DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ దేశాలకు భారత మేధస్సు ప్రతిభ తెలిసింది.

*భారత శాస్త్రవేత్తలకు ప్రజలంతా ఋణపడి ఉన్నారు.* 

*దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ* 

*దేశమంటే మట్టికాదోయ్. . దేశమంటే మనుషులోయ్...*

*కోవిడ్ వాక్సిన్ విడుదల ప్రసంగంలో ప్రధాని నోటి వెంట గురజాడ కవిత*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, జనవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* గత ఏడాది కాలంగా నిద్రాహారాలు మరిచి, కోవిడ్ మహమ్మారికి వాక్సిన్ ను సిద్ధం చేసిన భారత శాస్త్రవేత్తల మేధస్సు ప్రపంచ దేశాలకు తెలిసిందని, వీరందరికి భారత దేశ ప్రజలు ఋణ పడిపోయారని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. శనివారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన

మాట్లాడుతూ ఈ కృషి లో శ్రమించి, భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదములు తెలిపారు. దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా మోడీ తెలుగు ఆధునిక కవి గురజాడ అప్పారావు చేసిన రచన . .. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న వాక్యాలను దేశప్రజలకు తెలియచేసారు. జనం ఆరోగ్యంగా ఉంటేనే, దేశం ఆరోగ్యంగా

నిలబడుతుందన్నారు. వీడియో ద్వారా విడుదల చేసిన ఈ ప్రారంభోత్సవ ప్రసంగాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రభుత్వాల అధికారులు, వైద్య బృందాలు, సహాయక బృందాలు, అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

విశాఖ లో. .. 

విశాఖలో కోవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం మొదలయింది. జిల్లాలో 32 కేంద్రాలలో 38 వేల మందికి టీకా

వేసే ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసింది. విశాఖ చిన వాల్తేర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇద్దరు వైద్యాధికారులు, జివిఎంసి, జిల్లా వైద్యశాఖాధికారులు సమన్వయంతో టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీకా వేసిన తరవాత 30 నిముషాలు పాటు లబ్దిదారుడుని పర్యవేక్షించే

ఏర్పాటు చేశారు. ముందుగా పారిశుధ్య కార్మికులు, వైద్య సహాయ సిబ్బంది కి ఈ టీకా ను అందిస్తున్నారు. 

విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్  చిన వాల్తేర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన మంత్రి  దృశ్య శ్రవణ మాధ్యమ సమీక్ష లో పాల్గొనారు.


టీకా ఎవరెవరు తీసుకోవాలి  ఎవరు

తీసుకోవద్దు

ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే టీకా ఎవరెవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అన్న అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దీని కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. వీడియో లింక్ ద్వారా ప్రధాని మోదీ వ్యాక్సినేషన్

ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి దశలో ప్రభుత్వం మూడు కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.

ఇవే మార్గదర్శకాలు..

1. కోవిడ్ టీకా కేవలం 18 ఏళ్ల వయసు దాటినవారికి మాత్రమే..
2. 14 రోజుల తేడాతో రెండు డోసుల టీకాలు ఇవ్వడం జరుగుతుంది..
3. తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో..

రెండవ డోసు కూడా అదే టీకా అయి ఉండాలి..
4. వ్యాక్సిన్లను మార్చడం కుదరదు..

ఎవరికి ఇవ్వొద్దంటే..

1. అలర్జీ.. అనఫైలాటిక్ రియాక్షన్లు ఉన్నవారు కోవిడ్‌19 టీకా తీసుకోవద్దు. ఇంజక్షన్లతో అలర్జీ వచ్చేవారిని కూడా దూరం పెట్టాలి..
2. గర్భిణులు, బాలింతలు టీకా తీసుకోవద్దు. ఎందుకంటే, ఇప్పటి వరకు గర్బిణులపై టీకా

ట్రయల్స్ చేపట్టలేదు. అందుకే వారు వ్యాక్సిన్ తీసుకోవద్దు. పాలు ఇచ్చే తల్లలు కూడా టీకాకు దూరంగా ఉండడం బెటర్‌.
3. సార్స్ సీవోవీ2 ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉన్నవారికి కోలుకున్న తర్వాత కొన్ని వారాలకు టీకా ఇవ్వాలి..
4. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారికి కూడా కొన్ని వారాల విరామం తర్వాత టీకా ఇవ్వాలి.
5. తీవ్ర అనారోగ్యంతో

బాధపడుతున్న వారికి కూడా తక్షణమే టీకా ఇవ్వకూడదు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam