DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ఆలయాల రక్షణ కై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం

*హిందూ దేవాలయాలు ఉండాల్సింది ప్రభుత్వ అధీనం లో కాదు* 

*ఏఐబిఎఫ్ జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్  శ్రీనివాస్ వెల్లడి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 10, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండేళ్ల కాలం నుంచి వరుసగా హిందూ దేవాలయాల పై జరుగుతున్నా

దాడుల నుంచి ఆలయాలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆలిండియా బ్రాహ్మణా ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్  శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆలయాలపై జరుగుతున్నా దాడులపై అయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఆలయాలను రాజకీయం కోసం ప్రచారం

చేస్తున్నఅన్ని రాజకీయ పార్టీల వైఖరిని అయన తప్పు పట్టారు. వీటిని ఏ విధంగా రక్షించుకోవాలి అనే అంశంపై త్వరలోనే విశాఖనగరం వేదికగా పీఠాధిపతులు, హైందవ సంప్రదాయ పరులు, ధార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులు, విద్యావేత్తలు, హిందూ సంస్కృత స్వచ్చంద సంస్థలు, అర్చక, అర్చాకేతర యువతి యువకులు తదితరులతో, రౌండ్ టేబుల్

సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ చర్చా వేదికలో పాల్గొనేవారు స్వచ్చందంగా రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ వివరాలను త్వరలో తెలియచేస్తామని వివరించారు.  

పాలకులు విఫలం చెందారు:. . .

రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖా ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ ఆలయాలను రక్షించడం లో పూర్తిగా విఫలం చెందాయన్నారు. వీటి

రక్షణకై ప్రతి హిందువు స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు. దేవాదాయ శాఖా ఉన్నది కేవలం జీతాలు తీసుకోడానికేనని, హుండీల్లో డబ్బులు వాడుకోడానికే తప్ప, ఆలయాల రక్షణపై పూర్తి భాద్యత వహించడం లేదన్నారు. వారి భాద్యత సక్రమంగా నిర్వర్తించి ఉంటె. . హిందూ ఆలయాల్లోని దేవి దేవత విగ్రహాలపై దాడులు జరిగేవి కాదన్నారు. 

గుళ్ళు

ఉండాల్సింది ప్రభుత్వ అధీనంలో కాదు : . . .

హిందూ దేవాలయాలు ఉండాల్సింది ప్రభుత్వ అధీనం లో కాదని, హిందూ ధార్మిక సంఘాలు, పీఠాధిపతుల పర్యవేక్షణలోనే ఉండాలన్నారు. ఆలయాలు పాటిస్తున్న ఆగమ సిద్దాంతాలను బట్టి, ఆయా పీఠాధిపతుల పర్యవేక్షణలోనే సాగాలన్నారు. శైవ ఆగమాలు శైవ సంప్రదాయ పీఠాధిపతులు, పాంచరాత్ర, వైఖానస ఆగమ

విధానంలో నడిచే వైష్ణవ క్షేత్రాల వైష్ణవ పీఠాధిపతులకే అప్పగించాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam