DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మున్సిపోల్ ఎన్నికల ప్రక్రియ పునః ప్రారంభించాలి

*గత నామినేషన్ల లో వైసీపీ ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడింది.* 

*రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు జనసేన పార్టీ వినతి*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర

ఎన్నికల సంఘం ప్రకటించడం ప్రజాస్వామ్యయుతంగా లేదని జనసేన పార్టీ అభిప్రాయం పడింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సమావేశం అనంతరం జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్నీ ప్రకటించారు. గతం లో నామినేషన్ల సమయంలో అధికార పార్టీ ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడిందని, ప్రతిపక్షాల అభ్యర్థులపై బెదిరింపులు,

దాడులు జరిపిందన్నారు. పార్టీ సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పునః ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తమ ప్రకటనపై మరోసారి పునరాలోచన చేయాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, అందరికి అవకాశం కల్పించే విధంగా న్యాయ నిపుణులతో చర్చించి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల

ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్నారు. సంవత్సరం క్రితం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పుడు అధికార పార్టీ అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. ఇతర పార్టీల అభ్యర్థులను మభ్యపెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టారు. చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని

బెదిరించారు. వీటన్నింటిని మరచిపోయి ఆగిన చోట నుంచే మొదలుపెట్టాలని ప్రకటించడం సబబు కాదు. పంచాయతీ ఎన్నికల్లో మనం చూశాం. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, బెదిరింపులు వాటితోపాటు కోవిడ్‌ దృష్ట్యా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రాజకీయ పార్టీగా స్వాగతించామన్నారు. సుమారు ఈ ఏడాది కాలంలో అభ్యర్ధులను, ఓటర్లను

అధికారపక్షం మభ్యపెట్టిందన్నారు. ఆగిన చోట మళ్లీ ఎన్నికలు ప్రారంభించడం ప్రజాస్వామ్యబద్ధం కాదన్నారు. వైసీపీ పార్టీ  ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుందని మండిపడ్డారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను ఇంటింటికి పంపించి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి.

వీటన్నింటిని ఎస్ఈసీ దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిజాయతీగా, పారదర్శకంగా జరగాలంటే... నామినేషన్ల ప్రక్రియను మరోసారి ప్రారంభిస్తే తప్ప అందరికి న్యాయం జరగదని భావిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ కొత్తగా ప్రారంభించేందుకున్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam