DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చ్ 2 నుంచి విశాఖ లో మరీటైమ్ ఇండియా సమ్మిట్  

*ప్రధాని మోడీ చే అంతర్జాతీయ వర్చువల్ సదస్సు ప్రారంభం*  

*దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరు.* 

*24 న పోర్ట్ కళావాణి లో సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ : . .* .

*3 న ఏపీ లో పెట్టుబడులపై సదస్సు, సీఎం పాల్గొనే అవకాశం*

*విశాఖ పట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్

వెల్లడి.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2021  (డి ఎన్ ఎస్):* మార్చ్ 2 నుంచి విశాఖ వేదికగా మరీటైమ్ ఇండియా సమ్మిట్ 2021 పేరిట జరుగుతున్న అంతర్జాతీయ స్ధాయి వర్చువల్ సదస్సు ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నట్టు విశాఖపట్నం పోర్టు ట్రస్టు

 చైర్మన్  కే. రామమోహనరావు తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతి విశ్వ విఖ్యాతం అయ్యే విధంగా భారీ ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలియచేసారు. ఆయన అందించిన వివరాల ప్రకారం. . . 

* పోర్టులు, నౌకా మరియు జలరవాణా మంత్రిత్వ శాఖ మార్చ్ 2, 2021 నుంచి 4 వరకూ మారీటైమ్ ఇండియా సమ్మిట్ ను

వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించనుంది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత మారీటైమ్ ను అంతర్దాతీయ స్ధాయికి తీసుకువెళ్లడమే మారీటైమ్ ఇండియా సమ్మిట్ 2021 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

* మారీటైమ్ విభాగంలో విధాన రూపకర్తలు, వివిధప్రభుత్వ రంగ సంస్ధలు, జాతీయ అంతర్జాతీయ పెట్టుబడి దారులు, విభాగ

నిపుణులు, నౌకాయాన రంగం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్టులు, జాతీయ మారీటైమ్ బోర్టులకు సంబంధించిన స్టేక్ హోల్డర్(వాటాదారులు) లు పాల్గొననున్నారు.

* సదస్సులో పోర్టు మౌలిక వసతుల అభివృద్ది, నౌకా నిర్మాణం, రీసైక్లింగ్, మరమ్మత్తులు, అంతర్గత కనెక్టివిటి, బహురకాల లాజిస్టిక్స్, తీరప్రాంత రవాణా, అంతర్గత నీటి రవాణా, బల్క్

కార్గో రవాణ, పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, నైపుణ్య అభివృద్ది , సముద్ర(మారీటైమ్) వాణిజ్యం వంటి వివిధ  విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు.

*సదస్సులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాలపై ప్రత్యేక సమావేశం 3వ తేదీన మధ్యాహ్నం 1230 గంటలకునిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ

ప్రత్యేక సెషన్ లో పాల్గొనే అవకాశం ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోర్టుల అభివృద్ది కోసం , మారీటైమ్ సంబంధిత అవకాశాలు, వివిధ పెట్టుబడుల అవకాశాలను ఈ ప్రత్యేక సమావేశంలో డిజిటల్ పెవిలియన్ ద్వారా ప్రదర్శించనున్నారు.

* ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాల నుంచి 20 వేలకు పైగా డెలిగేట్స్ ఈసమ్మిట్ లో

పాల్గొననున్నారు. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, పోర్టులు నెలకొని ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించిన విస్తృతమైన అవకాశాలను చర్చించనున్నారు.

* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పోర్టులు, నౌకా, జలరవాణా మంత్రి శ్రీ మన్షుక్ మాండవీయ లతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు.

* భారత

మారీటైం రంగం పరిశ్రమల అభివృద్దికి చేయవలసిన, తీసుకోవలసిన చర్యలపై ప్రపంచవ్యాప్తంగా మారీటైం రంగంలో ఉన్న పలువురు నిపుణులు తమ అనుభవనాలను, కీలకమైన విషయాలను పంచుకోనున్నారు.

* కేంద్ర పోర్టు, నౌకా నీటి  రవాణా శాఖా మంత్రి శ్రీ మన్షుక్ మాండవీయ సమ్మిట్ కు సంబంధించిన బ్రోచర్ ను, వెబ్ సైట్ (డబ్యూడబ్యూడబ్యూ. మారీటైమ్

ఇండియా సమ్మిట్. ఇన్) ను విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పాల్గొనేలా అవకాశం కల్పించారు.

* మేజర్ పోర్టులు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షిప్ యార్డ్ లు,డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,మారీటైమ్ బోర్డులు, మారీటైమ్ ఏజెన్సీలు, పోర్టు ఆధారిత

అభివృద్దితో పాటు మారీటైమ్ సెక్టర్ లో పరస్పర అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు 45000 కోట్లు విలువైన 45 ఒప్పందాలను పెట్టుబడి దారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.

* పోర్టు అధారిత పారిశ్రామికీకరణ పోర్టు నగరాలు, మారీటైమ్ క్లస్టర్ల నిర్మణం అనే అంశంపై విశాఖపట్నం పోర్టు

ట్రస్టు , చెన్నై పోర్టు ట్రస్టులు మార్చ్ 3 వ తేదీ మధ్యహ్నం 2 గంటల నుంచి 330 గంటల వరకూ ప్రత్యేక సెషన్ ను నిర్వహిస్తున్నాయి.

*లెఫ్టినెంట్ జెజి. కమోల్ సక్ ప్రొంప్రయూన్, పోర్టు అధారిటి ఆఫ్ ధాయ్ లాండ్, కి-చన్ నమ్, బుసాన్ పోర్టు అధారిటీ, జోస్ ఫిర్మో, పోర్ట్ ఆఫ్ ఏసియూ, బ్రెజిల్,  విన్సెంట్ డెసాయిడీలీర్, పోర్ట్ ఆఫ్

జీబ్రుగ్గే, బెర్జియం, సంజయ్ శర్మ, ఆర్సెలర్ మిట్టల్, భూషన్ కుమార్ జాయింట్ సెక్రెటరి, మినిస్ట్రి ఆఫ్ పోర్ట్ నౌకా జలరవాణా మొదలైన ప్రముఖులు తమ అనుభవాలను వివరించనున్నారు.

*రామమోహనరావు, చైర్మన్ , విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఈ సెషన్ లో ప్రారంభోన్యాసం చేయనున్నారు.

* విశాఖ పట్నం పోర్టు ట్రస్టు మరియు

ప్రైవేటు టెర్మినల్ ఆపరేటర్లు తమ వద్ద ఉన్న పెట్టుబడి అవకాశాలు, తమ కార్యకలాపాలను తెలిపేలా డిజిటల్ పెవిలియన్ లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

* భారత మారీటైమ్ విభాగంలో చేటుచేసుకుంటున్న అభివృద్దిని తెలుసుకునేందుకు, ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగ  అవకాశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు  విశాఖపట్నం

పోర్టు ట్రస్టు తమ పోర్టు వినియోగదారులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 

*ఆహ్వానితులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. 

*వర్చువల్ విధానంలో సదస్సును వీక్షించే వారు పెట్టుబడి అవకాశాలు, అభివృద్ది అంశాలు తెలుసుకునే వీలు

కలుగుతుంది.

*ఆహ్వానితులు మరిన్నివివరాల కోసం విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు చెందిన అధికారులు 1.  కె.కనకరాజు, డిప్యూటీ పర్సెనల్ ఆఫీసర్, 8499977323, 2)  కె. రాజెంద్ర కుమార్, జాయింట్ డైరెక్టర్ 9948883272ను సంప్రదించగలరు.

•    పెవిలియన్ ల ద్వారా వీక్షకులు లైవ్ లో వీడియో ఆడియో విధానంలో చర్చించుకునే వీలు

కల్పించారు.

*ప్రదర్శనకారుల పెవిలియన్ ద్వారా వ్యాపార ప్రచారం, పెట్టుబడులను బి2బి వర్చ్యూవల్ సమావేశాల ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు.

24 న సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ : . . .

*మారీటైమ్ ఇండియా సమ్మిట్ 2021 అంతర్జాతీయ స్ధాయి వర్చువల్ సదస్సు కోసం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఈ నెల 24 న విశాఖపట్నం

జాతీయ రహదారి సమీపంలోని పోర్టు డైమండ్ జూబిలీ మైదానంలోని  కళావాణి బాంకెట్ హాల్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇందులో పోర్టు స్టేక్ హాల్డర్స్ , పిపిపి ఆపరేటర్లు, రాష్ట్ర యంత్రాంగం, పోర్టు వినియోగదారులు, ఏపి చాంబర్ ఆఫ్ కామర్స్, సిఐఐ మొదలైన వారు పాల్గొంటారని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam