DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతానగరం విజయ కీలాద్రి పై చిన్న జీయర్ స్వామి ధనుర్మాస వ్రత దీక్ష

*డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకూ వైభవంగా వేడుక*

*ఈనెల 19 న సమాశ్రయణం అనుగ్రహం, మరోసారి 27 న*   

*అధ్యయనోత్సవాలు, పగలు పత్తు ప్రారంభం: . .* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 15, 2020  (డి ఎన్ ఎస్):* ఈనెల 16 నుంచి ప్రారంభమవుతున్న ధనుర్మాసోత్సవ

వేడుకలు దేశ విదేశాల్లోని అన్ని వైష్ణవ క్షేత్రాలు, ఆలయాలు, గృహాల్లో బుధవారం ఉదయం  వైభవంగా సంప్రదాయ పరంగా ప్రారంభమవుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ఎన్నో వేదపాఠశాలల, అధ్యయన కేంద్రాల స్థాపకులు, శ్రీమదుభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు   త్రిదండి చిన్న జీయర్ స్వామి ధనుర్మాస ఉత్సవాలను విజయవాడ సమీపంలోని

విజయకీలాద్రి జీయర్ ఆశ్రమం లో ఈ నెల 15 నుంచి అధ్యయనోత్సవాలతో ప్రారంభిస్తున్నారు. 
ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గోడ అష్టోత్తర నామార్చన, తిరుప్పావై సేవాకాల గోష్టి, నివేదన, తీర్థగోష్టి, తదుపరి త్రిదండి అహోబిల జీయర్ స్వామి తిరుప్పావై ప్రవచనం కొనసాగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5 :30 గంటలకు సామూహిక శ్రీ

విష్ణు సహస్రనామ పారాయణ, అనంతరం చిన్న జీయర్ స్వామి ప్రవచనం జరుగనున్నాయి. 

ఈ నెల 25 న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, గీత జయంతి, జనవరి 3 న  నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం, జనవరి 8 న దీపోత్సవం ( అన్రు పాశురం), జనవరి 11 న కూడారై ( గోష్టి) వేడుక, జనవరి 13 న గోదా రంగనాధుల కళ్యాణం ( భోగి) వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.    

  

రెండు సార్లు సమాశ్రయణ దీక్ష అనుగ్రహం:. . .

ప్రతి శ్రీవైష్ణవ సంప్రదాయ పరునికి పంచసంస్కారం తప్పని సరిగా జరుపుకోవాల్సి ఉంది. దీన్నే సమాశ్రయణం అని పేరు. పెద్దలు, ఆచార్యులు దీన్ని అనుగ్రహిస్తుంటారు. విజయవాడ దరి సీతానగరం లోని విజయకీలాద్రి ఆలయంలో చిన్న జీయర్ స్వామి రెండు పర్యాయములు ఈ దీక్షను

అనుగ్రహిస్తున్నారు. ఈ నెల 19 న ( స్థిరవారం ), మరో సారి ఈ నెల 27 న కూడా మంత్రోపదేశాన్ని భక్తులకు అందచేస్తున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనదలచిన భక్తులు ముందుగా సీతానగరం జీయర్ ఆశ్రమం నిర్వాహకులను గానీ, ధనుర్మాస వ్రత కమిటీ ని గానీ సంప్రదించవలసి ఉంటుంది. ఉదయం 8 గంటల సమయానికి విజయకీలాద్రి ఆలయానికి భక్తులు చేరుకోవాల్సి ఉంది.

కేవలం కాఫీ, లాంటి ద్రవ పదార్థం తప్ప, ఎటువంటి ఘన పదార్ధం ( టిఫిన్) లు చెయ్యరాదు. 

16 నుంచి వేడుకలు ప్రారంభం: .  . .

ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకూ నిర్వహించుకునే ఈ వేడుకల్లో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25 న రావడం, జనవరి 3 న నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం,  జనవరి 11 న కూడారై ఉత్సవం, జనవరి 13 న భోగి, గోదాకల్యాణం

అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం వేళల్లోనే తిరుప్పావై పాశుర సేవ ఉంటుంది. ఈ నెల రోజుల్లో విశేష పాశురాల సమయంలో  విశేష అలంకారం, ప్రత్యేక ఆరాధనలు జరుగుతుంటాయి. ఈ నెలరోజుల వేడుకలో ఆలయాల్లోనూ, గృహాల్లోనూ అందరూ కలిసి గోష్టి గా తిరుప్పావై పాశుర అనుసంధానం జరుగుతుంది. 

ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బంది

పెడుతున్న కరోనాసురుడి పతనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక ఆరాధనలు జరిపేందుకు ఆలయాల్లో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 

*అధ్యయనోత్సవాలు, పగలు పత్తు ప్రారంభం: . .* 

12 మంది ఆళ్వార్లలో ఎంతో ప్రాధాన్యత కల్గిన నమ్మాళ్వార్లు స్వామిని చేరుకున్న రోజున  నమ్మాళ్వార్ల

పరమపదోత్సవం (జనవరి 3 ) ఎంతో వైభవంగా జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని కొన్ని ఆలయాల్లో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 25 ) కు ముందు 10 రోజులు పగలు పత్తు గాను, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతుంటాయి. జనవరి 3 న (ఆఖరి రోజున ) నమ్మాళ్వార్లకు పరమ పదోత్సవం చేయడం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ

భక్తులకు ఇచ్చే శఠారి గా మారినవారు నమ్మాళ్వార్. 

మంగళవారం పగల పత్తు ఉత్సవం ఆలయంలో ప్రారంభమయ్యింది. ఈ సందర్బంగా ద్రావిడ దివ్య ప్రబంధం పారాయణ ఆరంభమయ్యింది. వైకుంఠ ఏకాదశి వరకూ ఈ పారాయణ కొనసాగుతుంది. 
ఈ పది రోజుల పాటు నాదమునుల ఆదేశానుసారము, శ్రీవైకుంఠ ఏకాదశి కి ముందు ( అమావాస్య నుండి ) మొదటి పది రోజులు

(పగలు పత్తు లో) ముదలాయిరము ( తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, నాచ్చియార్ తిరుమొళి, పెరుమాళ్ తిరుమొళి,  తిరుచ్ఛంద విఱుత్థం,  తిరుమాలై , తిరుప్పళ్లిఎళ్ళుచ్చి, అమలనాదిపిరాన్, కణ్ణినుణ్ శిరుత్తాంబు,)  రెండవ ఆయిరము ( పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండకం  అనునవి) అనుసంధింపబడుతాయి.
   
తదుపరి

మొక్కొటి ఏకాదశి నుంచి రాపత్తు సాయంత్రం ఆలయంలో ఆరాధనలు ముగిసిన అనంతరం ద్రావిడ ప్రబంధం పారాయణ చేయడం నిర్వహిస్తుంటారు. 
   శ్రీవైకుంఠ ఏకాదశి రోజున తిరువాయ్ మొజి తొళక్కము (ప్రారంభము) అనుసంధింపబడుతుంది.  శ్రీవైకుంఠ ఏకాదశి దినము ఉదయము వేదపారాయణము, సాయమువేళలో తిరువాయ్ మొజి దినమునకు ఒక పత్తు, పది దినములు

అనుసంధింపబడుతుంది. చివరిరోజున  ఘనముగా శాత్తుమురై  నిర్వహింపబడుతుంది.

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam