DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గమ్మ ను సిబ్బంది ఏ మేరకు దోచుకున్నారో బయటపడుతుందా?

*కొబ్బరి చిప్ప నుంచి, ఖరీదైన చీరల వరకు అన్నీ దోపిడీయే.?* 

*ఏసీబీ చేతికి సిబ్బంది చీకటి చిట్టాల పుస్తకం, బయటపడినా?* 

*క్యాలండర్ల భాగోతం దేవాదాయ శాఖదే. .ట . .?: ఈఓ సురేష్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* విజయవాడ లోని కనకదుర్గ

ఆలయంలో జరుగుతున్న అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో వెలుగు చూస్తున్న తిమింగలాలు తైతక్కలాటలు, దోపిడీ దొంగల మాయదారి వేషాలకు సమాధానం లభించాల్సియుంది. కనకదుర్గమ్మ ఆస్తులకే రక్షణ లేకుండా అందినకాడికి నిధులు, అమ్మవారి సంపద తరలిపోతున్నాయనే ఆరోపణలు ఉండటంతో ఏసీబీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.  గత మూడురోజులపాటు 25 నుండి 40

మంది వరకు ఆ శాఖా అధికారులు సిబ్బంది బృందాలుగా విడిపోయి వేరు వేరు విభాగాల్లో అర్ధరాత్రి వరకు చేసిన తనికీల్లో పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. 

ఆలయానికి సంభందించిన అన్ని టెండర్లలో అమ్మకాలే ఆఖరికి అమ్మవారికోసం కొట్టే కొబ్బరికాయ కి టికెట్ లేదు, అది గుళ్ళోకి తీసుకు వెళ్లాలంటే ఉచితమే అయినా, దాన్ని

 కేటాయించిన స్థలంలో కొట్టాలంటే అక్కడే తిష్ట వేసే దోపిడీ దార్లకు 20 రూపాయలు నుంచి రూ. 50 వరకూ చెల్లించాల్సిందే. 

కరోనాకాలంలో అర్చకుల కోసం సర్వ శ్రేయోనిధినిధిని 25 కోట్లవరకు ఖర్చు చేసినా, అవి మాత్రం అర్చకులకు చేరలేదని వారే తెలియచేస్తున్నారు. ఈ నిధులు పూర్తిగా దారి తప్పాయని ఆలయ వర్గాలే

మండిపడుతున్నాయి. 

దొంగిలించిన రధం వెండి సింహాలు కి కారణం సెక్యూరిటీ కాంట్రాక్టర్ ని భాద్యుడిగా చేయగా తన టెండర్ పోతుందేమోనని వాటివిలువ 8 లక్షలు చెల్లించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 
జమ్మిదోడ్డిలో ఉన్న వసతి సూట్లు దుర్వినియోగం, దీన్ని కొందరు పార్కింగ్ ప్రదేశంగా వాడుకుంటున్న తీరు

కూడా ఉంది. 

అత్యంత కీలకమైన తాంబూలాలు పుస్తకం ఏసీబీ అధికారుల చేతికి లభించినట్టు సమాచారం. అది బయట పెడితే, దానిలో పైనుండి క్రింది స్థాయి వరకు ఎవరికెంత నెలనెలా ఇచ్చింది పూర్తిగా అందులో వెల్లడవుతాయి సిబ్బంది మొత్తం బెంబేలెత్తిపోతున్నారు. అమ్మవారి ఆస్తులను, ఆదాయాన్ని ఏస్థాయిలో అంతా కలిసి భోజనం చేసేసారో

బట్టబయలు అయ్యే అవకాశం ఉంది. దీన్ని బయటకు రానివ్వకుండా ఇప్పడికే ప్రయత్నాలు జరుగుతూ ఉండవచ్చు. 

ఇనుప తుక్కు, ఖరీదైన అమ్మవారికి సమర్పించిన పట్టుచీరల స్థానంలో చౌకబారువి పెట్టి లెక్కలు చూపటం, నిత్యావసర సరకుల్లో దారుణమైన తేడాలు, ఇలా అన్ని స్థాయిలోను అక్రమాలు ఏసీబీ మూడు రోజుల దర్యాప్తులో  వెల్లడైనట్లు

తెలిసింది. 

నిఖార్సైనపాలన అందించేందుకు బద్ధులైన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎవరు చెప్పినా వినకువినకుండా దర్యాప్తు కొనసాగించాలని అదేశాలిచ్చినట్లు కూడా తెలుస్తోంది. 

దీనితో కుంభకోణాలతో ప్రమేయం ఉన్న పలువురు బెంబేలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ రోజు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ తో

ఫోన్లైన్ లో మాట్లాడగా ఏసీబీ దాడిలో తూకం లు ఇతర  విషయాల్లో చిన్న చిన్న అవకతవ్వకలు జరిగిన విషయాలు వెల్లడయ్యాయన్నారు. 

క్యాలండర్ల భాగోతం దేవాదాయ శాఖదే. .ట . . .
 
అమ్మవారి కేలెండరల ప్రచురణపై వివరణ ఇస్తూ   ముఖ్యమంత్రి ఫోటోను  ఆలయం ముద్రించలేదని ఎండోమెంట్ శాఖ విఐపి లకు ఇచ్చేందుకు ముద్రించిందని ఆలయం

తరఫున ముద్రించలేదని తనకు తెలియదని సురేష్ కార్యనిర్వహణాధికారి. తెలియచేస్తున్నారు. అయితే అలయం తరఫున స్వల్పంగా మాత్రమే ముద్రించినట్లు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam