DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ 19 సెకండ్ వేవ్ పై ఏపి ప్రభుత్వం అప్రమత్తం

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 24, 2020  (డి ఎన్ ఎస్):* కోవిడ్ 19సెకండ్ వేవ్ విషయంలో పూర్తి స్థాయిలో ఏపి ప్రభుత్వం అప్రమత్తం గా ఉందని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపి లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

జాగ్రత్తలు చేపట్టినట్టు తెలిపారు. కోవిడ్ 19కొత్త వెరియంట్ ప్రయాణికులు ద్వారా వ్యాప్తి చెo దే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికుల రాక పోకలపై ద్రుష్టి పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విదేశి విమానాల్లో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్న వారికీ ఆర్ టి పి సి ఆర్ టెస్ట్లు

చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ప్రత్యేకంగా విమానశ్రయాల్లోనే ప్రయాణికులకు పరీక్షలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచన. ప్రయాణికులు, సిబ్బంది కోసం పి పి ఈ కిట్స్ అందుబాటులో ఉంచాలని కూడ ముఖ్యమంత్రి తెలిపారన్నారు.  పొరుగు రాష్ట్రాల్లోని

విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్ లు కూడ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో యూకే నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా DMHO తో

ఈరోజు ఉదయం ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూకే నుండి ఏపి ఎక్సప్రెస్ లో వచ్చిన మేరీ విని ప్రడ్ యాన్ కు పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుండి రిపోర్ట్ వచ్చిందని వివరించారు. ఆమే తో పాటు కుమార్డ్ రియాన్ ను రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా వైద్య

పరీక్షలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తాజా పరిణామాలు నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసామని, మహిళకు సోకిన కరోనా వైరస్ రెండవ వేవ్ లోనా... కాదా అనేది నిర్ధారణ చేసే పనిలో తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

ఉన్నారు.

నమూనాలు సేకరించి పరీక్షలు నిమిత్తం పునే ల్యాబ్ కు పంపించడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు ఆందోళన చేందనవసరం లేదన్నారు. ...

కరోనా నిబంధనలు.. జాగ్రత్తలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని...వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా

జాగ్రత్తలు చేపట్టిందని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam