DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్థం ఆలయ పునః నిర్మాణానికి దేవాదాయ శాఖా నిర్ణయం

*రూ. 3 కోట్లు వ్యయంతో ఆధునీకరిస్తాం, మంత్రి వెలంప‌ల్లి*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 18, 2021  (డి ఎన్ ఎస్):* ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుపొందిన విజయ నగరం జిల్లా లోని రామతీర్థం లో గల శ్రీ రామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని వసతులతో ఆధునికంగా తిరిగి నిర్మించేందుకు ఆంధ్ర

ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడ లోని బ్రాహ్మాణ‌వీధిలో దేవాదాయ శాఖా మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు క్యాంపు కార్యాల‌యంలో జరిగిన సమీక్ష సమావేశంలో సుమారు రూ. 3 కోట్లకు వెచ్చించి ఆధునిక వసతులతో అభివృద్ది, పునః నిర్మాణానికి రంగం సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వైదిక, ఆగమ పండితులు స‌ల‌హాలు తీసుకోవడం జరిగిందన్నారు. వైఖాసన ఆగమ సంప్రదాయం ప్ర‌కారం ఆల‌య అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు వివ‌రించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థం పునః నిర్మాణ ప‌నులు ఏడాదిలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను అదేశించారు. 700

అడుగు ఎత్తులో ఉన్న ఆల‌య నిర్మాణం  పూర్తి రాతి క‌ట్ట‌డాల‌తో జ‌రుగుతుంద‌న్నారు. కోదండ రాముడి విగ్ర‌హాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం వారు త‌యారు చేసి అంద‌జేయచున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా  రామ‌తీర్థం మెట్లు మార్గం స‌రిచేయ‌డం పాటుగా కొత్త‌ నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు.

దేవాల‌య ప‌రిస‌రాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంక‌ర‌ణ చేయ‌డం, శా‌శ్వత నీటి వ‌స‌తి, కోనేటిని శుబ్ర‌ప‌ర్చ‌టం, అనంత‌రం కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్నాటు చేయ‌టం, ప్రాక‌ర నిర్మాణం, హోమ‌శాల‌, నివేద‌న శాల నిర్మాణం కూడా పూర్తి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ఈ సమావేశంలో దేవదాయ శాఖా ( రెవిన్యూ)

కార్యదర్శి గిరిజా శంక‌ర్‌, ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు, ఎస్.ఈ ఎ శ్రీ‌నివాస్‌, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ డి.  భ్ర‌మ‌రాంబ‌, డిఈలు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam