DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద భారత పరిక్రమణ లో వేదపఠనం చేసే వారు వీరే

*నాలుగు వేద పారాయణలతో భారత దేశ ఆలయాల యాత్ర*  

*ఫిబ్రవరి 14 న మొదలైన యాత్ర 30 రోజుల పాటు భారత పరిక్రమణ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం కు చెందిన సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ సారధ్యంలో చేపట్టిన భారత పరిక్రమణ శంకర

యాత్ర నాల్గవ రోజుకు చేరుకుంది. బుధవారం విశాఖ సమీపం లోని చింతామణి గణపతి ఆలయం వద్ద మొదలైన ఈ వేదపఠన యాత్ర లో ఋగ్వేద పారాయణ ( ఆరవ అష్టకం), రుద్రాభిషేకం, లక్ష్మి గణపతి హోమం నిర్వహించారు. తదుపరి అనకాపల్లి లోని గౌరీ పరమేశ్వర ఆలయం, తుని తపోవనం స్వామిజి ఆశ్రమం, లో పారాయణాలు పూర్తి చేసుకుని అన్నవరం చేరుకుంటుంది. తదుపరి రాత్రి

విజయవాడకు ప్రయాణం కొనసాగనున్నట్టు ఈ యాత్ర ట్రస్ట్ నిర్వాహకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ తెలియచేసారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు చేపట్టిన వేదయాత్ర స్ఫూర్తిగా 30 రోజుల పాటు నాలుగు వేదాల పారాయణలతో భారత దేశ ఆలయాలను సందర్శించనున్నట్టు తెలిపారు. ఈ యాత్రకు ఫిబ్రవరి 14 న శ్రీకారం చుట్టామని

వివరించారు. ఈ యాత్ర లో ఒక్కక్క వేద పండిత బృందం ఒక్కో దిశలో ప్రయాణిస్తుందన్నారు. ఋగ్వేద,  కృష్ణ, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వ వేద పండితులు ఒక్కో దిశలోని ఆలయాలను సందర్శిస్తూ అక్కడ ఆయా వేద ఋక్కులను పఠనం చెయ్యడం జరుగుతుందన్నారు. 

భారత దేశ తూర్పు భాగం (1 - 3 ) : సంపూర్ణ ఋగ్వేద పారాయణం.  
భారత దేశ దక్షిణ భాగం (3 - 5 ) :

సంపూర్ణ శుక్ల యజుర్వేద పారాయణం. 
భారత దేశ దక్షిణ భాగం (5 - 7 ) : సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణం. 
భారత దేశ పశ్చిమ భాగం (7 - 9 ) : సంపూర్ణ సామవేద పారాయణం. 
భారత దేశ ఉత్తర భాగం (9 - 11 ) : సంపూర్ణ అధర్వ  వేద పారాయణం. 
 
సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ కృష్ణ యజుర్వేద స్మార్త పండితుల

నేతృత్వం లో సాగుతున్న ఈ వేదం యాత్ర లో  పాల్గొనే వేదపండితులు వీరే: . . 

ఋగ్వేదం : శ్రీదత్త శర్మ ఘనపాఠి  (విశాఖపట్నం), జి. కల్యాణ చక్రవర్తి ఘనపాఠి ( తిరుపతి)

శుక్ల యజుర్వేదం: కీలంబి రాఘవాచార్యులు - కాణ్వశాఖ  ( హైద్రాబాద్),  కుమార భారత సుబ్రహ్మణ్యాచార్యులు - కాణ్వశాఖ ( హైద్రాబాద్)

కృష్ణ

యజుర్వేదం: జి. అరవింద కుమార్ ఘనపాఠి ( తిరుపతి), సన్నిధానం దీక్షితులు ఘనపాఠి ( హైద్రాబాద్).

సామవేదం : శ్రీనివాస్ జోషి ( హైద్రాబాద్). జీవం కుమార్ ( హైద్రాబాద్)

అధర్వ వేదం: రావూరి విజయ్ కుమార్ శర్మ ( గుంటూరు), అమన్ కుమార్ పాండే ( హైద్రాబాద్).
 
ఇరగవరపు హరీష్ శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ),
/> పాణిగ్రాహి కౌండిన్య శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ),
పేరెపు శశికాంత్ శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ), 


ఫిబ్రవరి 14 న మొదలయ్యే ఈ ఆధ్యాత్మిక పవిత్ర యాత్ర మార్చి 14 నాటికి విశాఖ చేరుతుందన్నారు. 

సప్తఋషి  వేద సంస్కృత పాఠశాల,  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, సంపత్

వినాయకగర్ ఆలయం, కాళీమాత గుడి, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయం, సప్త ఋషీశ్వర ఆలయం, శివానందమూర్తి ఆశ్రమం, అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం క్షేత్రం, శ్రీముఖలింగం, కోణార్క్, పూరి లోని శ్రీ జగన్నాధ స్వామి ఆలయం, సిరసపల్లి లోని చింతామణి గణపతి ఆలయం, అనకాపల్లి గౌరీపరమేశ్వర ఆలయం, తుని తపోవనం స్వామిజి ఆశ్రమం, అన్నవరం శ్రీ

సత్యనారాయణ స్వామి ఆలయం, కృష్ణానది, విజయవాడ దుర్గ గుడి, మంగళగిరి పానకాల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, శ్రీకాళ హస్తి ఆలయం, తిరుమల క్షేత్రం

శుక్ల / కృష్ణ యజుర్వేదం: .. 

కంచి లోని విష్ణు వరదరాజ స్వామి ఆలయం, శివకంచి లోని కామాక్షి ఆలయం, కామకోటి పీఠం, అది శంకరాచార్య జన్మస్థానం కలది, గురువాయూర్, శ్రీనగేరి,

శివమొగ్గ, కొల్హాపూర్, త్రయంబకేశ్వర, నాసిక్, ఓంకారేశ్వర, ఉజ్జయిని ( మహాకాళేశ్వర్), కాలభైరవ క్షేత్రం.

సామవేదం పారాయణ: 
ద్వారకా, కురుక్షేత్రం, శ్రీనగర్, శంకరాచార్య హిల్స్,  

అధర్వ వేద పారాయణ:

జమ్మూ, జాగేశ్వర్, అయోధ్య, గయా, వారణాసి, త్రిపుర, కలకత్తా, విశాఖపట్నం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam