DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైరస్ వ్యాప్తి పై  అపోహలు నమ్మొద్దు : డాక్టర్ రమేష్ కిషోర్

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 26, 2020  (డి ఎన్ ఎస్):* యూకే నుంచి ఈ నెల 23న అర్ధరాత్రి రాజమహేంద్రవరం వచ్చిన ఆంగ్లో ఇండియన్ మహిళకు కొత్త రకం కరోన(స్ట్రెయిన్) సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆమెకు సోకింది కొత్త వైరస్సా లేక పాత కరోననా అనేది తెలుసుకునేందుకు నమూనాలను

పూణేలోని వైరాలజి ల్యాబ్, హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాబులకు పంపామని ఏపీ వైద్య విధాన పరిషత్తు జిల్లా సమన్వయాధికారి డాక్టర్ రమేష్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  యూకే నుంచి వచ్చిన మహిళ, ఆమె కుమారుడు ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

వారికి ఎలాంటి లక్షణాలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ ప్రచారాలు నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  మరో నాలుగైదు రోజుల్లో ల్యాబులకు పంపిన నమూనాలకు సంబంధించి ఫలితాలు వస్తాయన్నారు. ఆ ఫలితాల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను అనుసరించి వైద్య

సేవలు అందిస్తామన్నారు. కొన్ని మొబైల్ యాప్లు, సామాజిక మాధ్యమాల్లో కొత్త కరోన వైరస్ కేసు రాజమహేంద్రవరంలో నమోదయిందంటూ వార్తలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి వైరస్ నుంచైనా రక్షణ పొందవచ్చని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam