ఈ చిత్రం ఈ దృశ్యాలను తొలగించి, చిత్ర యూనిట్ బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఏజెంట్ ఆత్రేయ సినిమా చిత్ర దర్శకుని (ఆర్ ఎస్ జె స్వరూప్) ద్వారా ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది. కాగా నిర్మాత నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు. 

ఇకపై

ఎవరైనా హిందూ ధార్మికతకు భాగం కల్గించే విధంగా సినిమాలు తియ్యడం, పౌరాణిక పాత్రలను కించపరుస్తూ చిత్రాలు కానీ, హాస్య సన్నివేశాలు గానీ చిత్రీకరిస్తే వాళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam