DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*తప్పుడు నిర్ణయాలతో బీజేపీ గమనానికి గండి పడుతుందా?*

*వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు లో పోరాట యోధులెందరో?*

*32 మంది ప్రాణత్యాగాలకు విలువలేకుండా చేయడం సరికాదు*

*ఢిల్లీ నుంచి గల్లీ వరకూ బీజేపీ వ్యతిరేక నినాదాలే మారుమ్రోగి* 

*ఉత్తరాది లో రైతు ఉద్యమం, దక్షిణాది లో స్టీల్ ఉద్యమం*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2021  (డి ఎన్ ఎస్):* అఖండ భారతావని లో జై భారత్ నినాదాలను పలికించిన భారతీయ జనతా పార్టీ, నేడు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల ఫలితం పార్టీని ముంచెనా? తేల్చేనా? సందిగ్ద స్థితిలో ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలత కన్నా వ్యతిరేకపవనాలే ఎక్కువగా వీస్తున్నాయి. తొలివిడత లో మోడీ

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన దేశ ప్రజలు మరింత అధిక మెజారిటీ ఇచ్చి రెండవ పర్యాయం అధికారాన్ని ఇచ్చారు. అయితే రెండవ విడత ప్రభుత్వం లో తీసుకున్న నిర్ణయాలు ప్రజల నుంచి వ్యతిరేకత అధికంగానే ఉంది. దీనిలో భాగాంగానే ఉత్తరాది లో రైతుల ఉద్యమం, దక్షిణాదిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ. 

రైతుల

ఉద్యమం పేరిట వేలాది మంది ఉద్యమకారులు గత 75 రోజులుగా రోడ్డెక్కిన పట్టించుకోని మోడీ ప్రభుత్వం, తనదైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడం వల్ల ప్రజల్లో కొంత నిరసన వ్యక్తమయింది. నేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను సైతం ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ కి వ్యతిరేకంగా నిరాసన గళం

పెరిగిపోయింది. 

2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వాన్ని స్వాగతించిన దేశ ప్రజలే నేడు అదే మోడీ పై తీవ్ర వ్యతిరేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మోడీ వ్యతిరేక నినాదాలు పెరిగిపోతున్నాయి.  

విశాఖ ఉక్కు  -ఆంధ్రుల హక్కు : . .. 

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం తో

మొదలై స్టీల్ ప్లాంట్ ఉద్యమం సుమారు 32 మంది ప్రాణత్యాగాలు ఫలితంగా ప్రారంభమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేడు ప్రయివేట్ వ్యక్తులకు అమ్మడం పట్ల విశాఖ వాసులంతా మండిపడుతున్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కు సుమారు 26 వేల ఎకరాలు భూసేకరణ చేశారు. దీనిలో 3 వేల ఎకరాలలో గంగవరం పోర్ట్ కు భూ కేటాయింపులు చేసారు. దీనికి

అదనంగా విశాఖ నగరం నడిబొడ్డులోని HB కొలని లో 24 ఎకరాలు ఉంది. ఈ ప్రాంతంలో ఒక్కో ఎకరం కోట్లు ఖరీదు చేస్తుంది. ఆదాయం కావాలంటే . . ఈ భూములు అమ్ముకోవచ్చు అనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. 

దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్ లకూ క్యాప్టివ్ గనులు ఉన్నాయి, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి తప్ప. దీనికి గనులు

కేటాయించాలంటూ కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోని కేంద్రం, నేడు అమ్మెందుకు నిర్ణయం తీసుకుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.  

ప్రస్తుతం ఈ ప్లాంట్ లో 17000 రెగ్యులర్ ఉద్యోగులు విధుల్లో ఉండగా, 22000 కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరందరికీ అదనంగా సుమారు 1 లక్ష మీద పరోక్షంగా

ఆధార పడి ఉన్నారు. 2026 నాటికి 7000 మంది రెగ్యులర్ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.  ఆంధ్ర లో ఏకైక PSU మాత్రమే.  లాభాల్లో ఉన్నది నష్టం లోకి ఎందుకు వెళ్ళింది, కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల కాదా అని ప్రశ్నిస్తున్నారు. 

స్టీల్ ప్లాంట్ ఏర్పాటు లో పోరాట యోధులెందరో . . .

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం లో

ప్రత్యక్షంగా పాల్గొన్న పోరాట యోధులెందరో ఉన్నారు. వారిలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తెన్నేటి విశ్వనాధం, ఎం. వెంకయ్యనాయుడు సైతం ఉన్నారు. అయితే వెంకయ్యనాయుడు ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఈ ప్లాంట్ ప్రాధాన్యత, ఏర్పాటు లక్ష్యం తదితర అంశాలు కూలంకషంగా తెలిసిన అతి తక్కువమందిలో వెంకయ్య కూడా ఒకరు కావడం

గమనార్హం. 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చెయ్యగలిగే శక్తి కేవలం ఈయనకే ఉంది అన్నది, రాష్ట్ర బీజేపీ సహా, అందరి విశ్వాసం.  

బీజేపీ గమనానికి గండి పడుతుందా? 

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అంతంత

మాత్రం ఉంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ అసంబద్ధ నిర్ణయం వల్ల పూర్తిగా నష్టపోయే అవకాశం కనపడుతోంది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తో పాటు, బీజేపీ పై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడు నాటి రాజ్యసభలో చేసిన ఒక్క ప్రసంగంతో ప్రజల మన్ననలు అందుకున్నారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. అయన ప్రత్యక్ష

రాజకీయాల్లో లేరు, పైగా పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో ఆ స్థాయి నాయకులూ ప్రస్తుతం ఎవ్వరూ లేకపోవడం, ఉన్నవారికి ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కి చాలా నష్టం చేకూర్చే పరిస్థితి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam