DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మయాత్రను అడ్డుకోవడం ప్రభుత్వ పతనానికి సూచిక

*రాష్ట్ర బ్రాహ్మణా సంఘాల ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్*  

*గుడి తీసి ఉండగానే తాళం వేస్తారా?, శివస్వామి మండిపాటు*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 05, 2021  (డి ఎన్ ఎస్):* ఉత్తరాంధ్ర అయోధ్య విజయనగరం జిల్లా లోని రామతీర్ధాలు క్షేత్రంలో

జరిగిన ఘోరానికి నిరసనగా బీజేపీ, జనసేన చేపట్టిన చలో రామతీర్ధం ధర్మ యాత్రను అడ్డుకోవడం అంటే ప్రభుత్వ పతనానికి సూచిక అని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా సంఘాల ప్రధాన కార్యదర్శి ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ తెలియచేయారు. మంగళవారం జరిగిన చలో రామతీర్ధాలు ఉద్యమాన్ని నెల్లిమర్లలోనే నిరోధించిన ప్రభుత్వ వైఖరిపై అయన మండిపడ్డారు. బీజేపీ

రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై దౌర్జన్యం చేసి, అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. ముందుగా షరతులతో కూడిన అనుమతి ఇస్తామని చెప్పి, వైఎస్ జగన్ ప్రభుత్వం నయవంచన చేసిందన్నారు. శ్రీరాముని విగ్రహం సహా రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన పై దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యడం లో చూపించాల్సిన శాంతియుత ధర్నా చేస్తున్న బీజేపీ,

జనసేన వర్గాలపై చూపించడం సరికాదన్నారు.  

ఈ యాత్రలో పాల్గొనేందుకు విజనగరం వచ్చిన శివ స్వామి, స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనానికి వేళ్ళ గా చూసి, పోలీసులు ఆ గుడి ప్రధాన ద్వారానికి తలలు వెయ్యడం పై స్వామిజి ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. తక్షణం గుడి తాళాలు తియ్యాలని పోలీసులను డిమాండ్ చేసిన

పట్టించుకోక పోవడం పై మండిపడ్డారు. గుడి, గుళ్లోని దేవునికి తాళాలు వేసే శక్తి మీ ప్రభుత్వానికి ఎలా వచ్చిందని పోలీసులను ప్రశ్నించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam