DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చి 1 వరకు టోల్ గేట్ ల వద్ద ఫ్రీ ఫాస్టాగ్‌ కౌంటర్లు 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2021  (డి ఎన్ ఎస్):* దేశ వ్యాప్తంగా టోల్ గేట్ ల వద్ద రద్దీ తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫాస్టాగ్ విధానం. ఇప్పడికే ఈ నెల 16వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ నిబంధన అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం, ఇంకా ఫాస్టాగ్‌ కొనుగోలు చేయని

వాహనదారులకు శుభవార్త అందించింది. మార్చి 1 వరకూ ఫాస్టాగ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఫాస్టాగ్‌ ధర రూ.100గా ఉంది. మార్చి 1వ తేదీ వరకు 770 టోల్‌ప్లాజాల వద్ద, బ్యాంకులు ఉచితంగా ఫాస్టాగ్‌ను అందజేస్తాయి. బ్యాలెన్స్‌ రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. ఫాస్టాగ్‌ను ప్రోత్సహించే

ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 

తొలి రెండు రోజుల్లో 87% వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ద్వారా చెల్లింపులు జరిపాయని వెల్లడించింది. 60 లక్షల ట్రిప్పులకు ఫాస్టాగ్‌ ద్వారా రూ.95 కోట్ల మేర వసూళ్లు జరిగాయని పేర్కొంది. 100 టోల్‌ప్లాజాల వద్ద 90% వాహనాలు ఫాస్టాగ్‌తో వెళ్లాయని

వివరించింది. 
మైఫాస్టాగ్‌ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. వాహనం నంబరును నమోదు చేయగానే నగదు నిల్వల వివరా లు తెలుసుకోవచ్చని వివరించింది. నగదు నిల్వలు ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో ఉంటాయని తెలిపింది. ఆకుపచ్చ రంగు ఉంటే తగినన్ని నిల్వలు ఉన్నాయని, కాషాయం రంగు ఉంటే నిల్వలు

తక్కువగా ఉన్నాయని, ఎరుపు రంగులో ఉంటే బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఫాస్టాగ్‌ ఆఫ్‌లైన్‌ రీచార్జ్‌ కోసం టోల్‌ప్లాజాల వద్ద 
40 వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీవోఎస్‌) యంత్రాలను అందుబాటులో పెట్టినట్లు వెల్లడించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam