DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రౌడీ పాలనకు నిదర్శనం, జగన్ పై సోము వీరాజు ఫైర్

*ఆలయ రక్షణ చేతగాని పాలకులు రామదండును అడ్డుకుంటారా?*

*ఉద్రిక్తతల మధ్య చలో రామతీర్ధం కు భారీగా బీజేపీ శ్రేణులు* 

*పోలీసుల దురుసుతనంతో సోము వీర్రాజు నెట్టివేత*  

*వందలాదిగా పొలిసు బందోబస్తు, నెల్లిమర్లలోనే నిలిపివేత. 

*జగన్ పాలనపై కేంద్రం సీరియస్, ఎంపీ సీఎం

రమేష్.*

*నెల్లిమర్లలోనే సోము వీరాజు, రామతీర్థం లో బీజేవైఎం క్యాడర్*

*రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అగ్రనేతల హౌస్ అరెస్ట్ లు, .*

*ఇదే సమయంలో సింగరాయ కొండ ఆలయ ద్వారం పై దాడి*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 05, 2021  (డి ఎన్ ఎస్):* హిందూ

దేవాలయాలు కాపాడడం చేతగాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రౌడీ పాలనా రామతీర్ధం సాక్షిగా సమాజానికి బహిర్గతం అయ్యిందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళవారం బీజేపీ, జనసేన పార్టీలు పిలుపు ఇచ్చిన చలో రామతీర్ధం ఉద్రిక్తంగా మారింది. సోము వీర్రాజు, ఇతర రాష్ట్ర నాయకులను విజయనగరం జిల్లా నెల్లిమర్ల లోనే

నిలిపివేశారు. దీంతో అయన ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డుకునేందుకు పోలీసులు దురుసుగా ప్రయత్నించడంతో వీర్రాజు క్రింద పడిపోయారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ పై అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి బీజేపీ, జనసేన శ్రేణులు. ఒక్కసారిగా కార్యకర్తలు ముందుకు రావడం భారీగా అరెస్టులు చేపట్టారు. మీడియా వర్గాలను సైతం నెల్లిమర్లలోనే

నిలిపి వేశారు. 

విజయసాయి కి అనుమతి ఎలా ఇచ్చారు?

కేవలం ఎంపీ గా ఉన్న విజయ్ సాయి రెడ్డికి రెండు రోజుల క్రితం రామతీర్ధం కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారని వీర్రాజు ప్రశ్నించారు. తాము అనుమతి కోసం దరఖాస్తు చేస్తే. . షరతులతో కూడిన అనుమతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరి నిమిషంలో నమ్మక ద్రోహం

చేసిందన్నారు. ఈ రౌడీ పాలనకు చర్మ గీతం రాముడే పాలిస్తాడని మండిపడ్డారు. 

ఉద్రిక్తంగా మారిన నెల్లిమర్ల, రామతీర్ధాల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అరెస్టు లు జరిగాయి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ను అరెస్టు చేసి గరివిడి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సురేంద్ర మోహన్ ను గొర్ల

పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
అయితే సోమవారం రాత్రే విజయనగరం, నెల్లిమర్ల చేరుకున్న బీజేవైఎం కార్యకర్తలు కొందరు రామతీర్ధాల కు చేరుకునేందుకు ప్రయత్నించినా సమయంలో వీరందరి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

*జగన్ పాలనపై కేంద్రం సీరియస్, ఎంపీ సీఎం రమేష్.* 

గతి తప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పాలనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని రాజ్య సభ సభ్యుడు సి ఎం రమేష్ తెలిపారు. చలో రామతీర్థంలో పాల్గొనేనెందుకు విశాఖ కు చేరుకున్నఅయన గత 20 నెలల వైఎస్ జగన్ పాలన పై కేంద్రం సీరియస్ గా ఉందని, త్వరలోనే దీన్ని చక్కదిద్దెందుకు సన్నద్ధం అవుతోందన్నారు.  

పొలిసులు ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు:

కామినేని

వైఎస్ జగన్ అండ చూసుకుని రాష్ట్రంలో పోలీసులు ఓవర్ ఆక్షన్ చేస్తున్నారని, వారి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. చలో రామతీర్థంలో పాల్గొనేనెందుకు విశాఖ కు చేరుకున్న ఆయన్ను నగర కార్యాలయం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తప్పుపట్టారు. తాము

ఉగ్రవాదులమా, తీవ్రవాదులం కాదని, శాంతి యుతంగా ధర్నా చేసేందుకు అనుమతి కోరితే జగన్ ప్రభుత్వం ఓవర్ ఆక్షన్ చేసిందన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్ట్ లు:

చలో రామతీర్ధం పేరిట భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన శ్రేణులు చేరేందుకు సిద్దపడడంతో అగ్రనాయకులు వారి ఇళ్లవద్దే గృహ నిర్బంధం చేసారు. రాష్ట్ర

బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ను విశాఖలోని సీతమ్మధార లో గల అయన ఇంట్లో నిర్బంధించారు. మంగళ వారం ఉదయం పెద్ద సంఖ్యలో కార్ల తో ర్యాలీగా బయలు దేరేందుకు ఏర్పాట్లు చేసుకోవడం తో వీరిని అడ్డుకున్నారు. సీతమ్మధార లో భారీ పొలిసు వర్గాలు మోహరించాయి.    
       
విజయనగరం పంచముఖ ఆంజనేయ స్వామి

ఆలయంలో దర్శనానికి వెళ్లిన శివస్వామిని ఆలయం లోపలే నిర్బంధం చేయడం గమనార్హం. 

కొసమెరుపు:. ..  రామ తీర్ధం లో విగ్రహ ధ్వంసం ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పడికీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిన నేపథ్యంలో మంగళవారం చలో రామతీర్ధం ఉద్యమం జరుగుతున్నా సమయంలో ప్రకాశం జిల్లా శిగరాయకొండ

ప్రసిద్ధ లక్ష్మి నృసింహ స్వామి ( దేవాదాయ శాఖా) ఆలయ స్వాగత ద్వారం పై అన్యమత పిచ్చెక్కిన మతోన్మాదులు జరిపిన దాడిలో నృసింహ స్వామి విగ్రహం విరగడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam