DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 నుంచి పటేల్ ఐక్యత విగ్రహ సందర్శనకై 8 రైళ్లు

*ప్రధాని నరేంద్ర మోడీ చే వీడియో ద్వారా ప్రారంభం.*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి ఐక్య‌తా విగ్ర‌హం వ‌ద్ద‌కు నిరంత‌రాయప్ర‌యాణానికి వీలుక‌ల్పిస్తూ 8 రైళ్ల‌ను జ‌న‌వ‌రి 17న జెండా ఊపి

ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గుజ‌రాత్‌లో రైల్వే రంగానికి సంబంధించి ప‌లు ఇత‌ర ప్రాజెక్టుల‌ను మోడీ ప్రారంభించనున్నారు. 
 గుజ‌రాత్‌లోని కెవాడియాకు దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి 8 రైళ్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 2021 జ‌న‌వ‌రి 17 ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో

కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించ‌నున్నారు. ఈ రైళ్లు ఐక్య‌తా ప్ర‌తిమ వ‌ద్ద‌కు నిరంత‌రాయ ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్‌లో రైల్వే రంగానికి సంబంధించి ప‌లు ఇత‌ర ప్రాజెక్టుల‌ను కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్నారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, కేంద్ర

రైల్వేశాఖ మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.
ప్ర‌ధాన‌మంత్రి ద‌బోయి- చందోడ్ గేజ్ మార్పిడి చేసిన బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ ను, చందోడ్‌- కేవ‌డియా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌, కొత్తగా విద్యుదీక‌రించిన ప్ర‌తాప్‌న‌గ‌ర్‌-కెవాడియా సెక్ష‌న్ , ద‌భోయి, చందోడ్‌,కెవ‌డియా కొత్త రైల్వే స్టేష‌న్

భ‌వ‌నాలను ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్నారు.ఈ భ‌వ‌నాల‌ను స్థానిక‌త మేళ‌వింపుతో ర‌మ‌ణీయ‌మైన డిజైన్ల‌తో రూపొందించారు. వీటిలో ఆధునిక రీతిలో ప్ర‌యాణికుల సదుపాయాలు  క‌ల్పించారు దేశంలోగ్రీన్ బిల్డింగ్ స‌ర్టిఫికేష‌న్ క‌లిగిన  తొలి రైల్వేస్టేష‌న్ కెవాడియా స్టేష‌న్‌. ఈ ప్రాజెక్టులు

స‌మీపంలోని గిరిజ‌న ప్రాంతాల‌లో అభివృద్ధికి అవ‌కాశం కలిగిస్తాయి. ఇవి ఆ ప్రాంతంలోని ప్ర‌ధాన మ‌త‌ప‌ర‌మైన ప్రాంతాలు, న‌ర్మ‌దా న‌దీతీరంలోని  ప్రాచీన యాత్రా స్థ‌లాల‌ను అనుసంధానం చేస్తాయి. ఇవి దేశీయ అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కాన్ని పెంపొందించ‌నున్నాయి. అలాగే మొత్తంగా ఈ ప్రాంత సామాజిక ఆర్ధిక

అభివృద్ధికి వ్యాపార అవ‌కాశాల‌కు ఇది దోహ‌దం చేయ‌నుంది

ప్ర‌ధాన‌మంత్రి జెండా ఊపి  ప్రారంభించ నున్న 8 రైళ్ల కు సంబంధించిన వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి.

1. 20903/04 కేవ‌డియా నుంచి వార‌ణాశి, మ‌హామ‌న ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ)
2. 12927/28  దాద‌ర్  నుంచి కెవాడియా, దాద‌ర్‌-కెవాడియా ఎక్స్‌ప్రెస్

(డెయిలీ) 
3. 20947/48. అహ్మ‌దాబాద్ నుంచి కెవాడియ, జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ (డైలీ)
4. 20945/46.   కేవ‌డియా నుంచి హ‌జ‌ర‌త్‌నిజాముద్దీన్‌, నిజాముద్దీన్‌-కేవ‌డియా సంప‌ర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ)
5. 20905/06. కేవ‌డియా నుంచి రేవా, కేవ‌డియా-రేవా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
6. 20919/20. చెన్నై నుంచి కేవ‌డియా,

చెన్నై -కేవ‌డియా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ) 
7. 69201/02. ప్ర‌తాప్‌న‌గ‌ర్‌ నుంచి కేవ‌డియా, మెము ట్రెయిన్ (డెయిలీ)
8. 69203/04. ప్ర‌తాప్‌న‌గ‌ర్‌ నుంచి కేవ‌డియా, మెము ట్రెయిన్ (డెయిలీ) 
జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు అత్య‌ధునాత‌న విస్టా డోమ్ టూరిస్ట్ కోచ్‌ను ఏర్పాటుచేస్తారు. ఇది ఆకాశ‌పు అంచులవ‌ర‌కూ

అందాల‌ను తిల‌కించే అద్భుత అవ‌కాశం కలిగిస్తుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam