DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది కొత్త రథానికి సంప్రోక్షణ పూజాదికాలతో ప్రారంభం 

*మతోన్మాద పిచోళ్లు దగ్ధం చేసిన రధం స్థానంలో కొత్తది*
 
*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 13, 2021  (డి ఎన్ ఎస్):* మతోన్మాద పిచోళ్లు తగులబెట్టిన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానంలో రథం స్థానంలో కొత్త గా నిర్మించిన రథానికి శనివారం

సంప్రోక్షణ జరిగింది. గత ఏడాది కొందరు మతోన్మాదులైన హిందూ వ్యతిరేక శక్తులు హిందూ దేవాలయంపై చేస్తున్న దాడుల్లో భాగంగా అంతర్వేది రథాన్ని పూర్తిగా తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఆలయం పూర్తిగా ఆంధ్ర ప్రభుత్వ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆధ్వర్యవంలోనే నడుస్తోంది. ఈ ఆలయంలో ఇతరులు తగులబెట్టిన రథం స్థానంలో కొత్త రథాన్ని

నిర్మించేందుకు పూర్తిగా హిందూ దేవాదాయ శాఖా నుంచి ఇచ్చిన కోటి రూపాయల నిధులతోనే నిర్మించారు. అయితే పాత రథాన్ని తగులబెట్టిన హిందూ వ్యతిరేక అసాంఘిక శక్తులను పట్టుకోవడం లో ప్రభుత్వం, పోలీసులు విఫలమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆస్తులు నష్టపోయింది హిందువులే. 

శనివారం జరిగిన సంప్రోక్షణ కార్యక్రమం లో విశాఖకు

చెందిన ఓ పీఠాధిపతి పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని ప్రారంభించారు. ఈ అంతర్వేది కొత్త రథాన్ని 90 రోజుల్లోనే దేవదాయ శాఖ పూర్తి చేసింది. అనుకున్న సమయానికంటే ముందుగానే అంతర్వేది రథం చేయడం జరిగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam