DNS Media | Latest News, Breaking News And Update In Telugu

16 నుంచి వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసం వ్రతారంభం

*15 నుంచి అధ్యయనోత్సవాలు, పగలు పత్తు ప్రారంభం* 

*కరోనాసురుడి పతనం కోసం ఆలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు*

*విజయ కీలాద్రి పై చిన్న జీయర్ స్వామి చే వేడుకలు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 14, 2020  (డి ఎన్ ఎస్):* మాసానామ్ మార్గశీర్షోహం.

.మాసాల్లో మార్గశీర్షం నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పడం ద్వారా ఈ మార్గశీర్ష మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందొ తెలుస్తోంది. భగవంతుని చేరుకోవడమే లక్ష్య సాధనే ఆండాళ్ ఆచరించి చూపించిన ధనుర్మాస వ్రతం ఈనెల 16 నుంచి అన్ని వైష్ణవ ఆలయాలు, గృహాల్లో ఆరంభం అవుతోంది. ఈ నెల రోజుల వేడుకలను అత్యంత వైభవంగా బుధవారం

నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న నెల రోజుల పాటు అన్ని వైష్ణవ క్షేత్రాలు ( ఆలయాలు ), వైష్ణవ సాంప్రదాయ పరుల గృహాల్లోనూ తెల్లవారుఝామునుంచే ప్రత్యేక ఆరాధనలు మొదలవుతాయి. 

భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఏకైక సంకల్పంతో ఆండాళ్ 8 వ శతాబ్దం లోనే తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూర్ పట్టణంలో ఈ

వ్రతాన్ని ఆచరించి, తన ఆశయ సాధన మేరకు శ్రీరంగనాథున్ని వివాహం చేసుకుని, స్వామిలో ఐక్యం అయ్యింది. దీనికి చారిత్రక అధరాలు సైతం ఉన్నాయి. ప్రస్తుత కాలంలోనే ఒక సాధారణ మహిళా ఆచరించి చూపించిన వ్రతాన్ని మొత్తం వైష్ణవ సాంప్రదాయ పరులందరూ ప్రతి ఏడాది ఒక వేడుకలా ఆచరిస్తుంటారు. 

ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకూ

నిర్వహించుకునే ఈ వేడుకల్లో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25 న రావడం, జనవరి 3 న నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం,  జనవరి 11 న కూడారై ఉత్సవం, జనవరి 13 న భోగి, గోదాకల్యాణం అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం వేళల్లోనే తిరుప్పావై పాశుర సేవ ఉంటుంది. ఈ నెల రోజుల్లో విశేష పాశురాల సమయంలో  విశేష అలంకారం, ప్రత్యేక

ఆరాధనలు జరుగుతుంటాయి. ఈ నెలరోజుల వేడుకలో ఆలయాల్లోనూ, గృహాల్లోనూ అందరూ కలిసి గోష్టి గా తిరుప్పావై పాశుర అనుసంధానం జరుగుతుంది. 

ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనాసురుడి పతనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక ఆరాధనలు జరిపేందుకు ఆలయాల్లో వేడుకలు నిర్వహించేందుకు

సిద్ధమవుతున్నారు. 

*15 నుంచి అధ్యయనోత్సవాలు, పగలు పత్తు ప్రారంభం: . .* 

12 మంది ఆళ్వార్లలో ఎంతో ప్రాధాన్యత కల్గిన నమ్మాళ్వార్లు స్వామిని చేరుకున్న రోజున  నమ్మాళ్వార్ల పరమపదోత్సవం (జనవరి 3 ) ఎంతో వైభవంగా జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని కొన్ని ఆలయాల్లో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తుంటారు. వైకుంఠ

ఏకాదశి (డిసెంబర్ 25 ) కు ముందు 10 రోజులు పగలు పత్తు గాను, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతుంటాయి. జనవరి 3 న (ఆఖరి రోజున ) నమ్మాళ్వార్లకు పరమ పదోత్సవం చేయడం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ భక్తులకు ఇచ్చే శఠారి గా మారినవారు నమ్మాళ్వార్. 

పగల పత్తు ఉత్సవం . . ఆలయంలో ఉదయం ఆరాధన పూర్తి అయిన తదుపరి ద్రావిడ ప్రబంధం

పారాయణ చేయడం జరుగుతుంది.

రాపత్తు సాయంత్రం ఆలయంలో ఆరాధనలు ముగిసిన అనంతరం ద్రావిడ ప్రబంధం పారాయణ చేయడం నిర్వహిస్తుంటారు. 

నాదమునుల ఆదేశానుసారము, శ్రీవైకుంఠ ఏకాదశి మునుపు అమావాస్య నుండి మొదటి పది రోజులు (పగలు పత్తు లో) ముదలాయిరము ( తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, నాచ్చియార్ తిరుమొళి,

పెరుమాళ్ తిరుమొళి,  తిరుచ్ఛంద విఱుత్థం,  తిరుమాలై , తిరుప్పళ్లిఎళ్ళుచ్చి, అమలనాదిపిరాన్, కణ్ణినుణ్ శిరుత్తాంబు,)  రెండవ ఆయిరము ( పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండకం  అనునవి) అనుసంధింపబడుతాయి.
       శ్రీవైకుంఠ ఏకాదశి రోజున తిరువాయ్ మొజి తొళక్కము (ప్రారంభము) అనుసంధింపబడుతుంది. శ్రీవైకుంఠ

ఏకాదశి దినము ఉదయము వేదపారాయణము, సాయమువేళలో తిరువాయ్ మొజి దినమునకు ఒక పత్తు, పది దినములు అనుసంధింపబడుతుంది. చివరిరోజున  ఘనముగా శాత్తుమురై  నిర్వహింపబడుతుంది.

*విజయ కీలాద్రి పై చిన్న జీయర్ స్వామి చే వేడుకలు*

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ఎన్నో వేదపాఠశాలల, అధ్యయన కేంద్రాల స్థాపకులు, త్రిదండి చిన్న

జీయర్ స్వామి ధనుర్మాస ఉత్సవాలను విజయవాడ సమీపంలోని విజయకీలాద్రి జీయర్ ఆశ్రమం లో ఈ నెల 15 నుంచి అధ్యయనోత్సవాలతో ప్రారంభిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam