DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెల్లంపల్లి తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలి: బిజెపి

*వెల్లంపల్లికి తన మంత్రిత్వ శాఖ ఏంటో తెలుసా?: సోము వీర్రాజు* 

*వెల్లంపల్లి గుళ్ల గురించి తప్ప చర్చిలు, దర్గాల మాత్రమే . . .* 

*విజయవాడ లో కూల్చిన గుళ్ళు తిరిగి కట్టాల్సిందే: బీజేపీ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 16, 2020  (డి ఎన్ ఎస్):*

హిందూ దేవాలయాలు, ఆస్తుల పరిరక్షణ చెయ్యడం లో అన్ని రకాలుగా విఫలమైన వెల్లంపల్లి తక్షణం దేవాదాయ శాఖామంత్రి  పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

బుధవారం విజయవాడ లోని ప్రకాశం బ్యారేజి సమీపంలో శనీశ్వర ఆలయం వద్ద బిజేపి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ

హిందూ దేవాలయాలకు మంత్రి గా ఉండి తన శాఖలోని హిందూ గుళ్ళు అన్యమత పిచ్చెక్కిన మతోన్మాదులు కూల్చేస్తుంటే కళ్ళు మూసుకు పోయారని, పైగా ముస్లిం లకు దర్గాలను కడతామని ప్రకటించారంటే ఈయనకు అసలు తన మంత్రి త్వ శాఖా ఏంటో తెలుసా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించి సొమ్ముల వివరాలను సోము

వీర్రాజు వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం తీరు పై అయన మండిపడ్డారు. 

రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తన మంత్రిత్వ శాఖ ఏంటో తెలుసా లేక, అన్ని మంత్రిత్వ శాఖలకే తానె మంత్రి అనుకుంటున్నారా అని ఎద్దేవా చేసారు. 

దేవాదాయ శాఖ మంత్రి గుళ్ల గురించి తప్ప చర్చిలు, దర్గాల అభివృద్ధి

గురించి మాత్రమే  మాట్లాడతారని ఎద్దేవా చేసారు. 

గత కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడ లో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేసారు. పైగా ఆ సమయంలో బీజేపీ నేతగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ఆలయాలు కట్టాలంటూ ఆందోళన చేశారు. పైగా నేడు  ఆయన అదే శాఖా మంత్రిగా

ఉన్నారన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి కు హిందూ సంప్రదాయ ల పై నమ్మకం, గౌరవం లేదని, చంద్రబాబు కూడా పడగొట్టిన ఆలయాల పై మాట్లాడాలని డిమాండ్ చేసారు. 
విజయవాడలో కూల గొట్టిన ఆలయాలను ప్రభుత్వం  వెంటనే నిర్మించాలని డిమాండ్ చేసారు. దర్గాలకు ఐదు కొట్ల రూపాలు, చర్చిలకు 24కోట్ల రూపాయలు నిర్మాణాలకు కేటాయించారని, చర్చిల

నిర్మాణానికి ప్రభుత్వం ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. 

రాష్ట్రం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు ఆందోళన కరంగా ఉందని, స్వామి వారి డిపాజిట్ సొమ్ములని ఇతర అవసరాలకు వాడుతున్నారని, దేవాదాయ శాఖ పరిధిలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటి పట్టింపు వీళ్ళకి లేదన్నారు. 

వేలాది

మంది దాతలు వివిధ హిందూ దేవాదాయాలకు ఇచ్చిన లక్షలాది ఎకరాల భూములను ఇళ్ల పట్టాల పంపిణీలు,   కోసం, నిధులను ఇతర కార్యక్రమం కోసం వాడతారా అని ప్రశ్నించారు. 

అన్ని రకాలుగా విఫలమైన వెల్లంపల్లి తక్షణం దేవాదాయ శాఖామంత్రి  పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు. 

రాష్ట్రం లో క్రైస్తవ

చర్చిలకు వేల కోట్ల ఆదాయాలు  ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి కి దమ్ముంటే వీటి నుంచి డబ్బు తీసుకు‌ని ఖర్చు చేయాలన్నారు. జగన్ కు చర్చిలు, మసీదు లే కావాలా.. ఆలయాల అభివృద్ధి అక్కర్లేదా అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam