DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాముడు మావాడే. . హిందుత్వా నే బీజేపీ అజెండా: సోము వీర్రాజు

*బాబు, జగన్ ఇద్దరూ .కుమ్మక్కై బీజేపీని అడ్డుకుంటారా?*

*బీజేపీ నేతలు అసాంఘిక శక్తులుగా కనపడ్తున్నారా : . ..*

*ధర్మపోరాట శిబిరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 06, 2021  (డి ఎన్ ఎస్):* రాముడు

మావాడేనని, హిందుత్వ నినాదమే భారతీయ జనతా పార్టీ అజెండా అని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. బుధవారం విశాఖపట్నం లోని జివిఎంసి గాంధీ బొమ్మ వేదికగా జరిగిన ధర్మ పోరాట దేశ శిబిరం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలు కూలుస్తుంటే. . ప్రతిపక్ష చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. హిందూత్వకు బీజేపీ కట్టుబడి ఉంది కనుకనే శతాబ్దాల తరబడి ఇతర పార్టీలు వివాదం చేస్తున్న అయోధ్య శ్రీరామ జన్మభూమి పై చట్ట ప్రకారం సంపూర్ణత భద్రతా కల్పించింది కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. ఇలాంటి శాంతియుత నిర్ణయం ద్వారా రామ మందిర నిర్మాణాన్ని

చంద్రబాబు గానీ, జగన్ గానీ సాధించగలరా అని ప్రశ్నించారు.  
ప్రభుత్వం అచేతనంగా హిందూ దేవాలయాల పై దాడి ని ఆపలేకపోయింది, ప్రతి రోజూ జరుగుతుంటే. . ముఖ్యమంత్రి నోరెత్తలేదని, దీనిపై బీజేపీ ఉద్యమించిందన్నారు.  అధికార పార్టీ నేతలకు, ప్రతిపక్ష నేతలకూ గుళ్ళోకి వెళ్లేందుకు చట్టభద్రతతో కూడనిన అనుమతి ఇచ్చారని, బీజేపీ కి

మాత్రం ఉక్కుపాదం మోపారన్నారు. రామతీర్ధాలు ఘటనపై బీజేపీ పార్టీ చలో రామతీర్ధాలు యాత్ర కు ఇచ్చిన పిలుపుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి నిద్రపట్టడం లేదన్నారు. అందుకే డీజీపీ సవాంగ్ కి గుబులు పడుతోందా? సీఎం, డిజిపి లు కూడబలుక్కుని, బీజేపీ పై ఉక్కుపాదం మోపారన్నారు. 
గురువారం మరోసారి రామతీర్థంకు వెళ్తామని

ప్రకటించారు. 

బీజేపీ నేతలు అసాంఘిక శక్తులుగా కనపడ్తున్నారా : . ..

ముఖ్యమంత్రి కి బీజేపీ నేతలు, కార్యకర్తలు అసాంఘిక శక్తులుగా కనపడుతున్నారా అని ప్రశ్నించారు. తాము సరిహద్దుల్లో చైనా ముష్కరులను, పాక్ తీవ్ర వాదులను ఎదుర్కొనే వాళ్ళం అన్నారు. 
కేరళ లో బీజేపీ సభ్యులు వందల్లో హతమారుస్తున్నారు.

బెంగాల్లోనూ వందలాదిగా కార్యకర్తలను మట్టుపెడుతున్నా . . బీజేపీ బెదరడం లేదన్నారు. జగన్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ వెనకడుగు వెయ్యదు. క్షేత్ర స్థాయిలో జగన్ పార్టీ చేసే అవినీతి ని కచ్చితంగా బయట పెడతాం, ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. 
ఈ ధర్నా లో మాజీ ఎంపీ హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి,

ఎమ్మెల్సీ  మాధవ్, సీనియర్ నాయకులూ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam