DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలన గాలికొదిలేసి. . . విశాఖ లో పంతాలు ప్రమాణాలూనా?

*మీడియాలో విపరీత ప్రచారం కోసం అధికార, విపక్షాలు*

*ఎంపీ, ఎమ్మెల్యే ల వైఖరిపై ప్రజల మండిపాటు. ..*

*వీసా కి ప్రతి వారం కోర్టుకు వెళ్ళాలి : వెలగపూడి వెటకారం*

*ఎంపీ నుంచి కార్యకర్తల వరకూ అంతా సవాళ్లు విసిరేవాళ్లే. .*

*ఇదీ రాజకీయం : స్థాయి మరిచి విశాఖ లో సవాళ్లు, ప్రతి సవాళ్లు.

.*

*DNS ప్రశ్నకు మాట దాటేసిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్*

*(DNS రిపోర్ట్ :  సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 27, 2020  (డి ఎన్ ఎస్):* చట్టబద్ధంగా ప్రజల చేత ఉన్నకోబడిన ప్రజా ప్రతినిధులు పరిపాలనను విడిచిపెట్టి, ప్రత్యర్థులతో సవాళ్లు, ప్రతిసవాళ్లు చెయ్యడం పెద్ద

ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రస్తుతం విశాఖ మహా నగరం లో పరిపాలన ఏనాడో చెట్టెక్కేసింది. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ లు నాగరాభివృద్ధిని ప్రక్కనపెట్టి, ప్రత్యర్థి ఎమ్మెల్యే పై సవాళ్లు విసురుతున్నారు. వీళ్ళ వైఖరికి నగరవాసులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. .. 

విశాఖ ను రాజధానిగా చేస్తాం అని

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి అధికార పార్టీ నేతలు విశాఖపై తమ ఆధిపత్యం సాధించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విశాఖ నగరంలోని నాలుగు ఎమ్మెల్యే లుగా ఎన్నికైన వారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారు కావడం తో వాళ్ళని దారిలోకి తెచ్చుకునేందుకు సామ, దాన,

దండోపాయాలు వినియోగించిన ఒకరిద్దరు మింగుడుపకదా పోవడంతో రెచ్చగొట్టే ధోరణికి దిగారు. దీనిలో భాగంగానే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయి విభిన్న రీతిలో విరుచుకుపడ్డారు. దీంతో మండిపడ్డ వెలగపూడి విజయసాయి వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్టు స్థానిక షిర్డీ సాయి ఆలయంలో సాక్షిప్రమాణం

చెయ్యాలని సవాల్ విసిరారు. అయితే దీనికి స్పందించాల్సి  విజయసాయి మిన్నకుంటే. . అతని శిష్య బృందం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, విశాఖ తూర్పు నియోజక ఇంచార్జి అక్కరమని విజయనిర్మల వెలగపూడి కి ఎదురు సవాళ్లు విసిరారు. ఫలస సమయానికి విజయసాయి ఆలయానికి రావాలని, తానూ కూడా వస్తానని, సత్య ప్రమాణం చెయ్యాలంటూ, చెప్పిన

సమయానికి ఆలయానికి వెళ్లడంతో, ఆ సమయానికి విజయసాయి రాక పోగా, విజయనిర్మల తన అనుచరులతో వచ్చారు. అంతే . దొరికిందే తడవుగా వెలగపూడి విరుచుకుపడ్డారు. తానూ సవాల్ విసిరింది విజయసాయి రెడ్డికి అయితే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారేంటి అంటూ ఎద్దేవా చేసారు. 
దీనిపై ఘాటుగా స్పందిస్తూ గుడివాడ అమర్ నాద్ షిర్డీ సాయి ఆలయానికి

చేరుకొని వెలగపూడిని రమ్మంటూ సవాల్ విసిరారు. ఒక అరగంట వేచి యుండి, వెనుదిరిగే ముందు మీడియా ముఖంగా వెలగపూడి దమ్ము లేదని, అందుకే ప్రమాణానికి గుడికి రాలేదంటూ వ్యాఖ్యానించారు. 

వీసా కి ప్రతి వారం కోర్టుకు వెళ్ళాలి : వెలగపూడి వెటకారం

విజయ సాయి కంటే. .ప్రతి వారం కోర్టుకు వెళ్లే పని ఉంటుందని, తనకు ఆ పని

లేదు కనుక ఖాళీగానే ఉన్నానని, అతనికి ఎప్పుడు వీలవుతుందో చెప్తే అప్పుడే గుడికి వచ్చి, తానూ కూడా ప్రమాణం చేస్తానని చెప్పడం తో విశాఖ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.  

*DNS ప్రశ్నకు మాట దాటేసిన గుడివాడ. ..*

వెలగపూడి గుడికి వస్తే అతనికి క్లిన్ చిట్ ఇచ్చినట్టేనా అంటూ DNS ప్రతినిధి

అడిగిన ప్రశ్నకు గుడివాడ అమర్ నాధ్ కాసేపు తటపటాయించారు. అనంతర మాట దాటేసే ప్రయత్నం చేసారు. తర్వాత వెలగపూడి ఇక్కడకు వచ్చి, ప్రమాణం చెయ్యాలని డిమాండ్ చేసారు. 

*ఎంపీ నుంచి కార్యకర్తల వరకూ అంతా సవాళ్లు విసిరేవాళ్లే. .*

అధికార ఆధిపత్యం కోసం జరుగుతున్నా ప్రస్తుత పోరాటాం ఆరాటం లో ఎంపీ విజయసాయి రెడ్డి

నుంచి సామాన్య పార్టీ కార్యకర్తల వరకూ అందరూ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు సవాళ్లు విసిరే వాళ్ళే ఉన్నారు. 

అధికార పార్టీ నుంచి అక్రమని విజయ నిర్మల సవాళ్లు విసిరుతుంటే. . .తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి పాశర్ల ప్రసాద్ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ కు సవాల్

విసురుతున్నారు. 

ఇదీ రాజకీయం: ప్రజా పరిపాలన చెయ్యమని వీళ్లకు ఓటు వేసి అధికారం కట్టబెడితే. . వీళ్ళు పరిపాలన విడిచి పెట్టి, తమ హావా చెలాయించుకునే ప్రయత్నంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీ లు పూర్తిగా కాలాన్ని వృధా చేస్తున్నారన్నది వాస్తవం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam