DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళా వెంకటరావు చేసిన తప్పేంటి ? ఎందుకు అరెస్టు చేశారు

*ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన గళం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* ఎన్నో అత్యున్నత పదవులు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు,ఆ మాజీ మంత్రి కళా వెంకటరావు ఏం తప్పు చేశారని,

అకారణంగా ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారో సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం రాత్రి కళా వెంకటరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ నాయకులూ, కార్యకర్తలు నిరసన గళాన్ని వినిపించారు. రామతీర్థంలో విజయసాయిని ఏ

చట్టం కింద అనుమతించారని నిలదీశారు. అసలు డీజీపీకి లా అండ్‌ ఆర్డర్‌ అమలు చేయడం వచ్చా లేదాని మండిపడ్డారు. కళావెంకట్రావు చేసిన తప్పేంటో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాలను ప్రజలంతా గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారన్నారు. 

విశాఖ లోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే

వెలగపూడి రామకృష్ణబాబు ఈ ఘటనపై మండిపడ్డారు. దేవాలయాల దాడులపై తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే అరెస్ట్ చేశారు. విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, సిహెచ్ వి పట్టాభి రామ్, పాశర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని జాంపేటలోని గాంధీ విగ్రహం

వద్ద నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ తమ పార్టీ కి చెందిన నేతల పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందన్నారు. వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకుల పై తప్పుడు కేసులు పెట్టిస్తోందని, రాష్ట్రంలో ఉన్నాది పాలన

సాగుతోందని మండిపడ్డారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఇతర నాయకులూ పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam