DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తమ లక్ష్య సాధనకు నియమం తప్పనిసరి, చిన్న జీయర్ స్వామి

*విజయ కీలాద్రి లో జీయర్ స్వామిచే వైభవంగా ధనుర్మాస వేడుకలు* 

*ఈ నెల 19 న జీయర్ స్వామి చే సమాశ్రయణ దీక్ష అనుగ్రహం:. . .*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 17, 2020  (డి ఎన్ ఎస్):*  ఉత్తమ లక్ష్య సాధనకు నియమం తప్పనిసరి గా పాటించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,

త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. విజయవాడ సమీపంలోని సీతానగరం ( గుంటూరు జిల్లా) జీయర్ ఆశ్రమం వద్దగల విజయకీలాద్రి పై గల ఆలయం లో అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన రెండవ రోజు సాయంత్రం వైయత్తు వాళ్వీర్గాళ్ . . పాశుర వైశిష్ట్యాన్ని భక్తులందరికీ తెలియచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

లక్ష్య సాధన అంత సులభంగా ఉండదని, దాన్ని సాధించడానికి శ్రమించాలన్నారు. దీనికి మార్గదర్శకం చేసింది ఆండాళ్ అన్నారు. ఆమె ఆచరించి చూపించిన వ్రతాన్ని నాటి నుంచి నేటి వారికి కూడా ఆదర్శం అన్నారు. మాటను అదుపులో పెట్టుకోవాలని, మంచి మాటలు మాట్లాడక పోయినా పరవాలేదు, కానీ, చెడూ మాటలు, అవాస్తవాలు అనవసరంగా ఎక్కడా

ప్రస్తావించరాదన్నారు.  

ఉదయం ఆలయంలో వైయత్తు వాళ్వీర్గాళ్  పాశుర విన్నపం, ఆరాధనలు నిర్వహించారు.  

రెండ‌వ‌ పాశుర‌ము: . . .

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
/> మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ 
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

అర్ధ‌ము

ఈ లోక‌ములోని ఓ భాగ్య‌వ౦తులారా ఏమి చెయ్యాలో చెపుతున్నాను విన౦డి. ఈ నోము నోచిన‌వారు, య‌తుల‌కు

బ్ర‌హ్మ‌చారుల‌కు ఇ౦కా యోగ్యుల‌యిన‌వారికి మీ శ‌క్తి కొల‌ది దానాలు చేయ౦డి. మీరు ఏ విధ౦గా మీ పాప‌ముల‌ను పోగొట్టుకొని భ‌గ‌వ౦తుని చేరుకొనుగ‌ల‌రో ఆ విధానాన్ని తెలుసుకో౦డి.
పాల‌ స‌ముద్ర‌ములో ప‌డుకున్న‌ అ౦ద‌రి క౦టే గొప్పవాడైన‌ శ్రీమ‌న్నార‌ణుని శ్రీపాద‌ముల‌ను స౦తోష‌ముగా

తెల్ల‌వాఝామున‌ లేచి స్నాన౦ చేసి ధ్యాన౦ చేయ౦డి. ఈ వ్ర‌త‌ము చేసిన‌ప్పుడు మ‌న‌ము భ‌గ‌వ౦తుని ప్ర‌సాద‌ముగా త‌ప్ప‌ నేతిని పాల‌ను అనుభ‌వి౦చ‌ము. కాటుక‌ పెట్టుకొన‌ము. పూవుల‌ను పెట్టుకొన‌ము. అ౦తేకాదు చేయ‌కూడ‌ని ప‌నులు చేయ‌ము. ఇత‌రుల‌కు క‌ష్ట‌ము కలుగ‌చేయు మాట‌లు చెప్ప‌ము . అని గోదాదేవి

వ్ర‌త‌ నియ‌మాలు వివరించారు. 

ధనుర్మాస వేడుకల కార్యాచరణ :  . . 

ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గోదా అష్టోత్తర నామార్చన, తిరుప్పావై సేవాకాల గోష్టి, నివేదన, తీర్థగోష్టి, తదుపరి త్రిదండి అహోబిల జీయర్ స్వామి తిరుప్పావై ప్రవచనం కొనసాగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5 :30 గంటలకు సామూహిక శ్రీ

విష్ణు సహస్రనామ పారాయణ, అనంతరం చిన్న జీయర్ స్వామి ప్రవచనం జరుగనున్నాయి. 

ఈ నెల 25 న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, గీత జయంతి, జనవరి 3 న  నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం, జనవరి 8 న దీపోత్సవం ( అన్రు పాశురం), జనవరి 11 న కూడారై ( గోష్టి) వేడుక, జనవరి 13 న గోదా రంగనాధుల కళ్యాణం ( భోగి) వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.    

  

*ఈ నెల 19 న సమాశ్రయణ దీక్ష అనుగ్రహం:. . .*

ప్రతి శ్రీవైష్ణవ సంప్రదాయ పరునికి పంచసంస్కారం తప్పని సరిగా జరుపుకోవాల్సి ఉంది. దీన్నే సమాశ్రయణం అని పేరు. పెద్దలు, ఆచార్యులు దీన్ని అనుగ్రహిస్తుంటారు. విజయవాడ దరి సీతానగరం లోని విజయకీలాద్రి ఆలయంలో చిన్న జీయర్ స్వామి రెండు పర్యాయములు ఈ దీక్షను

అనుగ్రహిస్తున్నారు. ఈ నెల 19 న ( స్థిరవారం ), మరో సారి ఈ నెల 27 న కూడా మంత్రోపదేశాన్ని భక్తులకు అందచేస్తున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనదలచిన భక్తులు ముందుగా సీతానగరం జీయర్ ఆశ్రమం నిర్వాహకులను గానీ, ధనుర్మాస వ్రత కమిటీ ని గానీ సంప్రదించవలసి ఉంటుంది. ఉదయం 8 గంటల సమయానికి విజయకీలాద్రి ఆలయానికి భక్తులు చేరుకోవాల్సి

ఉంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam