DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీసీలపై జగన్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారు

*నరసాపురం టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 19, 2020  (డి ఎన్ ఎస్):* రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అని బీసీల జీవితాలను మార్చే

చేస్తానంటూ ప్రచారం చేసుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలపై కత్తివేటు వేస్తున్నారని నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పాత్రికేయుల సమావేశంలో జగన్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన విశ్వవిద్యాలయాల పదవుల నుండి టీటీడీ పోస్టుల వరకు రెడ్డి

సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించి బీసీ సామాజిక వర్గానికి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ 712 పదవులను మొత్తం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారని టీటీడీలో మొత్తం 36 మంది సభ్యులు ఉంటే అందులో 11 మంది రెడ్లు 3 బీసీలకు,12 మంది ఉపకులపతులలో 10 రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి మాత్రమే బీసీకి, ప్రభుత్వ

సలహాదారులలోల 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి 1మాత్రమే బిసికి,  ప్రభుత్వ న్యాయవాదులలో 30 మంది ఉంటే 16 సొంత సామాజికవర్గానికి ఇచ్చి 5 మాత్రమే బీసీలకు ఇచ్చి  బీసీ కార్పొరేషన్లు మినహాయించి వివిధ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లు, దేవాలయ బోర్డు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టులు బీసీలకు సగం ఇస్తామని ప్రకటించి ఇప్పుడు

మాట తప్పి మడం తిప్పి  బీసీ సంక్రాంతి అని ప్రమాణ స్వీకారం చేయించిన వారికి కార్యాలయాలు, నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు తయారు చేయటం రాష్ట్ర బీసీలను చిన్నచూపు చూస్తూమోసం చేయడం కాదా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 34% నుండి 24%నికి తగ్గించడం వల్ల 16,800 పదవులను

కోల్పోతున్నారు. నేతి బీర లాంటి 56 బీసీ కార్పొరేషన్లలో 672 డైరెక్టర్లను నియమించి, అధికారం, నిధులు వున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు
కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల స్థానాలలో 16,800 పదవులకు కోత పెట్టి రాజ్యాధికారానికి దూరం చేయడం బీసీల

ద్రోహం కాదా?
బీసీ సబ్ ప్లాన్ కు 2019-20లో ఖర్చు చేసింది కేవలం రూ. 5,600 కోట్లు మాత్రమే.
పట్టాల పేరుతో బీసీల అసైన్ మెంట్ భూములు 6 వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం బీసీలకు ద్రోహం కాదా?
బీసీల విదేశీ విద్యకు నిధుల మంజూరు రద్దు ద్రోహం కాదా?
ప్రభుత్వ సలహాదారులు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, టీటీడీ, ఏపీఐఐసి లాంటి

పెద్ద పెద్ద కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లలో 34% ఇవ్వకపోవడం బీసీల ద్రోహం కాదా? సుమారు 10 శాతానికే ఎందుకు పరిమితం చేశారు?
తక్కువ జీతం, అధికారాలు లేని వాలంటీర్లు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లలో బీసీలకు కాస్త ఎక్కువ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం బీసీలను మోసం చేయడం కాదా? లెగ్ పీసులు సొంత సామాజిక వర్గానికి, పొట్ట పేగులు

బీసీలకు ఇవ్వడం బీసీలకు సంక్రాంతి ఎలా అవుతుంది?
బీసీ నేతల్ని 18 మందిని హత్య చేశారు. బీసీలపై 400కు పైగా అక్రమ కేసులు పెట్టారు.    ఇదేనా బీసీల న్యాయం ?
ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డికి, ఉత్తర కోస్తా వై.వి.సుబ్బారెడ్డికి, దక్షిణ కోస్తా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి, రాయలసీమ సజ్జల రామకృష్ణారెడ్డికి కట్టబెట్టారు. బీసీల్లో

సమర్ధులు వైసీపీలో లేరా ?
లోకసభ పక్ష నేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డిలకు కట్టబెట్టారు. బీసీల్లో సమర్థులు లేరా? అని ప్రశ్నించారు. 
చంద్రబాబు బీసీలకు చేపలకూరే కాక, వల, బోటు ఇచ్చారు - జగన్ రెడ్డి బీసీల వద్ద వల, బోటు లాగేసుకొని చేప ముక్కకే పరిమితం చేశారు - బీసీలను చీల్చి వారిని మరింత

దెబ్బకొట్టే కుట్ర చేస్తున్నారు - రైల్వేకోడూరులో బీసీ వర్గానికి చెందిన బెరైటీస్ గని యజమాని జింకా వెంకటనరసయ్యను జగన్ తాత హత్య చేసి ఆ గనిని దురాక్రమణ చేశారు. దీనితో జగన్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. ఇలా అనేక రకాలుగా బి.సి లకు అన్యాయంచేసిన నాయకుడువు అన్నారు. 
ఒక్కసారి చూడు నువ్వు చేసిన అన్యాయం.
సలహాదారులు

71% శాతం రెడ్లు బి.సి లు 04%
వైస్ చాన్సలర్లు 83% రెడ్లు బి.సి లు 08%
ప్రభుత్వ న్యాయవాధులు 53% రెడ్లు బి.సి లు 17%
చట్ట సభల్లో విప్ లు 50% రెడ్లు బి.సి లు 13%
సెర్చ్ కమిటీల్లో 75% రెడ్లు బి.సి లు 08%
టి.టి.డి లో 31% రెడ్లకు బి.సి.లకు 08%
ఇదీ జగన్ రెడ్డి నీకు బి.సి లపై ఉన్న ప్రేమ నీ మనసంతా రెడ్లమయం అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam