DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలో తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభ ?

*తొలి సమావేశ వివరాలు వెల్లడించిన పీఠాధీపతులు*

*ధార్మిక రక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సాధు పరిషత్ ఆగ్రహం* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, ఫిబ్రవరి 04, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ హిందూ ధార్మిక వ్యవస్థలపై జరుగుతున్నా

దాడులు, ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సాధుపరిషత్ ఆగ్రహంగా ఉందని పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి, భువనేశ్వరిపీఠం కమాలానంద భారతి స్వామి తెలియచేసారు.  

తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో బుధవారం జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు తొలిసమావేశం వివరాలను గురువారం మీడియా కు

తెలిపారు. ఈ నేపథ్యంలోనే చేపట్టవలసిన కార్యాచరణను త్వరలో తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించే  సనాతన ధర్మ పరిరక్షణ మహాసభ లో తీసుకుంటామని వివరించారు. 

సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు తొలి సమావేశం లో సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు పాల్గొన్నారు.

 హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే విధంగా మరీ ముఖ్యంగా  పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య  కార్యాచరణకు కు పటిష్ఠ విశాల వేదికను రూపొందించేందుకు ఉద్దేశించిన సమాలోచనల పరంపరలో ఇది మొదటిది. అందుబాటులో ఉండి, వెంటనే కలిసేందుకు అంగీకరించిన కొద్దిమంది ప్రసిద్ధ పీఠాధిపతులతో

తొలి సమావేశం జరిగిందని తెలిపారు. 

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో  కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు విజయేంద్ర సరస్వతి మహా స్వామి ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో ఆలయాలు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులపై

చర్చించామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పుష్కరాలు సమయంలో ఆలయాలు ధ్వంసం చేశారని గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేశారని..రామతీర్థంలో రాముడు తల ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మైనారిటీ మెప్పుకోసం హిందూ దేవాలయాల ఆదాయన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు. హిందూ

మతాన్ని మట్టుపెట్టే కార్యక్రమాలను ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల నుండి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్న పట్టించుకోకుండా ఉన్నారని  కమలానంద భారతీ స్వామి మండిపడ్డారు. 

దేవాదాయ శాఖా తీరు బాలేదు: .. . 

పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి

మాట్లాడుతూ... ఏపీలో దేవాదాయ శాఖ పనితీరు బాగలేదని విమర్శించారు. అన్యుల పెత్తనం పెరిగిందన్నారు. ఆలయాల ఆదాయాన్ని సెక్యులర్ సంక్షేమ పధకాలకు ఒక్క పైసా ఖర్చు చేయకూడదని...ఆలయాల నిధులను ఇతర హిందూ ఆలయాల కోసం ఖర్చు చేయాలన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి, నిపుణులు ద్వారా ఏపీలో జరుగుతున్న దాడులు...నగలు, ఆస్తులను కాపాడేందుకు కమీటి

ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పురావస్తు శాఖ పరిధిలోని ఆలయాలను పరిరక్షణకు వారితో ప్రభుత్వం చర్చించి ఆలయాల సంరక్షణకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆలయాల విషయంలో పురావస్తు నిబంధనల్లో సడలింపులకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. 

తొలి సమావేశంలో పాల్గొన్నవారు: .

1. కంచి కామకోటి జగద్గురువు శంకర

పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి.
2. దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిథిగా శృంగేరి శారదా పీఠం ఎడ్మినిస్ట్రేటర్ గౌరీశంకర్.
3.హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి.
4   పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ

విద్యాశంకర భారతి మహాస్వామి. 
5. తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి.
6. అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిథి.
7. శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీ కమలానంద భారతి మహాస్వామి.
8. శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి

ముత్తీవి శ్రీమాన్ సీతారాం గురువర్యులు.
9 . శ్రీమాన్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, విశ్రాంత దేవాదాయ శాఖా సీతా డైరక్టర్.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam