DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెల్లంపల్లి రాజీనామా చేయకుంటే - క్షత్రియ శక్తి చూపిస్తాం

*మేము నోరు తెరిస్తే నువ్వు ఉరేసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే విష్ణు* 

*వెల్లంపల్లీ, నీ చరిత్ర ఏంటో మర్చిపోయావ్, బయట పెట్టాలా?* 

*విశాఖ లో మంత్రి కి క్షత్రియ సంక్షేమ సమితి హెచ్చరికలు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 04, 2021  (డి ఎన్ ఎస్):*

ప్రతిష్టాత్మక వంశీయులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారి పై అసభ్య వ్యాఖ్యలు చేసిన దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి తక్షణం రాజీనామా చేసిన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ శక్తి చూపిస్తామని, క్షత్రియ సంక్షేమ సమితి హెచ్చరించింది. సోమవారం విశాఖనగరంలోని క్షత్రియ కల్యాణ మండపం లో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీలకు అతీతంగా క్షత్రియ సామాజికవర్గం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు మురళి కృష్ణంరాజు మాట్లాడుతూ దేశ ప్రధాని, రాష్ట్రపతులు ఏంతో గౌరవించే కేంద్ర మాజీ మంత్రి అశోక్ జగపతిరాజు ను మీడియా ముఖంగా వెల్లంపల్లి చేసిన అసభ్య వ్యాఖ్యలు యావత్ భారతదేశాన్ని

తలదించుకునేలా ఉన్నాయన్నారు. వేలాది ఎకరాల భూములను స్వచ్చందంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ కు, సింహాచల క్షేత్రానికి, 104 దేవాలయాలకు ఉదారంగా అందించి, డజన్ల సంఖ్యలో విద్య సంస్థలు, అన్నసత్రాలు, భవనాలు కట్టించి, లక్షలాది మంది అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల వంశానికి చెందిన వ్యక్తులు సర్వదా అదరణీయులన్నారు. వెల్లంపల్లి తన

స్థాయి విస్మరించి, నోటికి వచ్చిన ప్రేలాపన చేసి, మొత్తం రాష్ట్ర ప్రజల పరువు తీశారన్నారు. 

మేము నోరు తెరిస్తే. . వెల్లంపల్లి ఉరేసుకోవాలి:. .. 

తమ క్షత్రియ సామజిక వర్గానికి వైశ్యులంటే ఎంతో గౌరవం ఉందని, అలాంటి కుటుంబాల్లో వెల్లంపల్లి తప్పుగా పుట్టాడని, తాము నోరు తెరిచి వెల్లంపల్లి చరిత్ర చెప్తే. . .

అతను ఉరేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకూమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తాము రాజకీయాలను ఎన్నడూ తప్పుగా వినియోగించలేదని, తమ హోదా సమాజానికి ఉపయోగపడాలి తప్ప, రెండో సారి మంత్రి పదవి కోసం నానా గడ్డి కరిచి, దిగజారకూడదన్నారు. ఇతనికి గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి దేవాదాయ శాఖను అప్పగిస్తే. . ఇతను హిందూ దేవాలయాలు తప్ప, ఇతరత్రా ప్రార్ధన స్థలాల అభివృద్ధి కి తెగ కష్టపడిపోతున్నదన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్నా దాడికి పూర్తిగా భాద్యత మంత్రి వెల్లంపల్లిదేనని, తక్షణం బేషరతుగా మంత్రి పదవికి రాజీనామా చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ శక్తిని చూపిస్తామని

హెచ్చరించారు.  

ఈరోజు తో వైసీపీ పై గౌరవం పోయిందని, ఎస్ డి వి ఛానల్ అధినేత రామకృష్ణంరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సక్రమంగా వ్యవరించినప్పటికి క్రింది ఉన్న మంత్రులు స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీలకు చేడ్డపేరు వస్తుందని, 
క్షత్రియులు మనోభావాలు కించపరిచే విధం గా

మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. 

క్షత్రియులకు సంఘీభావంగా రాజకీయాలకు అతీతంగా ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam