DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కును కాపాడండి, నిర్మలను కోరిన బీజేపీ నేతలు

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2021  (డి ఎన్ ఎస్):* లక్షలాది మంది ఉద్యమ స్ఫూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ కాకుండా కాపాడమని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ను ఆంధ్ర బీజేపీ నేతలు కోరారు. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు సి ఎం రమేష్, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఆంధ్ర బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ లు ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో జరిగిన పోరాటాలు గుర్తు చేయటం జరిగినది. అటువంటి చరిత్రగల విశాఖ ఉక్కు ను రక్షించమని కోరడం

జరిగినది. వందలాది మంది ప్రజలు తమ సొంత వ్యవసాయ భూములను ప్లాంట్ ఏర్పాటు కోసం ధారాదత్తం చేయడం జరిగిందన్నారు. వారిలో చాలా మందికి నేటికీ పరిహారం ఇవ్వని విషయాన్నీ గుర్తు చేసారు. ఇది రాజకీయ కోణంతో కాకుండా సరియైన కార్యాచరణతో చూడాలని కోరారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam