DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హస్తినకు చేరిన మాధవీలత 1500 కిమీ మహా సైకిల్ యాత్ర

*హిందూ రక్షణ చట్టంకై  తెలంగాణ బీజేపీ యువతి సాహస యాత్ర* 

*వేములవాడ నుంచి ఢిల్లీ కి సాహసోపేత యాత్ర కు నీరాజనాలు.*  

*తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ యుపి మీదుగా హస్తినలో ప్రవేశం. . .*

*స్ఫూర్తి నిచ్ఛే మాధవిలత విజయ యాత్ర కు DNS అభినందన కధనం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో

చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 30, 2020  (డిఎన్ఎస్):* కోట్లాది మంది ఉన్న భారత దేశంలో హిందువుల రక్షణకై కఠిన తరమైన చట్టాలు తీసుకురావాలని ప్రధానమంత్రిని కోరేందుకు మాధవీలత ( బీజేపీ మహిళ karyakarta) వేములవాడ నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. బుధవారం మాధవీలతను హస్తిన లో బీజేపీ జాతీయ

ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ శాలువా తో సత్కరించారు. ఒక ప్రభుత్వం చేపట్టవలసిన కార్యాచరణను ఒక మహిళా దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ సైకిల్ యాత్ర చెయ్యడం సాధారణ విషయం కాదన్నారు. ఒక మహిళా ఏంతో సాహసం తో సుమారు 1500 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చెయ్యడం, పైగా ఆమె బీజేపీ కార్యకర్త కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమె యాత్ర

విషయాలను తెలుసుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినతి పత్రం అందించేందుకు తగిన దరఖాస్తు ను స్వయంగా నింపి ప్రధాని కార్యదర్శి రాకేష్ శర్మ కు అందించడం జరిగింది. త్వరలోనే ప్రధానిని మాధవి కలిసి హిందూ రక్షణ చట్టం పై వినతి పత్రం అందించే అవకాశం ఉంది. ఈమె సాగించిన ప్రయాణంలో తెలంగాణ నుంచి, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,

ఉత్తర్ ప్రదేశ్, తదితర ఆరు రాష్ట్రాలు దాటి హస్తినకు చేరుకున్నారు. మార్గమధ్యంలో ద్వారక లో శ్రీ కృష్ణ జన్మ భూమి, మధుర లో బృందావనం, 
ఆగ్రా లో రాజస్థాన్, గ్వాలియర్ లోని రాజప్రాసాదాలు దర్శించారు. మధ్యప్రదేశ్ లోని ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాలించినచోట, నివసించిన కోట దర్శించి, జన్మ తరించిందని మాధవీలత

తెలియచేసారు. 

మధుర లో కరోనా సమయం కావడం తో కృష్ణమందిరం మూసివేయడం తో వెనుదిరుతుంటే, స్థానిక సాధువులు ఆమెను తమ ఆశ్రమానికి సాదర పూర్వకంగా ఆహ్వానించి, ఆతిధ్యం ఇచ్చి, ఆశీస్సులు అందించడం తన అదృష్టమన్నారు. 

గత నెల (నవంబర్) 16 న తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వేములవాడ కు చెందిన దొమ్మాటి మాధవీలత భారతీయ జనతా

పార్టీ కార్యకర్త. ప్రస్తుతం భాగ్యనగరం లో ఉంటూ. . పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సైతం సైకిల్ యాత్ర చేసారు.  
ప్రముఖ  రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్ధనల అనంతరం తన మహా సంకల్ప సైకిల్ యాత్రను ప్రారంభించారు. రెండు ప్రధాన లక్ష్యాలను ప్రధానమంత్రి ముందు ఉంచేందుకు ఈ యాత్రను

ప్రారంభించారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నాయని, దీనికి నిదర్శనమే వందలాది హిందూ దేవీ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, ఆస్తులు ధ్వంసం చేస్తున్న కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. హిందువులకు ఒక పటిష్టమైన రక్షణ కల్పించే చట్టం

ఏర్పాటు కావాలని, తద్వారా బలవంతపు మతమార్పిడులు తక్షణం ఆపాలని, పవిత్రమైన గోవులను రక్షించాలని సంకల్పం తో ఈ యాత్ర చేస్తున్నట్టు తెలియచేసారు. సుమారు 1500 కిలోమీటర్ల దూరం ఒక మహిళ సాధారణ సైకిల్ పై యాత్ర చెయ్యడం కోట్లాది మంది హిందువులకు స్ఫూర్తి కల్గించే విషయం. 

గ్రామగ్రామాన నీరాజనాలు : . .

ఒక మహత్తర

సంకల్పంతో మాధవీలత చేపట్టిన ఈ సైకిల్ యాత్రకు మార్గమధ్యంలో ప్రతి గ్రామంలోనూ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. యాత్ర మొదలైన మూడు రోజుల పాటు యాత్ర లక్ష్యం తెలియకపోవడం వలన, ప్రజలకు విస్తరించవలసి వచ్చిందన్నారు. అయితే గ్రామాల్లో యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా తనకు సంఘీభావం ప్రకటించి సమీప గ్రామాల్లో ప్రజలందరికీ తెలియచేసి,

జిల్లాల వ్యాప్తంగా సైకిల్ యాత్ర గురించి తెలియచేశారన్నారు. భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ బంధువులు ప్రతి మజిలీ లోనూ ఎంతో ఆదరణ చూపించడంతో పాటు, తనతో పాటు కొంత దూరం వాహనాల్లో యాత్రలో కూడా పాల్గొన్నారని తెలియచేసారు. 

అయితే కొన్ని ప్రాంతాల్లో ముస్లిం యువకులు తనకు అవరోధం కల్గించే విధంగా అనిపించిందని, తన

వెనుక ధార్మిక శక్తి హిందూ శక్తి రక్షణగా నిలిచి ఉన్నట్టుగా తెలిసిందన్నారు. 

 నిర్మల్ చేరుకున్నప్పుడు పూర్తిగా ఘాట్ ప్రాంతం కావడంతో సైకిల్ తొక్కలేకపోయానని, స్థానిక యువకులు సైకిల్ నడిపించడంతో నడుచుకుంటూనే వెళ్ళవలసివచ్చిందన్నారు. 

నవంబర్ 29 న  నాగపూర్ లో రామ మందిర్ నిర్మాణ ముఖ్య కారకులు

,విశ్వ హిందు పరిషత్ వ్యవస్థాపకులు అశోక్ సింఘాల్ గారి వారసులు ప్రవీణ్ తొగడియాతో మాట్లాడాను, చాల ఆనందంగా ఉందని మాధవీలత సంతోసహాన్ని వ్యక్తం చేసారు. 

ఖవాస నుంచి వెళ్లే దారిలో అభినందించడానికి వచ్చిన వాళ్ళు కార్ ఆపడం వల్ల చాలాసమయం ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, దీంతో స్థానికులకు సైకిల్ యాత్ర విషయం తెలియడంతో

కాళ్ళకు మొక్కేవాళ్ళ సంఖ్యా పెరిగిపోయిందని తెలిపారు. 

మధ్యప్రదేశ్ లో మంత్రి . . . . .

డిసెంబర్ 12 న మధ్యప్రదేశ్ లో యాత్ర సాగుతున్న సమయంలో ఒక మంచి ఉన్నత ఆశయం కోసం జరుగుతున్నా సైకిల్ యాత్ర గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ మున్సిపల్ మంత్రి భూపేంద్ర సింగ్, అభినందిస్తూ ప్రజలందరికీ మీడియా ద్వారా

తెలియచేయడంతో రాష్ట్రం మొత్తం తెలిసి, ప్రజల నుంచి ఊహించని స్పందన లభించడం ఒక వరం గా భావిస్తున్నట్టు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్ లో ప్రతి గ్రామంలోనూ అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ప్రతిగ్రామంలోనూ 

ఉత్తర ప్రదేశ్  ఓర్చా మహారాణి పరమ రామ భక్తురాలు, ఆమె నిర్మించిన స్వయంభు రామాలయాన్ని దర్శించుకోవడం

అదృష్టమన్నారు. 

తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలు దాటి,  ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో దిగ్విజయంగా ఈ మహా సైకిల్ యాత్ర సాగుతోంది. ఈమె ఢిల్లీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని, ప్రధాని కి తన యాత్ర సంకల్పం తెలియచేయాలని, ఆమె ఆకాంక్ష ప్రధాని ద్వారా నెరవేరాలని ఆశిస్తూ DNS News Agency మాధవిలతకు హార్దిక

శుభాకాంక్షలు తెలియచేస్తోంది. 

మాధవీలత ప్రచారం చేసే అంశాలు ఇవే: . .

1. స్వతంత్ర భారతంలో ఎవరు చేయలేని అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోడీగారు మహా ఘనులు. ఈ ఏడేండ్ల కాలంలో ఎన్ని విమర్శలు వచ్చిన భయపడకుండా చేసిన పనులు చూసి యావత్ భారతావని సంతోషిస్తుంది...

ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకటే జెండా అంటూ రద్దు

చేసిన చట్టం *ఆర్టికల్370*
జాతి గర్వించదగ్గ చట్టం *NRC* *CAA*. 
దేశంలో అందరూ సమానమే అంటూ ముస్లిం సోదరీమణుల బాగు కోరి రద్దుచేసిన చట్టం *త్రిపుల్ తలాక్*

వందల సంవత్సరాల నుండి ఎందరో హైందవ మహావీరుల చిరకాల కోరిక *అయోధ్యలో రామమందిరం* ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసిన మహనీయులు 

ఏ ప్రభుత్వం ఇవ్వలేనంతగా

ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చిన ఘనత మీదే, *రెండుసార్లు పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్* చేయించిన గొప్ప వీరులు...
చైనా ఆక్రమిత, పాక్ ఆక్రమిత భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న గొప్పతనం ఆయనదే.
*రక్షణ రంగంలో దేశాన్ని అంత్యంత పటిష్టంగా చేసిన గొప్ప నాయకులు ఆయన
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నో తన

సొంతం

ప్రపంచంలో ఎక్కడైనా మెజారిటీ ప్రజలు డామినేటింగ్ గా ఉంటారు మైనారిటీ ప్రజలు ఇబ్బందులు పడతారు... కానీ ఒక్క మన దేశంలోనే మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మైనారిటీ ప్రజలు డామినేటింగ్ ఉంటూ మెజారిటీ ప్రజలను హింసిస్తున్నారు... తెలంగాణలో పూజారి హత్య, బైంసాలో అల్లర్లు, పాత బస్తీలో దాడులు
కేరళలో

ఆరెస్సెస్ కార్యకర్తల దారుణ హత్యలు, విచక్షణ రహిత దాడులు
బెంగాల్ లో గర్భిణీ స్త్రీ అతి దారుణమైన హత్య, ప్రతిరోజు హిందువుల మీద దాడులు
మహారాష్ట్రలో సాధువులను అతి కిరాతకంగా కొట్టి చంపడం ఇలాంటివి ఎన్నో ఇంకెన్నో....
ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలి అంటే *హిందు అట్రాసిటీ చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు

ప్రవేశపెట్టాలి* ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఆయన ఈ సాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు అని యావత్ భరతమాత హైందవ ముద్దుబిడ్డలు ఆశిస్తున్నాం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam