DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ రైతు బజార్ ప్రవేశ గేట్ దాటి వెళ్లాలంటే పద్మవ్యూహమే

*సీతమ్మ ధార రైతు బజార్ . .ప్రజలకు అదో పెద్ద బేజార్*  

*గేట్ కి అడ్డంగా వాహనాల పార్కింగ్, పట్టింపులేని నిర్వాహకులు* 

*రైతు బజార్ బాధ్యతారాహిత్యం- జనానికి తప్పని కష్ఠాలు. .* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2021  (డి ఎన్ ఎస్):* నగరానికి

నడిబొడ్డులో ఉన్న రైతు బజార్లలో సీతమ్మధార రైతుబజార్ కు అత్యంత డిమాండ్ ఉంది. సీతమ్మధార, హెచ్ బి కొలని, గురుద్వారా, సత్యం సెంటర్, నక్కవాని పాలెం ఇలా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, కూరగాయల విక్రయదారులతో నిత్యం కళకళలాడుతుంది. అయితే ఈ రైతు బాజార్ కు

వెళ్లాలంటేనే జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతు బజార్ కు రెండు మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన రహదారి పై ఉన్నా రెండు ప్రవేశ ద్వారాలు ( ఎంట్రన్స్ గేట్) లకు అడ్డంగా వాహనదారులు తమ ద్విచక్రవాహనాలు, కార్లు, పార్కింగ్ చేస్తుండగా, లగేజి దింపడానికి వచ్చే ఆటోలు సైతం గంటల సమయం అక్కడే నిలిపి వేస్తుండడంతో లోపలకి

ప్రవేశించేందుకు ఖాతాదారులు నానా అవస్థలు పడుతున్నారు. పైగా జంతువులూ లోనికి ప్రవేశించకుండా ప్రవేశ ద్వారాల వద్ద ఇనుప గొట్టాలు బిగించారు. ఒక మనిషి లోపాలకి వెళ్లాలంటే జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సి ఉంది. దీనికి తోడు ఈ గేట్ దగ్గరే బైక్ లు, ఆటోలు అడ్డంగా పెడితే, వాటిని తప్పించుకు వెళ్ళేవాళ్ళకి ఇనుప గొట్టాలు తగిలే

అవకాశం ఉంది. 
ఈ విషయం పై స్థానిక రైతు బజార్ స్థానిక నిర్వాహకులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా వాహనాలు ద్వారానికి అడ్డంగా పెట్టడం లో ఏ మాత్రం మార్పు లేదు. జనం ఎస్టేట్ మేనేజర్ మాటవినడం లేదా, అసలు ఈయనే పట్టించుకోవడం లేదా అని విషయం తెలియాల్సి ఉంది.  ఖాతాదారులు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళల్లో ఉంటారు, అయితే కూరగాయలు

తీసుకువచ్చే ఆటోలు మాత్రం రోజూ వచ్చేవే, అయినా వీళ్ళకి కనీసం భాద్యత లేకపోవడం గమనార్హం. 

గతంలో ప్రవేశ ద్వారానికి ప్రక్కన వాహనాలు పార్క్ చేసుకునే సదుపాయం కల్పించారు, ఒక సెక్యూరిటీ ని కూడా పెట్టారు. ఇప్పుడు పార్కింగ్ స్థానంలో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బళ్ళు పెట్టడం జరుగుతోంది. దాంతో వాహనాల

పార్కింగ్ తో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. చిన్న వ్యాపారాల బళ్ల కి తగిన స్థానం చూపించనంతవరకూ 
వాహనాల పార్కింగ్ ఇబ్బందులు, జనానికి కష్టాలు తప్పవు. 
 
ఎప్పుడో వచ్చే అధికారుల పర్యటనల సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే తప్ప, ఈ సమస్యకు పరిష్కారం రాదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam