DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*రాజమండ్రి చేరిన విశాఖ స్టీల్ పరిరక్షణ బైక్ ర్యాలీ*

*Guntur - Vizag bike rally supporting RINL reached Rjy*

*స్టీల్ నిరసన గుంటూరు నుంచి విశాఖ కు బైక్ ర్యాలీ*

*విశాఖ ఉక్కు పరిరక్షణకు మద్దతుగా యువత బైక్ ర్యాలీ* 
 
*యువత బైక్ ర్యాలీకి రాజమహేంద్రవరం లో ఘన స్వాగతం* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ

ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 14వ   గుంటూరు నుంచి విశాఖ కు యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. 'ఎవడురా అమ్మేది.. ఎవడురా కొనేది అని నినదిస్తూ వందలాది మంది యువతీ, యువకులు, విద్యార్థులతో ఉన్న ఈ బైక్ ర్యాలీ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి

వద్ద ఘన స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ ప్రజానీకం బైక్ ర్యాలీని స్వాగతించారు. 

తమ ప్రాంతాల పొలిమేర్లలో స్వాగతం పలికి, ఊరి చివరివరకు వచ్చి వీడ్కోలు పలికారు. మరోవైపు దారిపొడవునా విద్యార్థి, యువజన నేతలు విశాఖ ఉక్కుతో పాటు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఈ పోరాటంలో

భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన బైక్ యాత్ర సోమవారం ఉత్తేజపూరిత వాతావరణంల  ప్రారంభమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అమ్మేస్తే ఊరుకోం' అంటూ నినాదాలు చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యాన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ.

ఎఐవైఎఫ్ - ఎఐఎస్ఎఫ్ చేపట్టిన ఈ యాత్రకు సోమవారం వేమగిరి వద్ద రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా విద్యార్థి, కార్మిక నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి మధ్యాహ్నం కేశవరెడ్డి విద్యా సంస్థల ప్రాంతంలోని ఘనంగా భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్

బంకు వద్ద బైక్ ర్యాలీ కి భారీ గా విద్యార్థిని విద్యార్థులు స్వాగతం పలికారు.

అనంతరం అక్కడ విద్యార్థి సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ

పరిరక్షణకు  నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమని,  విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా,  పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్నారు  కేవలం రు.4,900 కోట్లతో ప్రారంభిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విలువ రూ.2 లక్షల కోట్లకు చేరిందని

తెలిపారు. రాష్ట్రంలోని పార్లమెంట్ సభ్యులంతా లోక్ సభ, రాజ్యసభలను స్తంభింపజేయాలని కోరారు. 

ఈ యాత్రకు అడుగడుగునా ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు. రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద, కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద  ఘన స్వాగతం పలికి, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావంగా

పాల్గున్నారు. 

రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద, కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ సెంటర్ లలో ఏర్పాటైన బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత  జిల్లాలోకి ప్రవేశించిన ఈ యాత్ర రాజానగరం వరకు వెంట వెళ్లి పెద్దాపురం వెళ్ళింది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam