DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేదలందరికీ ఇళ్లులో 30.75 లక్షల మందికి లబ్ది: మంత్రి బొత్స

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 15, 2020  (డి ఎన్ ఎస్):*  పేదలందరికీ ఇళ్లు / పట్టాలు ఇవ్వాలన్న బృహత్తర సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన  నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని విజయవంతం

చేయడానికి మున్సిపల్ కమిషనర్లందరూ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ నెల 25 వ తేదీ నుంచి, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న 2.62 లక్షల ఇళ్లతోపాటు, అర్హులైన సుమారు మరో 9 లక్షల మందికి పట్టాలు/ధృవీకరణ పత్రాలు ఇచ్చే ఈ బృహత్తర పథకంలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా,

అధికారులందరూ పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు/పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, సిడిఎంఎ విజయకుమార్, పురపాలకశాఖ ప్రత్యక కార్యదర్శి రామమనోహర్, టిడ్కో ఎండి శ్రీధర్ , మెప్మా తదితర ఉన్నతాధికారులతో విజయవాడలోని ఎఎంఆర్ డి ఎ కార్యాలయం నుంచి

మున్సిపల్ కమిషనర్లు, రీజినల్ డైరక్టర్లతో మంగళవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా యంత్రాగం, ప్రజాప్రతినిధులందరిని భాగస్వామ్యులను చేసుకుంటూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 
టిడ్కో ద్వారా నిర్మిస్తున్న ఇళ్లల్లో 300 చదరపు అడుగుల

విస్తీర్ణంలోని వాటిని లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందచేయాలని, వాటిని కేవలం కేవలం ఒక రూపాయి ఫీజుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్లకు కూడా రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్లను పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో యూనిట్ల లబ్ధి దారుల నుంచి  అప్ ఫ్రంట్ మొత్తంగా 365

చదరపు అడుగుల యూనిట్లకు రూ.50 వేలు, 430 చదరపు అడుగుల యూనిట్లకు రూ. ఒకలక్ష చెల్లించాలని నిర్దేశించగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇచ్చి లబ్ధిదారుల నుంచి కేవలం రూ.25 వేలు (365 ఎస్ఎప్ టి), రూ.50 వేలు (430 ఎస్ ఎప్ టి ) మాత్రమే లబ్ధిదారులు చెల్లిస్తే చాలని తీసుకున్న నిర్ణయాన్ని అందరికీ

వివరించాలన్నారు. 
    ఈ 15 రోజులపాటు కొనసాగే ఇళ్లు/పట్టాల పంపిణీ కార్యక్రమ నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తూ, ముఖ్యంగా లబ్ధిదారులు తీసుకురావాల్సిన ధృవపత్రాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమం పక్షం రోజుల పాటు కొనసాగనున్నందున, లబ్ధిదారులందరినీ ఒకే రోజు పిలవకుండా,

ప్రతి రోజు నిర్దేశిత సంఖ్యలో వచ్చేట్లుగా చూసుకోవాలన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా పత్రాలను లబ్ధిదారులకు అందచేసే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధుల సమయాన్ని సమన్వయం చేసుకుంటా నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే శాఖాపరంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ

నిర్వహించడానికి అవసరమైన కంప్యూటర్లు, స్కానర్ల వంటి వాటిని కూడా ముందుగానే సమకూర్చుకుని, ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎటువంటి అపోహలు, తొక్కిసలాటలు లేకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam