DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 నుంచి వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవాలు

*పాంచాహ్నిక దీక్షతో పనసలవలస లో కల్యాణోత్సవాలు*

*ఐదు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు*

*రంగనాధం అయ్యంగార్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో . .. .* 

*27 న శిష్య పరంపరకు ఆచార్యులచే మంత్రోపదేశ అనుగ్రహం* 

*(DNS రిపోర్ట్ : వెంకటాచార్యులు S,  బ్యూరో చీఫ్,

శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, ఫిబ్రవరి 18, 2021  (డి ఎన్ ఎస్):* శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని రేగిడి ప్రాంతంలోని పనసలవలస లో వేంచేసిన అత్యంత ప్రసిద్ధికెక్కిన, పురాతన సత్సంప్రదాయ దేవాలయం శ్రీరాజవేణుగోపాల స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామి కల్యాణ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు శ్రీవైష్ణవ ఆచార్య

పీఠం వ్యవస్థాపకులు శ్రీమత్తిరుమల రంగనాధం ( అయ్యవార్లంగారు) ఆచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఈ సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా నిర్వహించే ఈ కార్యక్రమాల వివరాలను ఆచార్య స్వామి తెలియచేసారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు మాఘశుద్ధ దశమి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి ( ఈనెల 27 వరకూ)

 పాంచాహ్నిక దీక్షతో సాగుతాయన్నారు. కార్యక్రమం వివరాలు:

22 న సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవచనం, పరిషత్, ఉత్సవ సంకల్పం, రుత్విక్ వరుణ, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, కల్యాణ మండప, అంతరాలయం దేవతా, వాస్తుమండప, యోగీశ్వర దేవత ఆరాధనలు, పతాక ప్రతిష్ట, అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠ, విశేష హోమములు,

ఇడావాచన మంగళాశాసనం, 

23 న భీష్మ ఏకాదశి పర్వదినోత్సవం. ఉదయం 5 గంటల కు సుప్రభాతం, ప్రాతరారాధన, మండపారాధన, నిత్యా హోమములు, గరుడాంగ హోమాలు, అష్టదిక్పాలక ఆవాహన, ధ్వజ ప్రతిష్ట (సంతానార్ధులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది) మంగళాశాసనం. 
అదే రోజు సాయంత్రం ఆరాధనలు అనంతరం సాయంత్రం 7 గంటలకు గరుడ వాహనము తో తిరువీధి

అనంతరం ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది.  రాత్రి 9 గంటల నుంచి శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీరాజవేణు గోపాల స్వామి కల్యాణ మహోత్సవం నభూతో నభవిష్యత్ రీతిలో నిర్వహించనున్నారు. 
 
24 న ద్వాదశి ఉదయం నిత్య ప్రాతరారాధనలు, హోమం, బలిహరణ, ప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం విజయనగరం వాస్తవ్యులు కందాళ  ఆండాళ్ పద్మప్రియ

బృందం చే గీత గోవిందం సంగీత విభావరి జరుగుతుంది. 

25 న  త్రయోదశి ఉదయం నిత్య ప్రాతరారాధనలు, హోమం, బలిహరణ, ప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం గరివిడి వాస్తవ్యులు కాండూరి ఆముక్త మాల్యద చే నృత్య ప్రదర్శన జరుగుతుంది. 

26 న చతుర్దశి, నిత్య ప్రాతరారాధనలు, హోమం, బలిహరణ, ప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం గరుడ

వాహన తిరువీధి, అనంతరం అత్యంత వైభవంగా దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ చరిత్ర విన్నపం, మంగళాశాసనం జరుగుతుంది. 
 
27 న మాఘ శుద్ధ పౌర్ణమి. నిత్య ప్రాతరారాధనలు, హోమం, బలిహరణ, ప్రసాద వితరణ జరుగుతాయి. అదే రోజు ధ్వజ అవరోహణం, మహా పూర్ణాహుతి జరుగుతాయి.
అదే రోజు ఆచార్యుల శిష్య పరంపర కుటుంబ సభ్యులకు మంత్రోపదేశం ( సమాశ్రయణం)

అనుగ్రహించబడుతుంది. మహదాశీర్వచనం అనంతరం మంగళాశాసనం. సాయంత్రం ద్వాదశారాధనలు, సప్తవరణాలు, పలికా నిమజ్జనం, పుష్పాంజలి, ఆశీర్వచనం జరుగుతుంది.  

ఈ ఐదు రోజుల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనదలచిన భక్తులు ఆలయ అర్చకులు రవి స్వామి ని 9866966191 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలియచేసారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam