DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అంశం పై అసెంబ్లీ లో తీర్మానం. .

*ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం*

*ఏపీ మంత్రిమండలి భేటీ లో కీలక అంశాలపై నిర్ణయం.*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 23, 2021  (డి ఎన్ ఎస్):* రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీర్మానం చేయాలని ఆంధ్ర ప్రదేశ్

మంత్రిమండలి నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  వైఎస్‌ఆర్‌ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు ఆమోదించింది. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని

వెంకట్రామయ్య వివరాలు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేబినెట్​ చర్చించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం

తెలిపింది. 

వైఎస్‌ఆర్‌ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చించారు. కడప జిల్లా కొప్పర్తి గ్రామంలో 598.59 ఎకరాల భూమి మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుపై మంత్రివర్గంలో ప్రతిపాదనకు వచ్చింది.  కడప జిల్లా

అంబాపురం గ్రామంలో మరో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు 93.99 ఎకరాల కేటాయించే అంశంపైనా చర్చించారు. ఈ భూమిలను ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చే అంశంపై మంత్రులు చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 3148 ఎకరాల భూమిని ఎకరం రూ.1.65 లక్షలకు విక్రయించే అంశంపై కెబినెట్

చర్చించింది. 

తూర్పుగోదావరి జిల్లా కొన గ్రామంలో 165.34 ఎకరాల భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకి ఎకరం 25 లక్షల చొప్పున విక్రయించే అంశం ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే

ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలో ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam