DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది నుంచి రామతీర్థం వరకు చిన్న జీయర్ ఆలయ సందర్శన

*గుడి పై కాక చర్చి పై దాడి జరిగితే ప్రపంచం మొత్తం ఏకమై ఉండేది* 

*ఆలయాల రక్షణలో మీడియా భాగస్వామ్యం కోసం స్వామిజి ఆహ్వానం*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 06, 2021  (డి ఎన్ ఎస్):* గత ఏడాది నుంచి ఇంతవరకూ ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా విధ్వంసానికి గురైన

హిందూ దేవతావిగ్రహాలు, రథాలు నెలకొన్న ధార్మిక క్షేత్రాలను స్వయంగా సందర్శించనున్నట్టు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు చిన్న జీయర్ స్వామి తెలిపారు. విజయవాడలోని విజయ కీలాద్రి పై జరుగుతున్నా ధనుర్మాస వేడుకల వేదిక వద్ద నిర్వహించిన విలేకరుల సమావేసంలో అయన ఈ పర్యటన ప్రస్తావన తీసుకువచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లో ఆగంతుల దురాగతానికి బలైన శ్రీలక్ష్మి నృసింహ స్వామి ఆలయాన్ని ఈ నెల 17 న సందర్శించనున్నారు. ఆలయాలను సమాజానికి రక్షణ గా నిలిచే ధార్మిక కేంద్రాలని, అలాంటివాటిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భగవంతుడు ఏ ఒక్క పీఠాధిపతికో, ధర్మ ప్రబోధకునికో మాత్రమే సొంతం కాదని,

వాళ్లకెంత అనుబంధం ఉందొ సామాన్య భక్తులకూ అంటే అనుబంధం ఉంటుందన్నారు.   

వైదిక ధర్మాన్ని కాపాడడం సన్యాస ధర్మమని, ఆ భాద్యతను నెరవేర్చేందుకు తాము ఈ పర్యటన చేస్తున్నట్టు తెలిపారు. అందరిని కలుపుకుంటూ వెళ్లే విధంగానే ఆ క్షేత్రాల్లోని స్థానిక హిందూ భక్తులు, యువత లో చైతన్యం కల్గించి, మరింత ఉత్సాహంగా ఆలయాలకు

పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేలా ఈ యాత్ర ఉంటుందన్నారు.  
  
హిందూ దేవాలయ వ్యవస్థకు రక్షణ కొరవడింది అనేది స్పష్టం గా ఉందన్నారు. ఆ లోపం రామతీర్ధం ఘటనతో పతాక స్థాయికి చేరిందన్నారు. ఆలయాల రక్షణ లో మీడియా భాగస్వామ్యం కోరుతూ జీయర్ స్వామిజి ఆహ్వానం పలికారు. తమ పరిధిలోని ఆలయాల్లోని లోపాలను, ఎప్పడికప్పుడు సమాజం

దృష్టికి తీసుకురావడం ద్వారా లోపాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందన్నారు.  
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలకు రక్షణ వ్యవస్థ లోపించింది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 50 ఆలయాల పరిధిలో విధ్వంసాలు జరిగాయని, వాటిల్లో 39 కి పైగా దేవాదాయ శాఖా పరిధిలోని ఆలయాలు ఉన్నాయన్నారు. నేటికీ ఇంకా దాడులు

జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ తప్పిదాలకు దేవాదాయ శాఖదే భాద్యత అన్నారు. ఆలయాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు అత్యంత బాధ్యతాయుతంగా ఉందని, ఈ ఘటనల వల్ల దేవాదాయ శాఖా లోపాలు బయట పడుతున్నాయి. వాటి కారణంగానే ఈ ఘోరాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయ వ్యవస్థను సురక్షితం చెయ్యాల్సిన అవసరం ఉందని, ధర్మ జాగృతి కల్గిన వారందరిని

కలుపుకుని వెళ్తాం. జరగాల్సిన తక్షణ చర్యలు ఏంటి? అనేది చర్చించి, సూచించడం జరుగుతుందని తెలిపారు. 
తాము దైవానికి సేవకులమే తప్ప నాయకులను కాదన్నారు. తమకు ఉన్న భాద్యతగా ఈ పర్యటన జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో త్రిదండి అహోబిల జీయర్ స్వామి పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam