DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ ఉన్నత విద్యను అందించాలి: నన్నయ వీసీ మొక్కా

*డిసెంబర్ 22న మేథమెటికల్ సైన్సెస్ వెబినార్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 19, 2020  (డి ఎన్ ఎస్):* నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోనికి తీసుకువెళ్ళాలని తద్వారా విజ్ఞానవంతమైన ఆలోచనలతో సుస్థిరమైన దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ

ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో శనివారం “ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నిష్పత్తిలో స్థూల నమోదు మెరుగుదల కోసం విధానాలు మరియు వ్యూహాలు” అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించారు. యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (ఐ.క్యూఎస్.సి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో

ప్రారంభోపన్యాసకులుగా వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు హాజరై ఉపన్యసించారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత ఉన్నత విద్య 33 శాతంగా ఉందని దీనిని జాతీయ విద్య విధానం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 నుండి 70 శాతానికి

పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయని అన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు ముఖ్యంగా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యలో నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, వసతుల కల్పన, విద్యానంతరం ఉద్యోగ ఉపాధి కల్పిన భరోస తదితర అంశాలు దీనిలో కీలక పాత్రను పోషిస్తాయని తెలిపారు. నేషనల్

ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా నియమకాలు జరిపి నాణ్యమైన విద్యా బోధనను దేశ వ్యాప్తంగా అందించాలని తెలియజేసారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆచార్య టి.వి.కట్టమణి మాట్లాడుతూ నూతన విద్యా విధానం ద్వారా ఉన్నత విద్యలో నూతన మార్పులు వస్తాయని అన్నారు. గిరిజన, గ్రామీణ నేపధ్యం కలిగిన విద్యార్థులను ఉన్నత

విద్యలోని తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ఐ.క్యూఎస్.సి కోఆర్టినేటర్ ఆచార్య కె.ఎస్.రమేష్, ఎక్సిక్యుటీవ్ కోఆర్డినేటర్ డా.కె.వి.స్వామి, ఆంధ్రప్రదేశ్ స్టెట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్ పర్సన్ ఆచార్య టి.లక్ష్మమ్మ, ఎమ్మెల్సీ రాముసూర్యరావు, ప్రినిపాల్

డా.ఎస్.సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.

*డిసెంబర్ 22న మేథమెటికల్ సైన్సెస్ వెబినార్*

డిసెంబర్ 22న జాతీయ గణితశాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మేథమెటికల్ సైన్సెస్ అనే అంశంపై జాతీయ వెబినార్ నిర్వహిస్తున్నారని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో

శనివారం దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించారు. దీనిపై వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ వెబినార్ నిర్వహిస్తున్నారని అన్నారు. దేశ విదేశాలలో గణితశాస్త్ర నిష్ణాతులుగా పేరు సంపాధించుకొని

భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ కీర్తిని స్మరించుకొనే విధంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ నేషనల్ వెబినార్ లో పాల్గొని జయప్రధం చేయాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam