DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒకే దేశం - ఒకే రేషన్ కార్డ్, ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు

*బడ్జెట్ 2021-22: వ్యవసాయ రుణాలు, ఆరోగ్యాలకు పెట్టపీట*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 01, 2021  (డి ఎన్ ఎస్):* పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టి  కేటాయింపులు చేశారు.

మొత్తం 2021-22 బడ్జెట్ అంచనా వ్యయం రూ.34.83 లక్షల కోట్లుగా కేంద్రం అభివర్ణించింది.  ద్రవ్యలోటు 9.5శాతంగా ఉంది.  ద్రవ్యలోటును అప్పుల ద్వారా భర్తీ చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయించింది.

ఏ రంగానికి కేంద్రం ఎంత కేటాయించింది? రంగానికి ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు .

.

వ్యవసాయ రుణాలకి 16.5 లక్షల కోట్లు, దేశ ఆరోగ్యరంగానికి 2 లక్షల కోట్లు,  రైల్వే శాఖ లక్ష 10వేల కోట్లు,   జల్ జీవన్ మిషన్ 2.87 లక్షల కోట్లు,   విద్యుత్ 3.5 లక్షల కోట్లు, స్వచ్చ్ భారత్ 2.0కి  లక్ష 41 వేల కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాలకి 40 వేల కోట్లు, ఆత్మ నిర్భర్ ఆరోగ్య భారత్ కి 2.23 లక్షల కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ 3

వేల కోట్లు, వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు,  సౌర శక్తి రంగానికి 1000 కోట్లు,  కరోనా వాక్సిన్ కి 35 వేల కోట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 15700 కోట్లు, రక్షణ మంచినీటి పథకాలు 87 వేల కోట్లు కేటాయించారు. 


ధరలు పెరిగేవి ఇవే..
మొబైల్ లు, కార్ల విడిభాగాల ధరలు, నైలాన్ దుస్తుల ధరలు పెరుగనున్నాయి.  సోలార్

ఇన్వర్టర్ల పై పన్ను పెంపు ఇంపోర్టెడ్ దుస్తులు మరింత పెరుగనున్నాయి. దిగుమతి చేసుకున్న క్లాత్స్ వంట నూనే ఆటో పార్ట్స్ ధరలు పెరిగాయి. రత్నాల ధరలు పెరిగాయి. లెథర్ షూ ధర కూడా పెరుగుతుంది. కాబులీ చానా పప్పులు యూరియా ఆటో స్పెర్ పార్ట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.
 
బడ్జెట్ తో తగ్గేవి ఇవే..
కరోనా లాక్ డౌన్ తో

ఆకాశాన్ని అంటి గృహనిర్మాణానికి గుదిబండగా మారిన  ఐరన్ స్టీల్ ధర తగ్గాయి.  వెండి బంగారం ధరలు తగ్గాయి. డ్రై క్లీనింగ్ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా దిగొచ్చాయి. నైలాన్ క్లాత్స్ ధరలు తగ్గనున్నాయి. కాపర్ వస్తువుల ధరలు కూడా దిగొచ్చాయి. ఇన్సురెన్స్ చేసుకునేవారికి కూడా బెనిఫిట్స్ కలిగించారు. షూ ధరలు కూడా తగ్గాయి.

అయితే మామాలు షూ ధర మాత్రం తగ్గుతాయి. లెథర్ షూ రేట్ మాత్రం కాదనే విషయం గమనించాలి.

అందరికీ మరో ఏడాది గృహవసతి
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కాలపరిమితి మరో ఏడాది పెంపు.. గృహ రుణాల రాయితీ పథకం పొడిగింపు.. గృహాలు నిర్మించే సంస్థలకు మరో ఏడాదిపాటు పన్ను విరామం.

అన్నదాతలకు కేంద్రం అండ.. రైతులకు 16.50 లక్షల కోట్ల

రుణాలు. . . కేంద్రబడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ కనీస మద్దతు ధరకు గాను 172000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనావేశారు. 2020-21లో 75 వేల కోట్ల రూపాయలు రైతులకు కేటాయించామని.. దీనివల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ బడ్జెట్ లో 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను

అందించాలని లక్ష్యంగా నిర్ధేశించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డ్.. ఇక ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు: . .

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేదలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. దేశంలోని వలసకార్మికులు పేదలు ఇక ఎక్కడినుంచైనా రేషన్ తీసుకోవచ్చని ప్రకటించారు. ఒకే

దేశం-ఒకేరేషన్ కార్డు’ విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని నిర్మల ప్రకటించారు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఉన్నా.. వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చని నిర్మల పేర్కొన్నారు. ఈ పథకంతో ముఖ్యంగా వలస కార్మికులు లాభపడుతారని

పేర్కొన్నారు.

ఆరోగ్యానికి పెద్దపీట..
ఆరోగ్యరంగంలో రూ.64180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మల తెలిపారు. దీనికి పీఎం ఆత్మనిర్భర్ భారత్ ఆరోగ్య పథకంలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. కొత్తగా బీఎస్ఎల్-3 స్తాయి ప్రయోగశాలలు 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక కరోనా

వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు.. భారత్ తోపాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఎన్నికల రాష్ట్రాలపై బడ్జెట్ లో ఫోకస్
నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే బెంగాల్ తమిళనాడు కేరళ రాష్ట్రాలపై ఈ బడ్జెట్ లో నిర్మలా

సీతారామన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి ఏకంగా రూ.1 లక్షల కోట్లు ప్రకటించడం చూసి అందరూ ముక్కునవేలేసుకున్నారు.ఇక ఎన్నికలు జరిగే కేరళలలో 1100 కి.మీల మేర  జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. బెంగాల్ లో రూ.25వేల కోట్లతో హైవేలను అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.ఇక ఇదే కాదు.. అభివృద్ధి పనుల

పేరిట ఆ రాష్ట్రాలకు కేంద్రం నిధులు కురిపించింది. కేరళలో రూ.65 వేల కోట్లు.. బెంగాల్ లో రూ.95వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీకి కేంద్రం మరో వరం
 తాజా బడ్జెట్ లో ఏపీకి తీపి కబురు అందింది. ఏపీకి కేంద్రం ఓ వరం ప్రకటించింది. ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ -కోస్ట్ సరుకు

రవాణా కారిడార్ కేంద్రం ప్రకటించింది.2022 జూన్ నాటికి తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు.. రైల్వే మౌలిక సౌకర్యాలకు ఏకంగా రూ.101055 కోట్లు

కేటాయించనున్నట్టు నిర్మల తెలిపారు. అలాగే ఈ లైన్ లో 2023 కల్లా విద్యుదీకరణ కూడా పూర్తి చేస్తామని సభలో తెలిపారు. దీంతో ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నైబెంగళూరు కేరళ మెట్రోలకు వేల కోట్లు.. హైదరాబాద్ కు మొండిచేయి
తాజాగా బడ్జెట్ లో తమిళనాడు కేరళ బెంగళూరులకు నిధుల వరద పారించింది కేంద్రం.. అంతే

పెద్ద నగరం ఉన్న హైదరాబాద్ మెట్రోకు మాత్రం మొండి చేయి చూపించింది. 18వేల కోట్లతో బస్ ట్రాన్స్ పోర్ట్ పథకాన్ని తమిళనాడుకు ప్రకటించింది. మెట్రోలైట్ మెట్రో నియో పథకాలను చెన్నై మెట్రోకు ప్రకటించింది. ఇక కేరళలోని కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా చెన్నై మెట్రోకు రూ.63246 కోట్లు

బెంగళూరు మెట్రోకు రూ.14788 కోట్లు కేటాయించింది.సీఎం కేసీఆర్ కేటీఆర్ కోరినా కూడా తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోకు రూపాయి విదిల్చలేదు.

రెండు సర్కార్ బ్యాంకులకు కేంద్రం మంగళం
దేశ అభివృద్ధిలో కీలక రంగాలైన బ్యాంకింగ్ బీమా రంగాల ప్రైవేటీకరణ దిశగా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రెండు ప్రభుత్వ రంగ

బ్యాంకులు ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.ప్రీబడ్జెట్ సంప్రదింపుల్లోనే రెండు లేదా మూడు బ్యాంకులను ప్రైవేటీకరిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూకోబ్యాంకు పంజాబ్ సింధ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను ప్రైవేటీకరించే యోచనలో

కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే కేంద్రం క్లారిటీ ఇవ్వనుంది.

20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే?
కాలుష్య నివారణకు ఈసారి బడ్జెట్ లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు  నిర్మల సీతారమన్ వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించడానికే 20 ఏళ్లు దాటిన బండ్లను రోడ్డెక్కకుండా తుక్కుకు పంపాలని

ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20ఏళ్లు.. వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తివివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్య నివారణకు రూ.2217

కోట్లు కేటాయించారు. కరోనాకు ముందు నుంచే గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఆటోరంగంలో జోష్ నింపడానికే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్
దేశంలో మెజార్టీ పన్నులు

చెల్లించే ఉద్యోగులున్నారు. వారు ఎంతో ఆశగా బడ్జెట్ వైపు చూశారు. కానీ ఆదాయపు పన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చింది.ఇక సీనియర్ సిటిజన్లకు మాత్రం  కేంద్రం ఊరట కల్పించింది. 75 ఏళ్లు దాటిన సిటీజన్లకు ఐటీ రిటర్న్ దాఖలకు కేంద్రం

మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పింఛను వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను వడ్డీ తో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. ఇక పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్తిక

మంత్రి ప్రకటించారు. రూ.50లక్షల లోపు ఆదాయం 10 లక్షలలోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

750 పాఠశాలలు
దేశంలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100 సైనిక పాఠశాలలు గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు.

కోటి మందికి ఉజ్వల పథకం
మరో

కోటిమంది లబ్ధిదారులకు వంట గ్యాస్ అందించనున్నారు. కొత్తగా మరో 100 జిల్లాల్లోని నగరాలకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ జమ్మూకశ్మర్ రాష్ట్రంలో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేయనున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam