DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణుణ్ణి అవమానించిన ఘటనలో పోలీసుల పై వేటు

*గోకవరం కానిస్టేబుల్ సస్పెన్షన్, విఆర్ కు ఎస్ఐ*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరిజిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ లో ఓ బ్రాహ్మణుడిని లాకప్ లో వేసి జంధ్యం బలవంతంగా తెంపిన ఘటనలో బాద్యుడైన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్టు,

ఎస్ ఐ ని వి ఆర్ కు పంపడం పట్ల పలు బ్రాహ్మణా సంఘాలు హర్షం వ్యక్తం చేసారు. బ్రాహ్మణా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, ఘటన పూర్వాపరాలు పరిశీలించి, దోషులపై చర్యలు తీసుకున్న రాజమహేంద్రవరం అర్బన్ ఎస్ పి షిమోషి బాజ్ పేయ్ కు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసాయి భ్రమణ సంఘాలు. సమాజం లోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే వారు

బ్రాహ్మణులని, అలంటి వారి మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని, బ్రాహ్మణా సంఘాలు కదిలి వచ్చాయి. బాధితునికి న్యాయం జరిగేలా కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనువాసు, పొలిసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా

సంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, తదితరులకు బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam