DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొదటి దశ ఎన్నికల ప్రక్రియ రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ

*రెండవ దశ ను నుంచి ప్రక్రియ మొదలు కానుంది.*

*మొదటి దశ ను ఫిబ్రవరి 10 కి (నాల్గవ దశగా) మార్చారు.*
 
*జనవరి 27 నుంచి తొలిదశ ఎన్నికల ప్రక్రియ. . .*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* భారత అత్యున్నత న్యాయ స్థానం స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్

సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేసింది. ఇప్పడికే ఎన్నికల కమిషన్ సోమవారం నుంచి మొదటి దశ నిర్వహణకు ప్రకటన విడుదల చేసింది. అయితే ఉద్యోగులు, ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడం తో మొదటి రోజైన సోమవారం రాష్ట్రంలోని ఏ గ్రామపంచాయితీ లోనూ ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు. ఈ

నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వడంతో, ఎన్నికల కమిషన్ మొదటి దశ ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేసింది. ఈ దశను ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రెండవ దశ ప్రక్రియ నుంచి మిగిలిన ప్రక్రియ యధావిధిగా సాగుతుందని, రెండవ దశనే మొదటి దశ గా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు

అధికారిక ప్రకటన విడుదల చేసింది.  

గతం లో ప్రకటించిన తేదీల ప్రకారం 
మొదటి దశ ప్రక్రియ జనవరి 23 నుంచి, రెండవ దశ  ప్రక్రియ జనవరి 27 నుంచి, మూడవ దశ  ప్రక్రియ జనవరి 31 నుంచి, నాల్గవ  దశ  ప్రక్రియ ఫిబ్రవరి 4 నుంచి మొదలవుతుంది. 

అయితే ప్రస్తుతం మారిన తేదీన ప్రకారం  

మొదటి దశ  ప్రక్రియ

జనవరి 27 నుంచి  నామినేషన్లు గడువు జనవరి 31   
రెండవ దశ  ప్రక్రియ జనవరి 31 నుంచి  నామినేషన్లు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు 
మూడవ దశ  ప్రక్రియ ఫిబ్రవరి 4 నుంచి, నాల్గవ దశ ప్రక్రియ ఫిబ్రవరి  10 నుంచి  మొదలవుతుంది. 
 
మారిన కొత్త ఎన్నికల తేదీల ప్రకారం. . . .

మొదటి దశ ప్రక్రియ:  జనవరి 29 నుంచి నామినేషన్ల

స్వీకరణ
జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 9న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల

లెక్కింపు, ఫలితాలు వెల్లడి.

రెండో దశ ప్రక్రియ :  ఫిబ్రవరి 2 అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 4 నుంచి నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 5 నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 8న నామినేషన్ల తుది

గడువు

ఫిబ్రవరి 13న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.

మూడవ దశ ప్రక్రియ : ఫిబ్రవరి 6 నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 10న నామినేషన్లపై వచ్చిన

అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 12న నామినేషన్లకు ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 17న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.

నాల్గవ  దశ ప్రక్రియ : ఫిబ్రవరి 10 నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
/> ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 16న నామినేషన్లకు ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు) సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు,

ఫలితాలు వెల్లడి.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam