DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి వెల్లంపల్లి భేషరతు క్షమాపణ చెప్పాలి: క్షత్రియ సేవా సమితి

*క్షత్రియులు ఆగ్రహిస్తే రాజకీయ మనుగడ ఉండదు* 

*మంత్రిని బర్తరఫ్‌ చేయాలి: క్షత్రియ సేవా సమితి డిమాండ్* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 09, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్‌ ఇటీవల మాజీ కేంద్ర మంత్రి

పూసపాటి అశోక గజపతిరాజు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యపై తక్షణం క్షమాపణ చెప్పాలని, ఆయనను వెంటనే మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ చేయాని ఫెడరేషన్‌ ఆఫ్‌ క్షత్రియ సేవా సమితి ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేస్తూ తీర్మానించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని దివాన్‌చెరువు డిబివి రాజు లేఅవుట్‌లోని శ్రీ దాట్ల

రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన ఫెడరేషన్‌ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌ వెంకటపతిరాజు మాట్లాడుతూ పూసపాటి వంశీయుల అనాదిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. తమ ఆస్తులను విద్యాసంస్థలు, దేవాయా నిర్వహణకు అప్పజెప్పిన ఘనచరిత్ర ఆ కుటుంబానికి ఉందన్నారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్ధంలో

శ్రీరాముని  శిరస్సును భిన్నం చేసి కొలనులో పడవేసిన సంఘటనకు అశోక గజపతిరాజును బాధ్యుడ్ని చేసి ఆయనను ధర్మకర్తగా తొలగించడం అన్యాయమన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో మంత్రి వెల్లంపల్లి అశోక గజపతిరాజును ధూషించిన ఘటనపై యావత్‌ క్షత్రియ సమాజం స్పందించిందన్నారు. దీనిపై మంత్రి వెంటనే బేషరతు గా క్షమాపణ చెప్పాలని,

లేనిపక్షంలో సంక్రాంతి తర్వాత దశవారీగా ఉద్యమం చేసి ఆయన మెడలు వంచి తీరతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాట్ల సత్యనారాయణరాజు మాట్లాడుతూ పదేపదే హిందూ ఆలయాలపై అమానుష చర్యలు జరగడం, దానికి బాధ్యత వహించి పదవి నుండి వైదొగాల్సిన మంత్రి వెల్లంపల్లి, అశోక గజపతిరాజుపట్ల అమానుషంగా ప్రవర్తించడం పట్ల యావత్‌ క్షత్రియ

సమాజం ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. 
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ సాధన సమితి జెఎసి కన్వీనర్‌ బుద్ధరాజు శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో పదేపదే హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో 145 దేవాలయాలపై దాడులు జరిగితే 70 నుంచి 80 శాతం వరకు ఉన్న హిందువులు దీనిపై మాట్లాడడం లేదన్నారు. ఒక్కో

క్షత్రియుడు 100 కుటుంబాలతో సమానమని, ఆ క్షత్రియుడు ఆగ్రహిస్తే ఈ రాష్ట్రంలో రాజకీయ మనుగడ సాగించలేరన్నారు. టిడిపి హయాంలో క్షత్రియ కార్పొరేషన్‌ కోసం ఉద్యమం చేస్తే ఇబిసి కార్పొరేషన్‌ ద్వారా రూ.50కోట్లు కేటాయించారని, అధికారంలోకి వస్తే క్షత్రియుకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఇస్తామని ప్రకటించిన ప్రస్తుత ముఖ్యమంత్రి

వైఎస్‌ జగన్‌ ఇంకా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు.  మరో కో కన్వీనర్‌ గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ అశోక గజపతిరాజుకు జరిగిన అన్యాయంపై పోరాట బాట పట్టేందుకు ప్రతీ క్షత్రియుడు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఆయా పాలకమండళ్లపై చర్యలు తీసుకోని ప్రభుత్వం

విజయనగరం ఘటనలో అశోకగజపతిరాజును  ధర్మకర్తగా తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే దిశగా దేవాదాయ శాఖా మంత్రి వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండిచారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేపదే క్షత్రియ జాతిపై ప్రభుత్వపరంగా వ్యతిరేక ధోరణలు వ్యక్తమవుతున్నాయని, ఇలా మౌనంగా ఉంటే రాబోయే

కాంలో మనుగడ కష్టసాధ్యంగా మారుతుందని, అందువల్ల ఫెడరేషన్‌ ఆఫ్‌ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటి ఆందోళనకు పిలుపునివ్వాలని డిమాండ్‌ చేశారు. 
ఈ కార్యక్రమంలో ఎం.సత్యనారాయణరాజు (మాస్టారు), కె.రామకృష్ణంరాజు, ఎం.ఆంజనేయరాజు, దాట్ల కృష్ణంరాజు, భగవాన్‌రాజు, కోసూరి సుబ్బరాజు, వి.రామకృష్ణంరాజు,

మధువర్మ, పిఎస్‌ రాజు, గాదిరాజు ప్రసాదరాజు, అూ్లరి రామరాజు,                     కోసూరి చండీప్రియ, పేరిచర్ల సూర్య ప్రభావతి, శివాజీరాజు, కె.యేసురాజు, నంబూరి సుబ్బరాజు, కెవి సుబ్బరాజు (చిన్న), దంతుూరి సుబ్బరాజు, చింతపాటి కాశిరాజు, దాట్ల పృథ్విరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam