DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నారాయణుని చేరుకునే అత్యుత్తమ సాధనమే ధనుర్మాస వ్రతం 

*విజయ కీలాద్రి లో జీయర్ స్వామిచే  వైభవంగా వ్రతారంభం. .*

*ఈ నెల 19 న జీయర్ స్వామి చే సమాశ్రయణ దీక్ష అనుగ్రహం:. . .*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 16, 2020  (డి ఎన్ ఎస్):* శ్రీమన్నారాయణుని చేరుకోడానికి అత్యంత సులభమైన సాధనం ధనుర్మాస వ్రతమని

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. విజయవాడ సమీపంలోని సీతానగరం ( గుంటూరు జిల్లా) జీయర్ ఆశ్రమం వద్దగల విజయకీలాద్రి పై గల ఆలయం లో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలను అయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భాన అయన పాశుర విన్నపం, తదుపరి సూర్యుడు ధను రాశిలో ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం

ఆరంభమవుతుంది, నెల రోజుల పాటు దీక్షగా స్వామిని ప్రార్ధించడం ద్వారా స్వామిని చేరుకోవచ్చు అని ఈ కాలంలోనే తమిళనాడు కు చెందిన గోదాదేవి ( ఆండాళ్) ఆచరించి చూపిందన్నారు. రోజుకో పాశురం ద్వారా నారాయణ స్వరూపాన్ని ఈ లోకానికి అందించిందన్నారు. అంతకు ముందు పాశుర విన్నపం, తిరువారాధన చేపట్టారు. 

పా: .
మార్గళిత్తింగళ్

మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

!

"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం

వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో

మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 

నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే

ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా

అందించింది. 

ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి

యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది. 

ధనుర్మాస వేడుకల కార్యాచరణ :  . . 

ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గోడ అష్టోత్తర నామార్చన, తిరుప్పావై సేవాకాల గోష్టి, నివేదన, తీర్థగోష్టి, తదుపరి త్రిదండి అహోబిల జీయర్ స్వామి తిరుప్పావై ప్రవచనం కొనసాగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5 :30

గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, అనంతరం చిన్న జీయర్ స్వామి ప్రవచనం జరుగనున్నాయి. 

ఈ నెల 25 న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, గీత జయంతి, జనవరి 3 న  నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం, జనవరి 8 న దీపోత్సవం ( అన్రు పాశురం), జనవరి 11 న కూడారై ( గోష్టి) వేడుక, జనవరి 13 న గోదా రంగనాధుల కళ్యాణం ( భోగి) వేడుకలు అత్యంత వైభవంగా

జరుగనున్నాయి.       

*ఈ నెల 19 న సమాశ్రయణ దీక్ష అనుగ్రహం:. . .*

ప్రతి శ్రీవైష్ణవ సంప్రదాయ పరునికి పంచసంస్కారం తప్పని సరిగా జరుపుకోవాల్సి ఉంది. దీన్నే సమాశ్రయణం అని పేరు. పెద్దలు, ఆచార్యులు దీన్ని అనుగ్రహిస్తుంటారు. విజయవాడ దరి సీతానగరం లోని విజయకీలాద్రి ఆలయంలో చిన్న జీయర్ స్వామి రెండు పర్యాయములు

ఈ దీక్షను అనుగ్రహిస్తున్నారు. ఈ నెల 19 న ( స్థిరవారం ), మరో సారి ఈ నెల 27 న కూడా మంత్రోపదేశాన్ని భక్తులకు అందచేస్తున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనదలచిన భక్తులు ముందుగా సీతానగరం జీయర్ ఆశ్రమం నిర్వాహకులను గానీ, ధనుర్మాస వ్రత కమిటీ ని గానీ సంప్రదించవలసి ఉంటుంది. ఉదయం 8 గంటల సమయానికి విజయకీలాద్రి ఆలయానికి భక్తులు

చేరుకోవాల్సి ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam